Home /News /telangana /

WIFE KILLED HUSBAND DUE TO SEXUAL HARASSMENT SHE REMANDED VRY MDK

Wife killed Husband : భర్తను చంపిన భార్య, మంచిదే అంటున్న పోలీసులు..! ఎందుకు చంపిందో తెలిస్తే షాక్...!

భర్తను చంపిన భార్య

భర్తను చంపిన భార్య

Wife killed Husband : ఇటివల ఓ భార్య ,తన భర్తను గొడ్డలితో నరికి చంపింది. అయితే ఆమెను అరెస్ట్ చేసి విచారించిన పోలీసులు మాత్రం ఆమె చేసిన పనిని సమర్ధిస్తున్నారు.. ఎందుకంటే భర్త చిత్రహింసలతో పాటు వాడు చేసిన పనికి వాళ్లే ఆశ్చర్యపోయారు..

ఇంకా చదవండి ...
    కొంతమంది శాడిస్టు భర్తలు ఉంటారు.. వారు చేసే అఘాయిత్యాలను భార్యలు భరిస్తూ వస్తుంటారు.. ఎన్ని చిత్రహింసలు పెట్టిన భరిస్తారు.. మేల్ డామినెట్ వ్యవస్థలో ఇవన్ని అలవాటు పడిన వారు మౌనంగా ఉంటూ వస్తారు.. కాని ఒక్కోసారి భర్తలు శాడిస్టుల్లాగా వ్యవహరిస్తారు. తమకు కావాల్సింది పొందడం కోసం కట్టుకున్న భార్య అని కూడా చూడారు. కనీసం ఓ మహిళకు ఇచ్చే గౌరవం కాదు కాదా... మరి రాక్షసంగా ప్రవర్తిస్తారు.

    ఇలా తనపై రాక్షసంగా పాల్పడినందుకే ఈ నెల ఆరున సిద్దిపేట్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని విఠలాపూర్ గ్రామంలోని ఐదుపదుల వయస్సులో ఉన్నా మర్కంటి ఎల్లయ్యను తన భార్య నర్సవ్వ కడతేర్చింది. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. భర్తను చంపాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. దీంతో ఆమె చెప్పిన సమాధానాలతో వారికి దిమ్మతిరిగింది. వాడు పెట్టిన చిత్రహింసలకు పోలీసులే షాక్‌కు గురయ్యారు.

    RTC md Sajjanar : సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త, 30 మంది ఉంటే బస్సు వాళ్ల వద్దకే..అదనపు చార్జీలు లేవు..


    ఈ సంధర్భంలో ఆమె చెప్పిన కొన్ని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి.. ఎల్లయ్య,నర్సవ్వల దంపతులకు ఓ కూతురు ఉండడంతో ఆమె పెళ్లి చేయడంతో భార్యభర్తలు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉంటున్నారు.. ఇదిలా ఉంటే ఆరుపదులో వయస్సులో ఉన్న ఎల్లయ్య ప్రతిరోజు నాలుగు సార్లు సెక్స్‌లో పాల్గోనాలని భార్యను ఒత్తిడి తేచ్చాడని చెప్పడంతో పాటు అందుకు ఒప్పుకోకపోతే హింసించేవాడని తెలిపింది. ఇలా రోజు శృంగారం కోసం చిత్రహింసలు పెట్టడడం ఎల్లయ్యకు కామన్‌గా మారిపోయింది. రోజు ఘర్షణ పడడం తనకు కావాల్సింది సంపాదించుకోవడం కోసం ఎల్లయ్య ఎంతటి దారుణానికి దిగుతాడని చెప్పింది.

    Nalgonda : వీళ్లకేమైనా పిచ్చా..! ఒకడు సమాధి తవ్వితే.. మరోకడు తలను వేరు చేసి ఆలయం వద్ద పెట్టాడు..?


    ఈ క్రమంలోనే ఈ నెల 6 ఆరోజు శృంగారంలో పాల్గొవడానికి నిరాకరించిన నర్వవ్వను చాలా చిత్రహింసలకు గురి చేశాడు. ఘర్షణ పడ్డాడు అంతే కాదు యోనిలో కారంపోడి కూడా పోసినట్టు నర్సవ్వ పోలీసులకు వివరించింది.దీంతో కొపోద్రిక్తురాలైన నర్సవ్వ బాధను తట్టకోలేక తెల్లవారు మూడు గంటలకు ఎల్లయ్యను ఇంట్లో ఉన్న గొడ్డలితో నరికి చంపినట్టు తెలిపింది. దీంతో పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు. దీంతో ఆమె చేసిన పనిని సమర్ధించారు. కాని చట్టప్రకారం హత్య చేయడం నేరం కాబట్టి ఆమెను కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్టు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, Sangareddy

    తదుపరి వార్తలు