Home /News /telangana /

WIFE KILLED HER HUSBAND ALONG WITH HER LOVER IN VIKARABAD DISTRICT VRY

Illeagl affair : భర్త తాగుబోతుగా మారాడని భార్య తల్లిగారి ఇంటికి వెళ్లింది.. అయితే అక్కడ మరొకరితో...

Illeagl affair : భర్త తాగుబోతుగా మారాడని భార్య తల్లిగారి ఇంటికి వెళ్లింది..

Illeagl affair : భర్త తాగుబోతుగా మారాడని భార్య తల్లిగారి ఇంటికి వెళ్లింది..

Illeagl affair : భర్త తాగుబోతుగా మారడంతో తల్లిగారి ఇంటికి వచ్చిన ఓ వివాహిత మరోకరితో వివాహేతర సంబంధం కొనసాగించింది. అయితే తిరిగి భర్తతో వెళ్లినా.. ఆ అలవాటును మాత్రం మారలేదు.. దీంతో ప్రియుడి కోసం అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చింది.

    జీవిత కాలం కలిసి ఉండాల్సిన భార్య భర్తలు.. అక్రమ సంబంధాల ముసుగులో ఒకరినొకరు హత్య చేసుకుంటున్నారు. కలిసి భవిష్యత్ తరాలకు దారి చూపాల్సిన వారు మధ్యలో జైలు పాలు అయి తమ పిల్లల భవిష్యత్‌ను అంధకారం చేస్తున్నారు. ( Wife killed her husband ) అక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తలను హత్య చేయిస్తూ తాము కటకటాల పాలు అవుతున్నారు. అయితే ఇద్దరి మధ్య సంఘర్షణలతో పిల్లల భవిష్యత్‌క అంధకారం అవుతోంది. ఈ క్రమంలోనే ఓ మహిళ భర్త తాగుబోతుగా మారడాని మరోకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను హత్య చేయించింది. ఆ తర్వాత విషయం బయటపడి కటకటాలపాలైంది.

    వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ ( Vikarabad ) జిల్లాలోని నవాబ్ పేట మండలం ఎల్లంకొండ గ్రామానికి చెందిన చిన్నమల్కు శివశంకర్(30)కు వెల్దుర్తి గ్రామానికి చెందిన శివలీలతో 9 ఏళ్ళ క్రితం వివాహం ( marriage ) అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె పుట్టారు. శివశంకర్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో రోజు తాగి ఇంటికి వచ్చేవాడు.భార్య వద్దని వారించడంతో ఇద్దరి మధ్యరోజూ గొడవలు జరగటం మొదలయ్యింది. ఈ క్రమంలో భర్తతో విసుగు చెందిన శివలీల ఏడాది క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది.

    ఇది చదవండి : తోటి ఉద్యోగినితో సహజీవనం.. ఆమె కూతురుపై కూడా కన్నేశాడు...! మరి ఆమె ఎం చేసింది..?


    అక్కడ తన తల్లి గారింటి పక్కన ఉండే జహంగీర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో శివలీల తిరిగి మళ్లీ 7 నెలల క్రితం భర్త దగ్గరకు తిరిగి వచ్చింది. భర్త వద్దకు వచ్చిన కొన్నాళ్లకు జహంగీర్ ఆమె ఇంటికి వచ్చి వెళ్లటం మొదలెట్టాడు. ఈ విషయం శివశంకర్ దృష్టికి వచ్చింది. దీంతో మళ్ళీ భార్యా భర్తల మధ్య గొడవ మొదలయ్యింది. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలనుకుంది. ఈవిషయం జహంగీర్ తో చెప్పింది.భర్తను హత్య చేసేందుకు అప్పడి నుండి స్కెచ్‌లు వేశారు..( Wife killed her husband )దీంతో ఈనెల 26న జహంగీర్, శివశంకర్ ను తన స్కూటీపై తీసుకువెళ్లి మద్యం తాగించాడు.

    అనంతరం నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి బండరాయితో తలపై కొట్టాడు . ఆ దెబ్బలకు శివశంకర్ స్పృహ తప్పిపడిపోయాడు. శివశంకర్ చనిపోయాడనుకుని….. ఈవిషయం శివలీలకు ఫోన్ చేసి చెప్పి తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం కొన ఊపిరితో ఉన్న శివశంకర్ ను అటుగా వెళ్తున్న గ్రామస్తులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాని అదే రోజు చికిత్స పొందుతూ శివశంకర్ మరణించాడు.దీంతో శివశంకర్ అక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా భార్య శివలీల ఫోన్ కాల్ లిస్ట్ చెక్ చేయగా హత్యకు సంబంధించిన వివరాలు దొరికాయి. దొరికింది. ( Wife killed her husband ) పోలీసులు మృతుడి భార్య శివలీలను తమ స్టైల్లో విచారించారు. దీంతో శివలీల చేసిన నేరం ఒప్పుకుంది. ప్రియుడితో కలిసి హత్య జరిగిన తీరు మొత్తం వివరించింది. దీంతో జహంగీర్ ను కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇద్దరినీ రిమాండ్ కు తరలించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime story, Murder case, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు