Home /News /telangana /

Hyderabad crime : వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ... ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్..ఆ తర్వాత...!

Hyderabad crime : వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ... ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్..ఆ తర్వాత...!

Hyderabad crime : వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ... ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్..ఆ తర్వాత...!

Hyderabad crime : వివాహిత ఫేస్‌బుక్ ప్రేమ... ప్రియుడితో కలిసి భర్త కిడ్నాప్..ఆ తర్వాత...!

Hyderabad crime : సోషల్ మీడియా..( Social media )అట్రాక్షన్ యువతి యువకులనే కాదు.. పెళ్లైన వారిని కూడా ఆ కూపిలోకి లాగుతోంది. దీంతో వివాహం (marriage)అయిన వారు సైతం ఒక్కటి అయ్యెందుకు వేదికలుగా మారుతున్నాయి. ఇలా ఇద్దరు పిల్లలు ఉన్న ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి విడాకులకు(Divorce) బలవంతం చేసింది.

ఇంకా చదవండి ...
  ఆమెకు ఇద్దరు పిల్లలు.. ఒకయనకు రెండు సార్లు పెళ్లిళ్లు కూడ అయి...పిల్లలు కూడ ఉన్నారు.. వీళ్లద్దిరి జీవితం సజావుగానే సాగుతున్నా.. ఆ ఇద్దరు కలిసి తమ భర్త, భార్యలను వదిలిపెట్టి ఒక్కటి కావాలనుకున్నారు.. ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఏర్పడింది. అంతే అయితే ఇద్దరు ఒక్కటి కావడానికి పిల్లలు, పెళ్లి బంధం అడ్డుగా ఉన్నాయి. దీంతో తనకు విడాకులు(Divorce) కావాలని ఆమె భర్తను డిమాండ్ చేసింది.. అయితే ఇందుకోసం ఆ భర్త మాత్రం అంగీకరించలేదు.. రెండు నచ్చజెప్పి చూసింది అయినా ఆ భర్త మొండికేయడంతో చివరకు ప్రియుడితో (lover)కలిసి భర్తను కిడ్నాప్(kidnap) చేయింది. బలవంతంగా విడాకుల పేపర్ల మీద సంతకం తీసుకుంది.

  వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్‌ వాజీద్, అప్షియా బేగం(24)లకు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. షేక్‌ వాజీద్‌ (31) నగరంలోని ఓ చెప్పుల దుకాణంలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.అయితే అప్షియాబేగం సోషల్‌ మీడియాలో(social media) చురుగ్గా ఉండగా.. ముషీరాబాద్‌కు చెందిన క్యాటరింగ్‌ నిర్వ హించే ఆసిఫ్‌ పరిచయం ఫేస్ బుక్(face book) ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితికి చేరుకుంది. ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ మహిళ తన భర్తను వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకుంది. అయితే షేక్ వాజీద్‌కు గతంలోనే రెండుసార్లు వివాహం జరిగి పిల్లలు కూడా ఉన్నారు.

  ఇది చదవండి : పెళ్లంటూ రెస్టారెంట్‌కు.. ఆ తర్వాత రూంకి.. కట్ చేస్తే.. ఫోటోలు ఇంటర్‌నెట్‌లో


  అయితే ఇద్దరు కలిసి జీవించాలని గట్టి నిర్ణయమే తీసుకున్నారు..ఈ క్రమంలోనే అప్షియా బేగం గత ఏప్రిల్‌ నెలలో (april month)ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా ప్రియుడి దగ్గరకు వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త ఫిర్యాదు మేరకు మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని భర్తకు(husband) అప్పగించారు.

  అయినా ఆమె మాత్రం తన ప్రియుడు ఆసిఫ్‌ను విడిచి ఉండలేక పోయింది. ఈ క్రమంలోనే మరోసారి పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. ఇక అప్పుడు కూడా వదిలి పెట్టని భర్త షేక్ వాజీద్ తన అత్తామామల సహాయంతో ప్రియుడి వద్ద ఉన్న ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు.

  ఇది చదవండి : యువతిపై గ్యాంగ్ రేప్.. నిజామాబాద్‌లో దారుణం..బలవంతంగా మద్యం తాగించి..


  అయినా ఆమెలో మాత్రం మార్పు రాలేదు.. ఇటు తల్లిదండ్రులు ,(parents) అటు భర్త ఒత్తిడి తట్టుకోలేక పోయింది. ఎలాగైన భర్తకు దూరంగా ఉండి ప్రియున్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక మనసులో ఉండడంతో తన భర్త నుండి శాశ్వతంగా విడిపోయెందుకు విడాకులు తీసుకోవాలని భావించింది. ఈ క్రమంలోనే భర్తపై విడాకుల కోసం భర్తపై ఒత్తిడి తెచ్చింది. అయినా భర్త మాత్రం వినలేదు.. .

  విడాకులు ఇచ్చేందుకు భర్త ఒప్పుకోకపోవడంతో భర్తను కిడ్నాప్(kidnap) చేసి కుల పెద్దల మధ్య విడాకులు తీసుకోవాలని స్కెచ్ వేసింది. ఇందుకోసం తన ప్రియుడు సహాకారం కూడా ఉండడంతో ప్రియుడు, ప్రియురాలు ఇద్దరూ ముషీరాబాద్‌లో ఖాజీ ఎదుట విడాకుల కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా షేక్‌ వాజీద్‌ను కిడ్నాప్‌ చేసేందుకు ముషీరాబాద్‌కు మరో ముగ్గురితో కిడ్నాప్‌కు స్కెచ్ వేసింది.

  ఇది చదవండి : వరి ధాన్యం కొనుగోలులో కేంద్రాన్ని ఒప్పిస్తా.... సీఎం కేసీఆర్ మెడలు వంచుతా.. !


  ఈ క్రమంలోనే గత సోమవారం సాయంత్రం 6గంటల సమయంలో ఈ నలుగురు కలిసి చెప్పుల దుకాణంలో ఉన్న షేక్‌ వాజీద్‌ను బలవంతంగా ద్విచక్ర వాహనాలపై కిడ్నాప్‌ చేసి తీసుకువెళ్లారు. వాజీద్‌ను ముషీరాబాద్‌కు తీసుకు వెళ్లి తీవ్రంగా కొట్టి విడాకుల పత్రాలపై సంతకాలు తీసుకున్నారు.

  వాజీద్‌ను కిడ్నాప్ చేస్తుండగా చూసిన షాపు యజమాని సాయంత్రం 8గంటల సమయంలో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను(cc camera) పరిశీలించారు. కిడ్నాప్‌ తీరును తెలుసుకుని.. వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి బాధితుడి సెల్‌ఫోన్‌ టవర్‌ను ఆధారంగా వాజీద్‌ను బంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో ముషీరాబాద్‌లో వాజీద్‌ను గుర్తించి రక్షించారు. అప్షియాతో పాటు అతనికి సహకరించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.. అయితే కిడ్నాప్‌లో ప్రధాన నిందితుడు ఆసిఫ్‌తో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా కేసు నమోదు అయినా తర్వాత సెల్‌ఫోన్ ఆధారంగా కేవలం మూడు గంటల్లోనే కిడ్నాప్‌ను చేధించారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Crime story, Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు