Murder : భర్త హత్యకు బంగారం సుపారిగా ఇచ్చిన భార్య.. అక్రమానికి అడ్డువస్తున్నాడని ప్లాన్

భర్త హత్యకు బంగారం సుపారిగా ఇచ్చిన భార్య.. అక్రమానికి అడ్డువస్తున్నాడని ప్లాన్

Murder : అక్రమ సంబంధం మోజులో పడి, కట్టుకున్న ఇల్లాలే తన భర్తను హత్య చేయించింది..అదికూడా తన వద్ద ఉన్న బంగారం సుపారిగా ఇచ్చి దారుణానికి పాల్పడింది..

  • Share this:
తన వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది.తన ప్రియుడితో కలిసి బంగారం డబ్బులు మరోవ్యక్తికి సుపారిగా ఇచ్చి హత్య చేయించింది. అయితే హత్య జరిగిన నాలుగు రోజులకే పోలీసులు మిస్టరీ చేధించి ఇందుకు కారణమైన భార్య ,ప్రియుడు, సుపారి తీసుకున్న వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు..

వివరాల్లోకి వెళితే..కోదాడకు చెందిన మన్నూరు వెంకన్నకు పదమూడు సంవత్సరాల క్రితం సైదమ్మ అనే మహిళతో వివాహం జరిగింది..కొద్ది రోజుల పాటు ఇద్దరి మధ్య సజావుగా సంసారం సాగడంతో ఇద్దరు మగపిల్లలు సైతం ఉన్నారు..కాగా రోజువారి కూలిపని చేసుకునే వెంకన్న తన పుట్టిన ఊరు వదిలి 12 సంవత్సరాలుగా మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్నాడు.

ఈ నేపథ్యంలోనే రెండెళ్ల క్రితం మిర్యాల గూడేనికి చెందిన సైదులుతో, సైదమ్మ అక్రమ సంబంధం పెట్టుకుంది. కాగా సైదులు హైదరాబాద్ నగరంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇక కొద్ది రోజుల క్రితం ఈ విషయం వెంకన్నకు తెలియడంతో భార్యభర్తల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి..అక్రమ సంబంధంపై భార్యను మందలించాడు..అయినా..సైదమ్మ మాత్రం మారలేదు..దీంతో వెంకన్న మిర్యాలగూడ నుండి ఇళ్లు కాళీ చేసి కోదాడలో నివాసం ఉంటున్నాడు..అయినా సైదమ్మ, సైదయ్యల మధ్య వివాహేతర సంబంధం కొనసాగించారు..

దీంతో వెంకన్న భార్యను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించాడు..అయితే ఇది సైదమ్మకు నచ్చలేదు..ఈ క్రమంలోనే భర్తను హతమార్చాలని నిర్ణయించింది..ఇద్దరి మధ్య అడ్డుగా వస్తుండంతో ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది..ఎలాగైన ప్రాణాలు తీయాలని నిర్ణయించుకున్నారు..ఇందుకోసం గతంలో మిర్యాలగూడలో ఉంటున్న కమాలాకర్ అనే తన పాత ఇంటియజమానికి ఫోన్ చేసి హత్య ప్లాన్ వివరించింది..ఇందుకోసం డబ్బుతోపాటు బంగారం ఇస్తానని ఆశ చూపింది..

దీంతో సరే అని చెప్పిన కమలాకర్‌కు హత్య చేసేందుకు సుపారిగా 50 రూపాయలు, రెండు తులాల బంగారం ఇస్తానని చెప్పింది..ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం కమలాకర్ ప్లాన్ చేశాడు..తనకున్న పాత పరిచయంతో వెంకన్నను బయటకు పిలిచి..తన బైక్‌పై వెంటబెట్టకుని కోదాడ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ వెంచర్ వద్దకు వెళ్లి మద్యం సేవించారు..అయితే కమలాకర్ ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం మత్తు ట్యాబెట్లు కూడా వెంట తీసుకు వెళ్లి మద్యంలో కలిపాడు..

దీంతో మత్తులో ఉండగానే , వెంకన్నను రాయితో మోది చంపాడు..అనంతరం ఆ విషయం సైదమ్మకు ఫోన్ చేసి చెప్పి అక్కడి నుండి పారిపోయాడు.అయితే కొడుకు మరణంపై వెంకన్న తల్లి అప్పుడే అనుమానాలు వ్యక్తం చేసింది..దీంతో పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని ..నాలుగు రోజుల్లోనే సైదమ్మ ప్రధాన సూత్రధారిగా కనుక్కొన్నారు..అనంతరం హత్య చేసిన కమలాకర్ తోపాటు ప్రియుడు సైదులను సైతం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.
Published by:yveerash yveerash
First published: