(P. Mahendar, News18, Nizamabad)
భర్తను (Husband) చూడకుండానే భార్య (Wife) కూడా మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఆమె భర్తను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలై ఆయన మృతిచెందాడు. అయితే ప్రమాదం విషయం తెలిసిన భార్య.. తన భర్తను చేసేందుకు మరిదితో కలసి బైక్ పై పయనమైంది. విధి ఆడిన వింత నాటకమో ఏమో.. వీరికి రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో మృతుని భార్య, మరిదికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య మృతి (Wife died) చెందింది. తమ్ముని పరిస్థితి విషమంగా ఉంది.
కామారెడ్డి (Kamareddy) జిల్లా బిక్కనూర్ మండలం అంతంపల్లికి చెందిన కర్రోళ్ల సిద్దయ్య (48), కర్రోళ్ల సిద్దవ్వ దంపతులు.. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే కర్రోళ్ల సిద్దయ్యా శుక్రవారం సాయంత్రం ద్విచక్రవాహనం పై వెళ్తున్నారు.. అయితే గ్రామ శివారులో 44వ జాతీయ రహదారి పై గుర్తుతెలియని వాహనం ఢీ కొనడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని భార్య సిద్ధవ్వ, తమ్ముడు లింగం కన్నీరుమున్నీరవుతూ భిక్కనూరు నుంచి ద్విచక్రవాహనం పై సంఘటనా స్థలానికి పయనమయ్యారు.
అయితే దారి మధ్యలో బైక్ అదుపు తప్పి ఇరువు కింద పడ్డారు. దీంతో భార్య, మరిదికి తీవ్ర గాయాలయ్యాయి.. గాయపడిన సిద్దవ్వను, లింగం ను అంబులెన్స్ లో కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.. మరోవైపు సిద్దయ్య మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి పంపించారు. ఇదే సమయంలో గాయపడిన సిద్దవ్వ చికిత్స పొందుతూ మృతి చెందింది . మృతుని తమ్ముడు లింగం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతన్నారు. దీంతో మృతు ల కుటుంబ సభ్యులు , బంధువుల రోదనలు మిన్నంటాయి. లింగం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
సిద్దయ్య.. సిద్ధవ్వ దంపతులు పేర్లు మాదిరే కలిసిమెలిసి ఉండేవారు.. చివరకు వారు చావులోనూ ఒకరి వెంట ఒకరు వెళ్లిపోవడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు కంటతడి పెట్టారు. చావులోను విడని బంధం వారిదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరువురి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
హైదరాబాద్‌లో..
ఇటీవలె హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య భర్తలు మృతిచెందారు. అతివేగంతో అదుపుతప్పిన ఓ కారు బైక్‌ని ఢీకొట్టి.. అనంతరం కాల్వలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు చనిపోయారు. అప్పా జంక్షన్ వద్ద హిమాయత్ సాగర్ సర్వీసు రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. మృతులను మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు దంపతులుగా గుర్తించారు. వారి కుమార్తెకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో మైనర్ కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Kamareddy, Nizamabad, Road accident, Wife and husband died