హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mahabubnagar : ఆస్తికోసం భర్తను , భార్య ఏం చేసిందంటే.. ?

Mahabubnagar : ఆస్తికోసం భర్తను , భార్య ఏం చేసిందంటే.. ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mahabubnagar : భర్త బతికిండగానే ఆయన పేరుమీద ఉన్న ఆస్తిని కాజేసేందుకు ఓ భార్య దారుణానికి పాల్పడింది. డెత్ సర్టిఫికెట్ సృష్టించి ఆస్తిని కాజేసింది. స్థానిక సెక్రటరీ సంతకాన్ని ఫోర్జరీ చేసేందుకు ప్రయత్నం చేయడంతో అసలు విషయం బయటపడింది.

ఆస్తుల కోసం మానవ సంబంధాలు మంటగలిసి పోతున్నఅనేక సంఘటనలు ఆధునిక సమాజంలో చోటుచేసుకోవడం సాధరణ విషయంగా మారిపోయింది. ఆస్తుల ఘర్షణల్లో కనీసం బ్లడ్ రిలేషన్‌ను కూడా మర్చిపోయి కొంతమంది కౄరంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే భార్యభర్తలు కూడా బతికి ఉన్నప్పుడే వారు చనిపోయినట్టు సృష్టించి ఆస్తులను కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటనే నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..రోజురోజుకు మానవత్వం మంట కలుగుతుంది దానికి ఇదొక నిదర్శనం డబ్బుకోసం ఎంతకైనా ఇస్తారని ఉదాహరణ ఇది.. భూముల ధరలు ఎక్కువగా కావడంతో తండ్రి కొడుకుల అన్నదమ్ముల చివరికి భార్య భర్తల మధ్య స్వార్థం మొదలైంది. భర్త మరణించినట్లు ఓ వివాహిత నకిలీ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి భర్త పేరుతో ఉన్న భూమిని తన పేరున విరాసత్ చేసుకున్న ఘటనలో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ చేశారు.

ఇది చదవండి : తెలంగాణలోని రైతులకు శుభవార్త.. పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం.. వివరాలివే..


నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల పోలీస్ స్టేషన్ ఎస్ ఐ అరుణోదయ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తెలకపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన రేణుక అనే మహిళ తన భర్త బీరయ్య బతికి ఉండగానే ఆయన పేరుతో ఉన్న 1.20 ఎకరాల భూమిని తన పేరు మీదకు మార్చుకోవాలని పథకం వేసింది. అందుకోసం గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డితో పాటు స్థానికంగా మీ సేవ కేంద్రం నిర్వహిస్తున్న మరో వ్యక్తి సహకరించారు. ఈ క్రమంలోనే పెద్దూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సందీప్ సంతకాన్ని ఫోర్జరీ చేసి బీరయ్య నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించారు.

ఆ ధ్రువ పత్రంతో వారు స్థానిక తెలకపల్లి తహసిల్దార్ కార్యాలయంలో మూడు నెలల కిందట బీరయ్య పేరున ఉన్న 1.20 ఎకరాల భూమిని రేణుక పేరు మీదకు విరాసత్ చేయించారు. అయితే ఆమె భర్త మరణంపై అనుమానం రావడంతో స్థానిక ఎమ్మార్వో విచారణ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి సందీప్ తన సొంత ఫోర్జరీ చేశారని పోలీసులకు చేశాడు.

కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఫోర్జరీకి సంబంధించి నిర్ధారణ చేశారు. అనంతరం నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.

First published:

Tags: Crime news, Nagarkarnol district

ఉత్తమ కథలు