నా భార్య కొడుతోందిరా.. వచ్చి కాపాడు.. సోదరుడికి ఫోన్ చేసి చెప్పిన భర్త.. అతడు వెళ్లేసరికి ఇంట్లో కనిపించకపోవడంతో..

ప్రతీకాత్మక చిత్రం

‘తమ్ముడూ, నా భార్య నన్ను కొడుతోంది. నా భార్య సోదరుడు, ఇంటి యజమానులంతా కూడబలుక్కున్నారు. నన్ను చావ గొడుతున్నారు. వచ్చి రక్షించు. ఈ రాక్షసుల బారి నుంచి నన్ను కాపాడు’ అంటూ ఓ భర్త తన సోదరుడికి ఫోన్ చేశాడు.

 • Share this:
  ‘తమ్ముడూ, నా భార్య నన్ను కొడుతోంది. నా భార్య సోదరుడు, ఇంటి యజమానులంతా కూడబలుక్కున్నారు. నన్ను చావ గొడుతున్నారు. వచ్చి రక్షించు. ఈ రాక్షసుల బారి నుంచి నన్ను కాపాడు’ అంటూ ఓ భర్త తన సోదరుడికి ఫోన్ చేశాడు. ఆ తమ్ముడు హుటాహుటిన తన అన్నయ్య అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లాడు. తీరా చూస్తే అక్కడ కనిపించలేదు. ఆరా తీస్తే అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి తన అన్నయ్యపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్, ధనగర్వాడి గ్రామానికి చెందిన దొండిడా డూంగవే అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం తన భార్య లక్ష్మీబాయితో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అమీర్ పేటలో ఉంటూ వంటమనిషిగా పనిచేస్తున్నాడు.

  అయితే కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య ఓ విషయమై వివాదం జరుగుతోంది. సొంత ఊళ్లో ఉన్న పొలాన్ని తన పేరు మీద రాయాలని భార్య లక్ష్మీబాయి తరచూ కోరుతోంది. దానికి దొండిడా మాత్రం అడ్డు చెప్పాడు. పొలాన్ని ఆమె పేరు మీద రాసేందుకు ఒప్పుకోలేదు. రెండు నెలల క్రితం భర్త ఓ పని మీద పూణె వెళ్లి మార్చి 4వ తారీఖున హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. శుక్రవారం తన సోదరుడు కైలాష్ ముండేతో కలిసి లక్ష్మీబాయి పొలం విషయమై భర్తను నిలదీసింది. పొలం గురించి మాట్లాడొద్దని ఆ భర్త తేల్చిచెప్పాడు. దీంతో ఆమె సోదరుడు, ఇంటి యజమాని, అతడి భార్య, మరదలితో సహా అంతా కలిసి దొండిడాపై కర్రలతో దాడి చేశారు.
  ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకలో కలకలం.. భారీగా నగదు ఉన్న బ్యాగ్ మిస్సింగ్.. వీడియో రికార్డు చేస్తున్న కెమెరాను పరిశీలించి కంగుతిన్న బంధువులు

  దీంతో వారి నుంచి కాస్త తప్పించుకుని హైదరాబాద్ లోనే ఉంటున్న తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో తమ్ముడు కొండిబ డూంగవే అన్నయ్య అద్దెకు ఉంటున్న ఇంటికి వచ్చి చూశాడు. అక్కడ సోదరుడు కనిపించకపోవడంతో స్థానికులను ఆరా తీశాడు. అప్పటికే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారని తెలిసింది. దీంతో అతడు ఆస్పత్రికి వెళ్లి అన్నను కలిసి చూసి, ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. తన అన్నపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రుల్లో అత్యధిక జీతం ఎవరికో తెలుసా..? కేసీఆర్, జగన్ వేతనాల్లో ఎంత తేడా ఉందంటే..!
  Published by:Hasaan Kandula
  First published: