హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nagarkarnool : ఆ ఇద్దరు భార్యభర్తలు..పోలీసులను.. ఉరుకులు, పరుగులు పెట్టించారు.. కారణం తెలిస్తే... షాకే మరి...

Nagarkarnool : ఆ ఇద్దరు భార్యభర్తలు..పోలీసులను.. ఉరుకులు, పరుగులు పెట్టించారు.. కారణం తెలిస్తే... షాకే మరి...

suicide

suicide

Nagarkarnool : ఇద్దరు భార్య భర్తలు , చిన్న పిల్లల్లా వ్యవహరించారు.. దీంతో ఇద్దరు కలిసి పోలీసులను పరుగులు పెట్టించారు..( Wife and husband try to commit suicide ) తానంటే తాను చనిపోతానని బెదిరిస్తూ ఆత్మహత్య యత్నం చేశారు.

  పెళ్లె సంవత్సరం పూర్తైంది. కాని ఇద్దరి మధ్య అప్పుడే మనస్పర్థలు.. ఒకరిపై ఒకరికి కనీసం విలువ కూడా లేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకోవడం ప్రారంభించాయి..అయితే భార్యభర్తల మధ్య అభిప్రాయా భేదాలతో ఘర్షణలు రావడం సహజమే అయినా.. అవి తారా స్థాయికి సంవత్సర కాలంలోనే చేరాయి. దీంతో ఒకరిపై ఒకరు కోపంతో ప్రాణాలు తీసుకునేందుకు రెఢీ అయ్యారు.. చెరో దిక్కుకు వెళ్లి ప్రాణాలు తీసుకుంటామని డిసైడ్ అయ్యారు.( Wife and husband try to commit suicide ) కాని చావు మీద భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.. అయితే ఇద్దరు బాగానే ఉన్నా మధ్యలో పోలీసులకు ఫోన్ చేసిన ఉరుకులు పరుగులు పెట్టించారు.

  వివరాల్లోకి వెళితే... నాగర్​కర్నూల్​ జిల్లా ( Nagarkarnool ) వెల్దండ మండలం కేంద్రానికి చెందిన రేవల్లి రామకృష్ణ, మానసలకు ఏడాది కిందట వివాహమైంది. కుటుంబంలోని సమస్యలతో వీరి మధ్య అభిప్రాయ ( Family dispute ) భేదాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే గురువారం మధ్యాహ్నం వీరు గొడవపడ్డారు. పురుగు మందు తాగి చనిపోతానని ఒకరినొకరు బెదిరించుకున్నారు.

  Karimnagar accident : ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్..


  ఆ బెదిరింపులో భాగంగానే రామకృష్ణ తన ఇంటి నుంచి టూ వీలర్‌పై బయటకు వెళ్లాడు. ( Wife and husband try to commit suicide ) ఆతర్వాత స్థానిక వెల్దండ ఎస్సై నర్సింహులుకు ఫోన్‌ చేసి తన భార్య మానస పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటోందని తెలుపుతూ ఆమె ఫోన్‌ నంబరు ఇచ్చాడు. దీంతో ఎస్సై పోలీసులను వెంటనే అప్రమత్తం చేసి ..ఆమె ఫోన్‌ నంబరు ఆధారంగా లొకేషన్‌ను గుర్తించారు.. వెంటనే అక్కడి వెళ్లి.. మానసను అదుపులోకి తీసుకున్నారు. ( Wife and husband try to commit suicide )అయితే పోలీసులు చేరుకునే వరకు మానస ఎలాంటీ ఆత్మహత్య ప్రయత్నం చేయలేదని పోలీసులు నిర్ధారించారు..

  Siddipet : పాము కరిస్తే, పసుపు పెట్టి.. కట్టు కట్టింది. నిద్ర కూడ పొమ్మంది...! కాని ఆ పాప ...మాత్రం..


  దీంతో పోలీసులు విషయాన్ని మానస భార్య రామకృష్ణకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆమె ఎలాంటీ ఆత్మహత్యకు పాల్పడలేదని.. ప్రస్తుతం క్షేమంగానే ఉందని తెలిపారు.. కాని రామకృష్ణ మరో షాక్ ఇచ్చాడు. ( Wife and husband try to commit suicide )తన భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తే తాను మాత్రం ఎందుకని ఆలోచించాడు.. దీంతో తాను కూడా పురుగుల మందు తాగనని పోలీసులకు చెప్పాడు.. ప్రస్తుతం తాను కడ్తాల్‌ సమీపంలో ఉన్నానని తన లోకేషన్‌ను భార్య మానసకు షర్ చేశాడు.

  వెంటనే అక్కడే ఉన్న పోలీసులు మానస చేత స్థానిక కడ్తాల్ పోలీసులకు ఫోన్ చేసి రామకృష్ణ ఉన్న లోకేషన్‌ను షేర్ చేసింది. దీంతో పాటు వెల్డండ ఎస్సై సైతం కడ్తల్ ఎస్సైకి ఫోన్ చేసి విషయం తెలిపాడు. ( Wife and husband try to commit suicide ) దీంతో అప్రమత్తమైన కడ్తాల్ ప్రాంత పోలీసులు అక్కడికి చేరుకుని ఆయన్ను గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

  Published by:yveerash yveerash
  First published:

  ఉత్తమ కథలు