Home /News /telangana /

WIFE AND HUSBAND KILLED NEIGHBOR WOMAN FOR EXTRAMARITAL AFFAIRS VRY

Hydarabad crime : అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడికి పెళ్లి.. భరించలేని పక్కింటి మహిళ..ఆ తర్వాత..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hydarabad crime : పెళ్లి కావాల్సిన యువకుడు పక్కింటి ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయితే ఆ యువకుడు కొద్ది రోజల క్రితమే పెళ్లి చేసుకున్నాడు..దీంతో అక్రమం జోలికి వెళ్లకపోవడంతో కక్ష గట్టిన పక్కింటి ఆవిడా ఆమె భర్త కలిసి ఆ యువకుడి భార్యను హత్య చేశారు.

ఇంకా చదవండి ...
    తమ అవసరాల కోసం భార్యభర్తలు హంతకులుగా మారారు..జల్సాలకు అలవాటు పడిన భర్తను.. మార్చుకోలేని భార్య, తాను కూడా పక్కింటి పెళ్లికాని యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఆ యువకున్ని ఇంటి ఆర్దిక ఆవసరాలకు వాడుకుంది. భర్త జులాయిగా తిరిగినా పట్టించుకోకుండా తనపని తాను చేసుకుని వెళ్లింది..ఇది తెలిసిన భర్త కూడా లైట్‌గా తీసుకున్నాడు..జల్సాలకు అలవాటు పడి ..భార్యను పట్టించుకోలేక పోయాడు..అయితే ఆ అలవాటు హంతకుడిగా మార్చింది. ఆర్ధిక అవసరాల కోసం బరితెగించి దంపతులిద్దరు అమయాక మహిళను హత్య చేసిన సంఘటన నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే ఈకేసులో పోలీసులు హత్య చేసి కట్టు కథ అళ్లిన దంపతులను అరెస్ట్ చేశారు.

    వివరాల్లోకి వెళితే...హైదరాబాద్ జీడిమెట్లలోని వినాయక నగర్‌లో ఝార్ఖండ్‌కు చెందిన రాజేశ్ వర్మ అనే యువకుడు గత అయిదు సంవత్సరాలుగా ఉంటున్నాడు. కాగా అదే కాంప్లెక్స్‌లోనే పక్కన సంజీత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు.కాగా సంజీత్ నగరంలో ఆటో నడుపుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు.అవసరాలకు అప్పులు చేస్తూ జులాయిగా మారాడు. దీంతో ఇళ్లు గడవడం కష్టంగా మారింది. ఇంటిని పట్టించుకోకుండా సంజీత్ వ్యవహరించాడు.

    దీంతో సంజీత్ భార్య తన అవసరాల కోసం పక్కనే ఉంటున్న రాజేశ్ వర్మతో అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వారికి కావాల్సిన కుటుంబ అవసరాలను రాజేశ్ వర్మ తీరుస్తు ఉండేవాడు... అయితే గత ఆరు నెలల క్రితమే రాజేశ్ వర్మ ఝార్ఖండ్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఎప్రిల్‌ నుండి హైదరాబాద్‌లోనే కాపురం పెట్టాడు. దీంతో.. పెళ్లి తర్వాత తన అక్రమ సంబంధానికి పుల్‌స్టాప్ పెట్టాడు. పక్కింటి సంజీత్ భార్యతో దూరంగా ఉన్నాడు. అయితే ఈ క్రమంలోనే రాజేశ్ అక్రమ సంబంధంతో పాటు సంజీత్ కుటుంబాన్ని ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకు రాలేదు..

    దీంతో రాజేశ్ వర్మకు భార్య రావడంతో తమకు ఆర్ధిక కష్టాలు వచ్చాయని సంజీత్ దంపతులు భావించారు. దీంతో ఆమెను కడతేర్చడం ద్వారా రాజేశ్‌ను తిరిగి దారిలోకి తెచ్చుకోవచ్చనే కుట్రకు తెరలేపారు. దీంతో నాలుగు రోజుల క్రితం రాజేష్ వర్మ ఉద్యోగానికి వెల్లడంతో ఒంటరిగా నిద్రపోతున్న ఆయన భార్య ముఖంపై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

    extramarital affair : అక్రమ సంబంధంతో కోడుకుకు వింత వ్యాధి... ఇరవై ఎళ్ల తర్వాత బయటపడ్డ భార్య తప్పు....


    అనంతరం పోలీసులు రావడంతో కట్టుకథ చెప్పారు..ఆమె ప్రియుడితో గొడవ పడిందని పోలీసులకు వివరించారు. ప్రియుడు రమ్మని చెప్పడంతో నిరాకరించిన ఆమెను హత్య చేశాడని వివరించారు. దీంతో సంజీత్ దంపతులు చెప్పిన స్టోరీపై అనుమానాలు వ్యక్తం చేసిన జీడిమెట్ల పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ చేపట్టారు. అయితే ఆ కెమెరాల్లో ఎవరు రాకపోవడంతో సాక్ష్యాలు సేకరించారు.దీంతో సంజీత్ దంపతులను తమ స్టైల్లో విచారించాడంతో అసలు విషయం ఒప్పుకున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Hyderabad crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు