హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sangareddy :విషాదం.. భర్త.. ఆత్మహత్య.. అది తెలిసిన వెంటనే.. భార్య, పిల్లలతో కలిసి చెరువులో దూకింది...!

Sangareddy :విషాదం.. భర్త.. ఆత్మహత్య.. అది తెలిసిన వెంటనే.. భార్య, పిల్లలతో కలిసి చెరువులో దూకింది...!

sangareddyy suicide

sangareddyy suicide

sangareddy : చేసిన అప్పులు.. తండ్రిపెట్టే ఇబ్బందులతో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేశానికి లోను కావడంతో తన భార్య పిల్లలను కొల్పోయాడు. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు విషాదాన్ని మిగిల్చాడు.

వీరన్న... మెదక్ కరస్పాండెంట్

కుటుంబం అన్నాక వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా రావడం సహజం. అయితే ఆర్థిక సమస్యలు తీర్చలేక కొంతమంది సతమతమవుతూ.. చివరికి ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొంతమంది మాత్రం అన్ని ఉన్నా వాటిని పరిష్కరించుకునే సామర్ధ్యంల లేక వ్యక్తిగత బేషాజాలకు పోయి ..మానసిక పరిపక్వత లేకుండా.. అకారణంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ( Wife and husband commit suicide along with children ) ఇలా భార్యభర్తల మధ్య వస్తున్న తగాదాల్లో పుట్టిన పిల్లలను కూడా దారుణంగా హతమారుస్తున్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటివల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఇలా తాజాగా అన్ని రకాలుగా సెటిల్ అయిన ఓ కుటుంబం పిల్లలతో పాటు ఆత్మహత్య చేసుకున్న సంఘటన

సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి జిల్లా ( sangareddy ) మునిపల్లి మండలం గార్లపల్లికి చెందిన చంద్రకాంత్‌ (38), లావణ్య (32) భార్యాభర్తలు. వీరికి ప్రథమ్‌(6), సర్వజ్ఞ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. చంద్రకాంత్‌ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. త బేషాజాలకు పోయి ..మానసిక పరిపక్వత లేకుండా.. అకారణంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ( Wife and husband commits suicide along with children ) వీరు ప్రస్తుతం హైదరాబాద్‌ శివారు బీహెచ్‌ఈఎల్‌లో నివాసముంటున్నారు. అయితే ఇటివల బీహెచ్‌ఈఎల్‌కు సమీపంలోని బాంబే కాలనీలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికోసం లావణ్య తల్లిదండ్రులు రూ.40లక్షలు సహాయం చేశారు. చంద్రకాంత్‌కు వచ్చే జీతం మొత్తం ఇంటి నిర్మాణ పనులకే ఖర్చువుతుండటంతో ఇల్లు గడిచేందుకు ఇబ్బందులు తలెత్తాయి.

Konijeti Rosaiah : .ఫ్యాక్షన్లు లేవ్… కక్షల్లేవ్… దిగజారుడు పాలిటిక్స్ అసలే లేవ్


మరోవైపు తన ఇంటి నిర్మాణంలో భాగంగా ఖర్చులకు డబ్బులు లేకపోవడం, దీనికి తోడు క్రెడిడ్ కార్డు బిల్లులు కూడా తడిసి మోపడవడంతో.. తనకు కొంత సహాయం చేయాలని తన తల్లిదండ్రులను చంద్రకాంత్‌ కోరాడు... చంద్రకాంత్ తండ్రి నిరాకరించడంతో ఇరువురి మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. మరోవైపు వారికి స్వగ్రామంలో ఉన్న భూమి అమ్మి అప్పులు తీర్చేందుకు కూడా అంగీకరించకపోవడంతో మరింత మనస్థాపానికి చంద్రకాంత్ గురయ్యాడు.

ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం ఓ గృహప్రవేశానికి చంద్రకాంత్‌ దంపతులు వెళ్లొచ్చారు. అనంతరం మరోసారి చంద్రకాంత్ తన తండ్రితో వాగ్వావాదానికి దిగాడు. అయితే ఇలా రోజు అప్పులు, ఆస్తులకు సంబంధించి రోజూ దీనిపై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో చంద్రకాంత్ భార్య తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో తన పిల్లలతో సహా తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఇలా భార్య ఇంటి పోవడంతో పాటు గోడవల మధ్య తాను విసుగు చెందాడు.. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

అయితే ఆవేశంతో తన పిల్లలతో కలిసి బయటకు పోయిన లావణ్య .. కాస్త కుదటపడిన తర్వాత తిరిగి తన ఇంటి గురించి ఆలోచించింది. భర్త మానసిక వేదనతో తాను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే.. ఎట్లా అంటూ అనుమాన పడింది. వెంటనే ఇంటికి ఫోన్ చేసింది. దీంతో ఆమె అనుమానమే నిజమైంది. ఆమె భర్త చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే సమాచారం చేరింది. ( Wife and husband commit suicide along with children )

ఇంకేముంది అంతకుముందే పిల్లలతో సహా ప్రాణాలు తీసుకునేందుకు ప్రిపేర్ అయిన లావణ్య భర్త చావు వార్త వినడంతో షాక్‌కు గురైంది. ఇక తిరిగి ఇంటికి వెళ్లడంతో ప్రయోజనం లేదని భావించింది.త బేషాజాలకు పోయి ..మానసిక పరిపక్వత లేకుండా.. అకారణంగా తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ( Wife and husband commit suicide along with children ) భవిష్యత్ మరింత అంధకారంగా మారిందనే ఆలోచనతో తాను సైతం ఆత్మహత్యకు పాల్పడింది. తనతోపాటు పిల్లల ప్రాణాలు కూడా తీసింది. ఇద్దరు పిల్లలతో పాటు ఆమె ఆందోల్ పెద్ద చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని చెరువులోని మృత దేహాలను బయటికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

First published:

Tags: Medak District news

ఉత్తమ కథలు