(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
ఆస్తి కోసం కట్టుకున్న భర్తను భార్య తన కూతురుతో కలిసి హత్య చేసింది. గత కొంత కాలంగా ఆస్తి కోసం కుటుంబంలో పెద్ద తగాదాలు చోటుచేసుకున్నాయి. తగాదా కాస్త ఒకరి ప్రాణం తీసింది. తండ్రి ముత్తాతలు పంచిన ఆస్తి కుటుంబ సభ్యులకు పంచడం లేదని కక్ష పెంచుకున్నారు కుటుంబసభ్యులు. తల్లి, కూతురు కలిసి పథకం ప్రకారం రాత్రి భయట నిద్రిస్తున్న తండ్రిని రాయితో మోది అతి కిరాతకంగా హత్య చేశారు. ఎన్ని సార్లు అడిగిన తమ పేరుమీద భూమిని రాసివ్వడం లేదన్న కోపంతో హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన నారాయణ, శాంతవ్వ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ల వివాహం జరిగింది. అయితే నారాయణ, ఆయన కుటుంబ సభ్యుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయంపై పలుమార్లు భార్య శాంతవ్వ, కూతురు జ్యోతి, కుమారుడు ప్రసాద్ పలుమార్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామ పెద్దల దృష్టికి తీసుకువచ్చారు.
అయినా లాభం లేకుండా పోయింది. ఎవరు చెప్పినా నారాయణ వినలేదు. శాంతవ్వ భర్త నారాయణతో గొడవపడి విడాకులు తీసుకొని గ్రామంలో నివాసం ఉండే పెద్ద కూతురు జ్యోతి వద్దే ఉంటుంది. తాత ముత్తాతలు సంపాదించిన ఆరు ఎకరాల భూమిని నారాయణ అనుభవిస్తూ, కుటుంబ సభ్యులకు ఇవ్వక పోవడంతో నారాయణపై కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. ఆ ఆరు ఎకరాల భూమిని భార్య శాంతవ్వ, పెద్ద కూతురు జ్యోతి పేరున మార్చాలని అడిగారు. నారాయణ ఒప్పుకోలేదు. దీంతో పథకం ప్రకారం భార్య శాంతవ్వ, కూతురు జ్యోతి ఇద్దరు కలిసి రోజు లాగే ఆరుబయట నిద్రిస్తున్న నారాయణ తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఉదయం ఆరుబయట రక్తపు మడుగులో ఉన్న నారాయాణను చూసి స్థానికులు పోలీసులకు విషయం చెప్పారు.
దీంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు నారాయణ మృత దేహాన్ని పరిశీలించి డాక్ స్క్వాడ్ తో క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. మృతిడి అన్న కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతిడి భార్య శాంతవ్వ, కూతురు జ్యోతి, కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని వారి పద్ధతిలో విచారించారు. నిజనీజాలు బయటకు వచ్చాయి.. ఆరు ఎకరాల భూమి కోసం తల్లి కూతుళ్లు హత్య చేసినట్టుగా ఓప్పుకున్నారని పోలీసులు తెలిపారు. కొడుకు మాత్రం ఈ హత్యకు నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడని సీఐ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Attempt ot murder, Crime, Crime news, Kamareddy, Murder, Nizamabad District, Telangana crime