WHY THIS THYRONORM TABLET USED FOR THYROID PROBLEM IS NOT SAFE AND WHAT DO THE DRUG CONTROLLER OFFICIALS SAY BK PRV
Health Alert | Thyroid tablet: రోజు మీరు వాడే థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎంత వరకు సేఫ్? ఈ నిజం తెలిస్తే ఆ మందుల జోలికే పోరు,..
(ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది థైరాయిడ్ (Thyroid) సమస్యతో బాధపడుతున్నారు. వాళ్లు వేసుకుంటున్న థైరోనార్మ్ ఎంత వరకు సేఫ్? .. అస్సలు కాదంటోంది తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
మనలో చాలా మంది థైరాయిడ్ (Thyroid) సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి రోజు నిద్ర లేవగానే థైరోనార్మ్ ట్యాబ్లెట్ (Thyronorm Tablet) వేసుకోకుండా డే స్టార్ట్ కాదు చాలా మందికి. అయితే మనం వేసుకుంటున్న థైరోనార్మ్ ఎంత వరకు సేఫ్? నిత్యం వాడే థైరోనార్మ్ అస్సలు సేఫ్ కాదంటోంది తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (Telangana Drugs Control Administration). హైపో థైరాయిడిజం కోసం విరివిగా వాడే థైరోనార్మ్ ట్యాబ్లెట్ "నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ" అని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. డ్రగ్ కంట్రోలర్ ట్యాబ్లెట్ నమూనాలను పరీక్ష కోసం పంపించిన తరువాత ఈ విషయాన్ని ప్రకటించింది. నగరంలో చాలా మంది వైద్యుల వద్దకు రోగులు ఈ ట్యాబ్లెట్స్ (Thyronorm Tablet) వాడిన తరువాత కూడా ఎటువంటి ప్రయోజనాలు లేవనే పిర్యాధులు ఎక్కువ రావడంతో అనుమానం వచ్చిన కొంత మంది వైద్యులు డ్రగ్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఈ మందుల వలన ఎటువంటి ప్రయోజనాలు ఉండవని అసలు వాడటం సేఫ్ కాదని నిర్ధానించారు.
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నగరంలోని వివిధ ఫార్మసీల నుంచి రెండు నెలల పాటు నమూనాలను సేకరించారు. బ్యాచ్ నెం. AEG 1987 అసలు నాణ్యత లేదని నిర్ధారించారు అధికారులు. డ్రగ్ కంట్రోలర్ గత వారం తన వెబ్సైట్లో ఈ నివేదికను విడుదల చేసింది. I.P.AEG 1987 బ్యాచ్‌కు చెందిన టాబ్లెట్లలో థైరాక్సిన్ సోడియం రసాయనం లేదని తేలింది. టాబ్లెట్‌లో రసాయనం లేకుండా, మందు పనికిరానిది చెబుతున్నారు వైద్యులు .
ట్యాబ్లెట్స్ బ్యాచ్ నకిలీదని..
ఇదిలా ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోని ఆక్మీ జెనెరిక్స్ ఎల్ఎల్పి ఈ మందును తయారు చేస్తోంది. మార్కెట్ లోకి అందుబాటులో ఉంచుతుంది. మరో వైపు TS డ్రగ్ ఏజెన్సీ పరీక్షించిన ట్యాబ్లెట్స్ బ్యాచ్ నకిలీదని థైరోనార్మ్‌ను మార్కెట్ చేస్తున్న అబాట్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొన్న థైరోనార్మ్ మాత్రలను అబాట్ తయారు చేయడం లేదా విక్రయించడం లేదని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
మహిళల్లో హైపోథైరాయిడిజం..
దేశంలో థైరోనార్మ్ మాత్రల మార్కెట్ చాలా ఎక్కువగా ఉంది. దీంతోపాటు హైపో థైరాయిడిజంతో బాధపడే స్త్రీలు ఈ మందును ఎక్కువగా ఉపయోగిస్తారు. 'ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం' ప్రకారం, మనదేశ జనాభాలో 11% మంది హైపోథైరాయిడ్‌తో బాధపడుతున్నారు. వారిలో అత్యధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు. 19 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉంటుంది. హార్మోన్ల మార్పుల కారణంగా, గర్భిణీ స్త్రీలు కూడా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. బరువు పెరగడం, అలసట, జుట్టు రాలడం, ఊపిరి ఆడకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, చర్మం పొడిబారడం వంటివి లక్షణాలు థైరాయిడ్ ఉన్న వారిలో కనిపిస్తాయి. ప్రస్తుతం మార్కెట్ లో అనుమాస్పదంగా ఉన్న థైరాయిడ్ మందులను తెలంగాణడ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.