Home /News /telangana /

WHY THE CM KCR SIGNED ON AGREEMENT OF WATER ALLOCATION OF KRISHNA WATER BJP ASKED VRY

Bandi Sanjay : ఏపి ప్రాజెక్టుల గురించి తెలియదన్న సీఎం కేసిఆర్...నీటి కేటాయింపులపై ఎలా సంతకం చేశావ్...?

Bandy Sanjay : క‌ృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులు నిర్మించడం తనకు తెలియదంటూ సీఎం కేసిఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.(బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Bandy Sanjay : క‌ృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులు నిర్మించడం తనకు తెలియదంటూ సీఎం కేసిఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.(బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

Bandi Sanjay : క‌ృష్ణా నదిపై ఏపీ ప్రాజెక్టులు నిర్మించడం తనకు తెలియదంటూ సీఎం కేసిఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో జల వివాదంపై ఇరు రాష్ట్రాల సీఎంలను ప్రతిపక్ష పార్టీలు నమ్మడం లేదు..ఇద్దరు కలిసి ప్రజల సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్దిపోందాలని చూస్తున్నట్టు రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ కనుసన్నల్లోనే ఈ వివాదం కొనసాగుతుందని ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసిఆర్‌కు రహస్య ఎజెండా ఉందని ఆయన ఆరోపించారు.

మరోవైపు బీజేపీ సైతం ఇదే వైఖరిని అవలంభిస్తోంది. ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆపార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేశాడు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను బలి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.ఇదంతా సీఎం కేసీఆర్, జగన్‌లు కలిసి ఆడుతున్న నాటకంగా ఆయన అభివర్ణించారు.ఏడు సంవత్సరాలుగా అధికారంలో ఉన్న సీఎం కేసిఆర్ తనకు కృష్ణా నదిపై ఏపి ప్రాజెక్టులు కడుతుండడం తెలియదని చెప్పడంపై బండి సంజయ్ మండిపడ్డారు.

ఒకవేళ ఆయనకు తెలియపోతే..అపెక్స్ కమిటీలో తెలంగాణకు 299 టీఎంసీల నీళ్ల వాటాపై ఎందుకు సంతకం చేశారని ప్రశ్నించారు.అప్పుడు దానిపై తెలంగాణ బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపిందని..మరోవైపు రాష్ట్రానికి 575 టీఎంసీల నీటిని కేటాయించాలని డిమాండ్ చేసినట్టు చెప్పారు. ఇక సీఎం కేసిఆర్ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రానికి 299 టీఎంసీ నీటీ కేటాయింపులు జరిగాయని, సీఎం జగన్‌తో కుమ్మక్కు అవడంతోనే రెండు అపెక్స్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయించారని బండి సంజయ్ ఆరోపించారు. ఇక తాజాగా మరోసారి 50:50 అంటూ కొత్త నాటకానికి తెరలేపాడని ఆయన విమర్శించారు. అంతా అయిపోయాక ఇప్పుడు ఏపి కడుతోంది అక్రమ ప్రాజెక్టులు అంటూ ప్రచారం చేయడం వెనుక రాజకీయ లబ్ధి దాగి ఉందని అన్నారు.

కాగా కేఆర్‌బీఎం కు నోటిఫై చేయడం ద్వారనే నీటి సమస్య పరిష్కారం జరుగుతుందని ఆయన కేంద్రానికి లేఖ సైతం రాశారు. కమిటికి నేటి నోటిఫై లేదని..చెప్పారు. ఈ నేపథ్యంలో జలశక్తి మంత్రికి శనివారం  లేఖ రాశారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Bandi sanjay, CM KCR

తదుపరి వార్తలు