KCR Tour : మళ్లీ కౌబాయ్ క్యాప్‌లో కేసీఆర్... ఏంటి దాని ప్రత్యేకత...

KCR Cowboy Cap : ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన ప్రతిసారీ... కేసీఆర్... కౌబాయ్ క్యాప్ పెట్టుకుంటున్నారు. అది సెంటిమెంటా? లేక ఎండ పడకుండా ఏర్పాటా?

Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 12:05 PM IST
KCR Tour : మళ్లీ కౌబాయ్ క్యాప్‌లో కేసీఆర్... ఏంటి దాని ప్రత్యేకత...
కేసీఆర్ (File)
Krishna Kumar N | news18-telugu
Updated: August 29, 2019, 12:05 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్‌కి నమ్మకాలు, సెంటిమెంట్లూ ఎక్కువ. ఆయన నివసించే ఇంటితోపాటూ... తెలంగాణ భవన్, సచివాలయం అన్నీ వాస్తు ప్రకారం ఉండేలా చూసుకుంటారు. ఐతే... ఇటీవల ఆయన రెగ్యులర్‌గా కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల సందర్శనకు వెళ్తున్నారు. తాజాగా ఆయన పాలమూరులో ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్లారు. ఇలా వెళ్లిన ప్రతిసారీ ఆయన కౌబాయ్ క్యాప్ పెట్టుకుంటున్నారు. ఆ క్యాప్ పెట్టుకుంటే... అంతా శుభమే జరుగుతుందనే సెంటిమెంట్ ఉండటం వల్లే దాన్ని ధరిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అది ఇప్పటి క్యాప్ కాదు. ఎప్పుడో తెలంగాణలో హరితహారం ప్రారంభించినప్పటిది. అప్పట్లో హరితహారం గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో... ఇక అప్పటి నుంచీ కేసీఆర్... ఇలాంటి రాజకీయేతర, భక్తియేతర కార్యక్రమాలకు వెళ్లినప్పుడు అదే కౌబాయ్ క్యాప్ పెట్టుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది.

kcr tour, kcr cowboy cap, kcr palamur tour, kcr projects tour, kcr kaleshwaram tour, kcr cap story, telangana news, తెలంగాణ వార్తలు, తెలంగాణ న్యూస్, కేసీఆర్ క్యాప్, కేసీఆర్ కౌబాయ్ క్యాప్, కేసీఆర్ పర్యటన, కాళేశ్వరం పర్యటన,
కేసీఆర్ (File)


సెంటిమెంట్ కోసమే కౌబాయ్ క్యాప్ పెట్టుకుంటున్నారన్న వాదనను కేసీఆర్ సన్నిహితులు తప్పుపడుతున్నారు. ఎండ తీవ్రతను తట్టుకోవడం కోసమే ఆ క్యాప్ పెట్టుకుంటున్నారనీ, ఫామ్ హౌస్‌కి వెళ్లినప్పుడు కూడా కేసీఆర్ దాన్ని ధరిస్తారని చెబుతున్నారు. ప్రాజెక్టుల ప్రదేశంలో... తవ్వకాలు ఎక్కువగా ఉండటం వల్ల... భూమి లోంచీ వేడి బయటకు ఆవిరి రూపంలో వస్తూ ఉంటుంది. అదే సమయంలో... ఎండ తీవ్రత కూడా ఉంటుంది. ఆ కారణంగానే కేసీఆర్ ఆ క్యాప్ పెట్టుకుంటున్నారని చెబుతున్నారు. నిజానికి ఆ క్యాప్‌లో కేసీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారనీ, ఓ సీఎంగా ఆయనకు అలాంటి క్యాప్ ఉండటం మంచిదేనని అంటున్నారు.

కేసీఆర్‌కి కౌబాయ్ సినిమాలన్నా... కౌబాయ్ గెటప్ అన్నా చాలా ఇష్టం. అందువల్ల ఆయన ఏరికోరి... కౌబాయ్ క్యాప్ కొనుక్కున్నారు. ఆ క్యాప్‌పై మక్కువ తోనే... దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మక్కువకి తోడు... అది ఎక్కువ నీడను ఇస్తూ... ఎండ వేడి నుంచి కూడా కాపాడుతుండటంతో... అదే క్యాప్‌ని ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లిన ప్రతిసారీ పెట్టుకుంటున్నారు కేసీఆర్.



kcr tour, kcr cowboy cap, kcr palamur tour, kcr projects tour, kcr kaleshwaram tour, kcr cap story, telangana news, తెలంగాణ వార్తలు, తెలంగాణ న్యూస్, కేసీఆర్ క్యాప్, కేసీఆర్ కౌబాయ్ క్యాప్, కేసీఆర్ పర్యటన, కాళేశ్వరం పర్యటన,
అధికారులతో కేసీఆర్


నత్తనడకన సాగుతున్న పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఎల్‌ఐ) పనులు ఇక పరుగులు తీయనున్నాయి. ఈ ప్రాజెక్టు పనులను గాడిన పెట్టడానికి సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. గురువారం ఆయన మహబూబ్‌నగర్‌ పర్యటకు వెళ్లారు. పర్యటనలో భాగంగా ప్రాజెక్టు పరిధిలోని కరివెన జలాశయాన్ని హెలికాప్టర్‌ నుంచి విహంగవీక్షణం ద్వారా సీఎం పరిశీలించారు. ఆ తర్వాత పనుల పురోగతిని ఇంజినీర్లు సీఎంకు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగవంతానికి కేసీఆర్‌ అధికారులకు కొన్ని సూచనలు చేశారు.
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...