హోమ్ /వార్తలు /తెలంగాణ /

Eetala despute : ఈటల వివాదానికి.. మరో మంత్రి గంగుల కారణమా.. ఇద్దరి మధ్య ఏం జరిగింది ?

Eetala despute : ఈటల వివాదానికి.. మరో మంత్రి గంగుల కారణమా.. ఇద్దరి మధ్య ఏం జరిగింది ?

Eetala :తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ భూముల ఎపిసోడ్ ఇప్పుడు హట్‌టాపిక్..భూముల సంగతి అటు ఉంచితే..వివాదానికి రాజకీయా కారణాలే ముఖ్యమన్నది జగమెరిగిన సత్యం..అయితే అంత సీనియర్ నాయకునికి విరోధులు ఎవరు ? స్థానికంగా తన ప్రభాల్యానికి అడ్డుకట్ట వేస్తున్న మరో మంత్రి గంగుల కమాలకర్ 
కారణమా.. ?

Eetala :తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ భూముల ఎపిసోడ్ ఇప్పుడు హట్‌టాపిక్..భూముల సంగతి అటు ఉంచితే..వివాదానికి రాజకీయా కారణాలే ముఖ్యమన్నది జగమెరిగిన సత్యం..అయితే అంత సీనియర్ నాయకునికి విరోధులు ఎవరు ? స్థానికంగా తన ప్రభాల్యానికి అడ్డుకట్ట వేస్తున్న మరో మంత్రి గంగుల కమాలకర్ కారణమా.. ?

Eetala :తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ భూముల ఎపిసోడ్ ఇప్పుడు హట్‌టాపిక్..భూముల సంగతి అటు ఉంచితే..వివాదానికి రాజకీయా కారణాలే ముఖ్యమన్నది జగమెరిగిన సత్యం..అయితే అంత సీనియర్ నాయకునికి విరోధులు ఎవరు ? స్థానికంగా తన ప్రభాల్యానికి అడ్డుకట్ట వేస్తున్న మరో మంత్రి గంగుల కమాలకర్ కారణమా.. ?

ఇంకా చదవండి ...

  కరీంనగర్ జిల్లా.. న్యూస్ 18 కరస్పాండెంట్. శ్రీనివాస్. పొన్నం.

  2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల మరోసారి విజయదుందుబి మోగించారు . అయితే ... మంత్రివర్గ కూర్పులో ఆయనకు స్థానం లేదనే సంకేతాలు వెలువడ్డాయి . అసెంబ్లీ ఎన్నికల్లో చొప్పదండి టికెట్టు విషయంలో ఈటల అధిష్టానానికి వ్యతిరేకంగా వెళ్లాడనేది అప్పటి ప్రచారం .

  అయితే .. చివరి నిమిషం లో కేసీఆర్ కు సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ నాయకుడు రంగ ప్రవేశం చేశారని , దాంతో ఆరోగ్యశాఖ మంత్రిగా అవకాశం లభించిందని అప్పట్లో వినిపించింది . కాగా .. ఈటల తనకు మంత్రి పదవి లభించినా .. తెలంగాణ ఉద్యమ నాయకుడైన తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించలేదనే అభిప్రాయంలోనే ఉండేవారు . తరువాత జిల్లాకు చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా తన ప్రాధాన్యత తగ్గించారని ఆయన భావించినట్లు సన్నిహితులు చెపుతారు .

  ఈ క్రమంలోనే పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు . ' మంత్రి పదవి భిక్ష కాదు .. గులాబీ జెండాకు ఓనర్లం .. పార్టీ , పదవి ఉన్నా లేకున్నా నేనుంటా ... వంటి వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షించారు . గత ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగిన పోరాటానికి బాహాటంగా మద్దతు తెలిపారు .

  ఈ క్రమంలో పార్టీ విధానాలను కూడా పక్కన పెట్టారు. రైతుల కోసం తానుంటానని , ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత నుంచి ప్రభుత్వాలు తప్పించుకోకూడదని అప్పట్లో వ్యాఖ్యానించారు . ఇటీవలి కాలంలో కూడా రాజకీయాల్లో నైతికత గురించి , ఆత్మగౌరవం గురించి వ్యాఖ్యలు చేస్తూ తనదైన శైలిని కొనసాగించారు . అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజు మంత్రి కేటీఆర్ తన కారులో ఈటలను ప్రగతిభ వరకు తీసుకెళ్లారు . ఆ తరువాత ఈటల వాయిస్ లో మార్పు వస్తుందని అంతా భావించారు .

  అయితే .. తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడు ఆయన వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు .ఇది ఇలా ఉంటే.. టీఆరెఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారం లోకి.. రాగానే కరీంనగర్ నుండి గంగుల కు మంత్రి పదవి కట్టబెట్టి. ఈటెల ప్రాధాన్యత తగ్గించారు. అనేదే.. ఉమ్మడి కరీంనగర్ జిల్లలో హాట్ టాపిక్ గా మారింది.గంగుల మంత్రి పదవి రాగానే ఈటెల ను పక్కన పెట్టి. తన దైన శైలిలో దూసుకుపోయారు...ఇక ఈటెల అప్పటి నుండి కరీంనగర్ రావడం పూర్తిగా మానేసాడు. తన నియోజకవర్గం అయిన హుజురాబాద్‌కే పరిమితం అయ్యాడు.నియోజకవర్గం లో అభివృద్ధి పనులు చూసుకుంటూ సొంత పార్టీ నాయకులపైనా అసమ్మతి రాగం వినిపించాడు.ఏది ఏమైనప్పటికి గంగుల తో విభేదాలే ఈటెల కొంప ముంచాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో ఇప్పుడు చర్చ జరుగుతుంది..

  First published:

  Tags: CM KCR, Eetala rajender, Gangula kamalakar, Karimnagar

  ఉత్తమ కథలు