హోమ్ /వార్తలు /తెలంగాణ /

Prakash raj : ప్రకాశ్ రాజ్ గజ్వేల్ పర్యటన వెనక ఆంతర్యం ఏమిటి...?

Prakash raj : ప్రకాశ్ రాజ్ గజ్వేల్ పర్యటన వెనక ఆంతర్యం ఏమిటి...?

Telangana politics : తెలంగాణ ( Telangana )రాజకీయాల్లో నటుడు ప్రకాశ్ రాజ్‌ ( Prakshraj )హాట్‌టాపిక్‌గా మారారు. ఇటివల మహారాష్ట్ర, తెలంగాణ సీఎంల భేటిలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ప్రకాశ్‌కు రాజ్యసభను ( Rajyasabha ) కట్టబెడతారనే స్పెక్యులేషన్ మొదలయ్యాయి. అయితే నిజంగానే గులాబి బాస్ ఆ అవకాశం కల్పిస్తారా.. దాని వల్ల ఆపార్టీకి ఏంటి లాభం.. ?

ఇంకా చదవండి ...

  ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అదికూడా సీఎం సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ఆయన పర్యటించడంపై సర్వత్ర చర్చనీయంశంగా మారింది. గత వారం రోజుల క్రితమే జాతీయ రాజకీయాల్లో భాగంగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో తెలంగాణ సీఎం కేసిఆర్ సమావేశంలో ఆయన అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యారు. దీంతో మీడియా వర్గాలు ఆయనపై ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే ఆయనకు రాజ్య సభ స్థానాన్ని కేటాయిస్తారని , రానున్న మూడు నెలల్లో మూడు రాజ్య సభ స్థానాలు ఖాలీ కానుండడంతో ఆయనకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారం కూడా కొనసాగింది. అయితే ఆ వార్తలను ప్రకాశ్ రాజ్ ఖండించారు. అనవసరమైన కథనాలను ఆయన వ్యతిరేకించారు.

  అయితే తాజాగా ఆయన సీఎం నియోజకవర్గమైన గజ్వేల్‌లోని సమీకృత మార్కెట్ తోపాటు పలు ప్రాంతాలను ఆయన శనివారం సందర్శించారు. మీడియాకు ఎలాంటీ సమాచారం లేకుండా సాయంత్రం 5 అయిదుగంటలకు నేరుగా మార్కెట్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే స్థానిక మార్కెట్ అధికారులతో పాటు స్థానికులు స్వాగతం పలికారు. అయితే ఆయన గజ్వేల్‌ను ఎందుకు సందర్శించారనే చర్చ కొనసాగుతోంది. భవిష్యత్‌లో ఆయన టీఆర్ఎస్‌లో చేరతారా లేక పరస్పర అవగాహానతో ముందుకు సాగుతారా అనే అంశాలు తెరమీదకు వస్తున్నాయి. లేదంటే గజ్వేల్ నియోజకవర్గ అభివృద్దిని అవగాహన చేసుకుని ఆ పథకాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం ఆయన ప్రత్యక్షంగా పర్యటించారా అనేది తేలాల్సి ఉంది.

  Hyderabad : సీఎం కేసీఆర్ ఫ్లెక్సీని తొలగించిన మున్సిపల్ అధికారులు.. ఉదయం వెలిసింది.. సాయంత్రం..

  కాగా ఇప్పటికే బీజేపీకి బద్ద శత్రువుగా ఉన్న ప్రకాశ్ రాజ్‌కు సీఎంతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో ఆయన సేవలను జాతీయ రాజకీయాల వైపుకు ఉపయోగించుకోవాలని గులాబి నేతలు భావిస్తున్నట్టు సమాచారం.. ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్‌కు జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు ఉండడంతో పాటు సౌత్ ఇండియా రాష్ట్రాల్లోని తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రత్యేక ముద్రవేసుకున్నారు. దీంతో ఆయన సేవలు పార్టీకి ఉపయోగపడేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ ద్వారా రాజకీయా రంగంతో పాటు సిని రంగంలో ఉన్న ప్రముఖుల మద్దతు కూడా కూడగట్టే అవకాశాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఇద్దరి మధ్య రాజకీయ పరమైన అంశాలు తెరమీదకు తెస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆయన సీఎం కేసీఆర్ నియోజవర్గంలో పర్యటించినట్టు తెలుస్తోంది.

  First published:

  Tags: Gajwel, Prakash Raj

  ఉత్తమ కథలు