హోమ్ /వార్తలు /తెలంగాణ /

Amit Shah: ఈటలను సస్పెండ్ చేస్తే ఎందుకు పట్టించుకోలేదు.. బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్

Amit Shah: ఈటలను సస్పెండ్ చేస్తే ఎందుకు పట్టించుకోలేదు.. బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్

ఈటల, అమిత్​ షా (ఫైల్​)

ఈటల, అమిత్​ షా (ఫైల్​)

Amit Shah: షెడ్యూల్‌లో లేనప్పటికీ.. అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి అమిత్ షా వెళ్లారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈటల నివాసంలోనే ఉన్నారు. సుమారు 10 నిమిషాలపాటు ఈటల రాజేందర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ విలీన వజ్రోత్సవ వేడుకల్లో (Telangana Liberation Day) పాల్గొనేందుకు హైదరాబాద్‌ (Hyderabad)కు వచ్చిన కేంద్రహోంమంత్రి అమిత్ షా (Amit Shah).. ఆ కార్యక్రమం తర్వాత బీజేపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, మునుగోడు ఉప ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు. శనివారం హరితప్లాజాలో పార్టీ కోర్‌కమిటీ సభ్యులతో దాదాపు గంటన్నర పాటు అమిత్‌ షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Eatala Rajender) సస్పెన్షన్ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను అసెంబ్లీ నుంచి అన్యాయంగా సస్పెండ్‌ చేస్తే పార్టీ నేతుల ఎందుకు పట్టించుకోలేదని.. ఈ అంశంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా గళం ఎత్తాల్సిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎందుకు చేపట్టలేదని బీజేపీ నేతలకు అమిత్ షా క్లాస్ తీసుకున్నారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరసనలు, ధర్నాలు చేసి ఉండాల్సిందని సున్నితంగా మందలించారు. టీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ఏ అవకాశం వచ్చినా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.

  మునుగోడు ఉప ఎన్నికను (Munugodu Bypolls) సీరియ్‌సగా తీసుకోవాలని బీజేపీ నేతలను అమిత్‌ షా ఆదేశించారు. ప్రతి గ్రామానికి, వార్డుకు, డివిజన్‌కు ముగ్గురు సీనియర్‌ నాయకులను ఇన్‌చార్జిగా నియమించాలని తరుణ్‌ చుగ్‌కు, సునీల్‌ బన్సల్‌కు ఆయన సూచించారు. మునుగోడులో సామాజిక వర్గాల లెక్కలపై ఆరా తీశారు. అక్కడ మీ సామాజికవర్గం ఓటర్లు ఎంతమంది ఉంటారు? మిగతా బలమైన సామాజికవర్గాల పరిస్థితేంటని ఈటల రాజేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. సిద్ధంగా ఉండాలని.. అందుకోసం క్షేత్ర స్థాయిలో పనిచేస్తూ ఉండాలని దిశానిర్దేశం చేశారు. మునుగోడులో మన పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. అయినప్పటికీ మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.

  మరోవైపు షెడ్యూల్‌లో లేనప్పటికీ.. అనూహ్యంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంటికి అమిత్ షా వెళ్లారు. ఇటీవల ఈటల రాజేందర్ తండ్రి మరణించిన నేపథ్యంలో... శామీర్‌పేట్‌లోని ఈటల నివాసానికి వెళ్లి.. ఆయన ఫ్యామిలీని పరామర్శించారు. ఈటల తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పించారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈటల నివాసంలోనే ఉన్నారు. ఈ సందర్భంగా నేతలతో ఇష్టాగోష్టిగా అమిత్ షా మాట్లాడారు. తెలంగాణలో అసదుద్దీన్ ఓవైసీకి ఉన్న ఆదరణ గురించి అడిగినట్లు సమాచారం. మజ్లిస్ పార్టీ చెప్పినట్లే టీఆర్ఎస్ ఉంటుదని కిషన్ రెడ్డి అన్నారు. ఎంఐఎం పార్టీ గురించి మాట్లాడినట్లు సమాచారం. ముస్లింలంతా ఆ పార్టీ వెంటే ఉన్నారా.? అని ప్రశ్నించగా.. దాదాపు సగం మంది లేరని పార్టీ నేతలు బదులిచ్చారు. ఆ తర్వాత సుమారు 10 నిమిషాలపాటు ఈటల రాజేందర్‌తో అమిత్ షా ప్రత్యేకంగా చర్చలు జరిపినట్లు సమాచారం. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, మునుగోడు ఉపఎన్నికలు, పార్టీ బలోపేతం, తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Amit Shah, Bjp, Eetala rajender, Telangana

  ఉత్తమ కథలు