దొరికిపోయిన అర్ణబ్ గోస్వామి... డబుల్ స్టాండర్డ్స్?

Arnab Goswami : తెలంగాణలో దిశ హత్యాచారం ఘటనపై సీఎం కేసీఆర్‌ను నిలదీసిన అర్ణబ్ గోస్వామి... మరి ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ ఘటనపై ఎందుకు నోరు మెదపట్లేదన్న ప్రశ్న తలెత్తుతోంది.

news18-telugu
Updated: December 9, 2019, 10:46 AM IST
దొరికిపోయిన అర్ణబ్ గోస్వామి... డబుల్ స్టాండర్డ్స్?
దొరికిపోయిన అర్ణబ్ గోస్వామి... డబుల్ స్టాండర్డ్స్?
  • Share this:
Arnab Goswami : ఏదైనా అన్యాయంగా అనిపిస్తే చాలు... ఆవేశంగా చెలరేగిపోయే అర్ణబ్ గోస్వామి... ఓ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇండియా టీవీ నుంచీ బయటకు వచ్చి సొంతంగా రిపబ్లిక్ టీవీ ఛానెల్ పెట్టి... ఆవేశంతో ఊగిపోతున్న ఆయన... ఇటీవల దిశ హత్యాచారం ఘటనపై పెద్ద ఎత్తున డిబేట్ పెట్టారు. ఆ సమయంలో... ఓ టీఆర్ఎస్ ఎంపీని లైన్‌లోకి తెచ్చి... ఉతికారేశారు. "మీ సీఎం కేసీఆర్ ఎక్కడ.. ఆయన నోరు మెదపరా? ఈ ఘటనపై ఒక్క ఖండన ప్రకటన కూడా ఇవ్వరా?" అంటూ అసలా ఎంపీకి మాట్లాడే ఛాన్సే ఇవ్వలేదు. ఐతే... అర్ణబ్ అంతలా చెలరేగిపోవడంతో... ప్రజలు కూడా అదీ అర్ణబ్ అంటే... భలే అడిగారు అంటూ మెచ్చుకున్నారు. ఐతే... దిశ కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంది యూపీలోని ఉన్నావ్ గ్యాంగ్ రేప్ బాధితురాలు. ఏడాది నుంచీ న్యాయం కోసం పోరాడుతున్న ఆమె... ఇటీవల కేసు విచారణలో భాగంగా కోర్టుకు వెళ్తుంటే... దుండగులు... కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన గాయాలతో రెండ్రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిందా బాధితురాలు. అసలు గ్యాంగ్ రేప్ జరిగిన నాడే నిందితుల్ని పట్టుకొని ఉంటే... ఇప్పుడామె చనిపోయే పరిస్థితి వచ్చేదే కాదు. కానీ యూపీ ప్రభుత్వ అలసత్వం, పోలీసుల నిర్లక్ష్యం ఇతరత్రా అనేక కారణాలు కలిసి... ఉన్నావ్ బాధితురాలికి తీరని అన్యాయం చేశాయి. మరి దీనిపై అర్ణబ్ ఒక్క మాటా మాట్లాడలేదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని ఏమీ అనలేదు.

యూపీలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఉన్నావ్ కేసులో నిందితులకు బీజేపీ నేతల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అర్ణబ్ గోస్వామి... చాలా సందర్భాల్లో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. రిపబ్లిక్ టీవీ కూడా బీజేపీ భజన చేస్తోందన్న విమర్శలున్నాయి. అర్నబ్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కొందరంటున్నారు. అందుకు ఉదాహరణగా దిశ, ఉన్నావ్ ఘటనలపై ఆయన స్పందించిన తీరును చూపిస్తున్నారు.

 

Pics : కొంచెం హాట్... కొంచెం స్వీట్ అంటున్న లవ్లీ బ్యూటీ శాన్వి శ్రీవాత్సవ

ఇవి కూడా చదవండి :

డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియోకొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...

ఒకేసారి రెండు సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు...

సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో

అత్యంత రద్దీగా శబరిమల... దర్శనానికి స్వాముల పడిగాపులు...

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>