ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైకోర్టు (High Court) లో వాదనలు వాడీవేడిగా కొనసాగాయి. ఈ కేసుకు సంబంధించి పిటీషన్లపై విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ కేసులో ప్రభుత్వం తరపున దుష్వంత్ దవే, బీజేపీ తరపున మహేష్ జెఠ్మలానీ తమ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసింది.
తప్పు చేయనప్పుడు భయమెందుకు..ప్రభుత్వం తరపు న్యాయవాది దవే
తప్పు చేయనప్పుడు తెలంగాణ సిట్ (Special Investigation Team) కు ఎందుకు సహకరించడం లేదు, దేనికి భయపడుతున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే వాదనలు వినిపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పక్కా ఆధారాలు ఉన్నాయి. నిందితులతో బీజేపీకి సంబంధాలు ఉన్నాయని దవే చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కేసీఆర్ వీడియో ద్వారా బయటపెట్టారు. ప్రభుత్వాన్ని కూల్చుతుంటే సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత సీఎంపై ఉంటుందని అన్నారు. కేసీఆర్ వీడియోలను బయటపపెట్టడాన్ని తప్పుగా చూయించడం ఏంటని దవే వాదనలు వినిపించారు. సిట్ (Special Investigation Team) విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే కోర్టు ముందు చెప్పారు. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకే సిట్ (Special Investigation Team) దర్యాప్తు చేస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్వంత్ దవే చెప్పుకొచ్చారు.
రాజకీయ దురుద్దశ్యంతోనే సిట్ ఏర్పాటు..బీజేపీ తరపు న్యాయవాది..
ఈ కేసు రాజకీయ దురుద్దేశ్యంతోనే సిట్ (Special Investigation Team) ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారని బీజేపీ తరపు న్యాయవాది మహేష్ జెఠ్మలానీ చెప్పుకొచ్చారు. కేసీఆర్ కనుసన్నుల్లోనే సిట్ (Special Investigation Team) విచారణ జరుగుతుందన్నారు. ఈ కేసును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ సహా నిందితుల తరపు న్యాయవాదులు కోరుతున్నారు.
మంగళవారం ఏం జరగబోతుంది?
ఈ కేసులో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. మరి ఆరోజు సిట్ కు అనుకూలంగా తీర్పు వస్తుందా లేక బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ కేసులో హైకోర్టు ఏమైనా కండీషన్స్ పెడుతుందా లేక విచారణకు హాజరు కానీ కారణంగా అరెస్టుకు అనుమతి ఇస్తుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.