Lok Sabha Elections : పాలమూరులో పాగా వేసేదెవరో... పోటీ రసవత్తరం...

Lok Sabha Elections 2019 : మ‌హిళ‌లు, యువ‌త‌, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల ఓట‌ర్లే కీల‌కం కానున్నారు. వీరు ఎవ‌రి వైపు మొగ్గితే వారే విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంది.

Krishna Kumar N | news18-telugu
Updated: March 29, 2019, 3:04 PM IST
Lok Sabha Elections : పాలమూరులో పాగా వేసేదెవరో... పోటీ రసవత్తరం...
వంశీ చంద్ రెడ్డి, డీ కే ఆరుణ
  • Share this:
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటూ... నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం ఉంది. నాగర్ కర్నూల్ ఎంపీ సీటు రిజర్వ్ కావడంతో... అక్కడ ఎస్సీ అభ్యర్థికి కేటాయిస్తూ వస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని జ‌న‌ర‌ల్ కోటా కింద చేర్చారు. టీఆర్ఎస్ ప్రభావం ఉన్నప్పటికీ... నాగర్ కర్నూలులో కాంగ్రెస్‌కి చెందిన నంది ఎల్లయ్య ఎంపీగా విజ‌యం సాధించారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచీ టీఆర్ఎస్ తరపున పోటీచేసిన జితేంద‌ర్ రెడ్డి గెలుపొందారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ స్థానానికి సిట్టింగ్ ఎంపీని కాదని పార్టీ అధినే కేసీఆర్... మైలాన్ పరిశ్రమల అధినేత మన్నె సత్యనారాయణ రెడ్డి తమ్ముడు మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డికి బి - ఫారం ఇచ్చారు. జితేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంపై పార్టీ శ్రేణులకు ఆశ్చర్యం కలిగింది.

narendra modi,ys jagan,rahul gandhi,congress,lok sabha elections 2019,lok sabha election,lok sabha election 2019,2019 lok sabha elections,lok sabha elections,2019 elections,lok sabha polls,lok sabha elections 2019 telangana,india lok sabha election date,andhra pradesh lok sabha election 2019,india lok sabha election 2019,bjp leader before lok sabha elections,telangana 2019 lok sabha,election,lok sabha alliance,ap assembly elections 2019,ap assembly elections,ap elections 2019,assembly elections,ap elections,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly elections 2019 survey,ap assembly elections 2019 schedule,ap assembly elections 2019 predictions,ap assembly election schedule 2019,ap assembly elections 2019 candidates list,opinion poll survey on ap assembly elections 2019,ap politics,లోక్ సభ ఎన్నికలు,తెలంగాణ ఎన్నికలు,ఏపీ అసెంబ్లీ ఎన్నికలు,పాలమూరు, మహబూబ్ నగర్,డీకే అరుణ,జైపాల్ రెడ్డి,
వంశీ చంద్ రెడ్డి, డీ కే ఆరుణ


మహబూబ్‌నగర్‌లో 1952 నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు జ‌రుగుతూ వ‌స్తున్నాయి. 14,18,672 మంది ఓట‌ర్లున్నారు. కొత్తగా మరి కొంత మంది అద‌నంగా చేరారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, నారాయ‌ణ‌పేట‌, కొడంగ‌ల్, దేవ‌ర‌క‌ద్ర, మ‌క్తల్, షాద్‌న‌గ‌ర్, జ‌డ్చర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు ఈ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి వ‌స్తాయి. గతేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థులే అన్ని చోట్లా గెలిచారు.

అసెంబ్లీ స్థానం - గెలిచిన అభ్యర్థులు :


మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ - వి.శ్రీ‌నివాస్ గౌడ్
నారాయ‌ణ‌పేట - రాజేంద‌ర్ రెడ్డి
కొడంగల్ - నరేందర్ రెడ్డి (మ‌హేంద‌ర్ రెడ్డి తమ్ముడు)దేవరకద్ర - ఆల వెంక‌టేశ్వర్ రెడ్డి
మక్తల్ - చిట్టెం రామ్మోహ‌న్ రెడ్డి
షాద్‌నగర్ - అంజయ్య యాదవ్
జడ్చర్ల - ల‌క్ష్మారెడ్డి

narendra modi,ys jagan,rahul gandhi,congress,lok sabha elections 2019,lok sabha election,lok sabha election 2019,2019 lok sabha elections,lok sabha elections,2019 elections,lok sabha polls,lok sabha elections 2019 telangana,india lok sabha election date,andhra pradesh lok sabha election 2019,india lok sabha election 2019,bjp leader before lok sabha elections,telangana 2019 lok sabha,election,lok sabha alliance,ap assembly elections 2019,ap assembly elections,ap elections 2019,assembly elections,ap elections,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly elections 2019 survey,ap assembly elections 2019 schedule,ap assembly elections 2019 predictions,ap assembly election schedule 2019,ap assembly elections 2019 candidates list,opinion poll survey on ap assembly elections 2019,ap politics,లోక్ సభ ఎన్నికలు,తెలంగాణ ఎన్నికలు,ఏపీ అసెంబ్లీ ఎన్నికలు,పాలమూరు, మహబూబ్ నగర్,డీకే అరుణ,జైపాల్ రెడ్డి,
మహబూబ్ నగర్ మ్యాప్ (Image : Google Maps)


మహబూబ్‌నగర్ లోక్ సభ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డి గెలుపు న‌ల్లేరు మీద న‌డ‌కేన‌ని ఆ పార్టీ వ‌ర్గాలు భరోసాతో ఉన్నాయి. ఎన్నిక‌ల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతో నారాయ‌ణ‌ పేటను జిల్లాగా చేశారు. టీఆర్ఎస్, బీజేపీ, జ‌న‌తా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ వ‌రుస‌గా ఎంపీ సీటును కైవ‌సం చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ఉద్యమానికి ఈ జిల్లా ఊపిరి పోసింది. ఇక్కడ ఎన్నికైన ఎంపీలు జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు.

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల వివరాలు :



















































































ఎన్నికలు గెలిచిన అభ్యర్థి పార్టీ
1952-57 కె.జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్
1957-62 జె.రామేశ్వరరావు కాంగ్రెస్
1962-67 జె.బి.ముత్యాల రావు కాంగ్రెస్
1967-71 జె.రామేశ్వరరావు కాంగ్రెస్
1971-77 జె.రామేశ్వరరావు తెలంగాణ ప్రజా స‌మితి
1977-80 జె.రామేశ్వరరావు కాంగ్రెస్
1980-84 డాక్టర్ మ‌ల్లికార్జున్ కాంగ్రెస్
1984-89 జైపాల్ రెడ్డి జ‌న‌తా పార్టీ
1989-91 డాక్టర్ మ‌ల్లికార్జున్ కాంగ్రెస్
1991-98 డాక్టర్ మ‌ల్లికార్జున్ కాంగ్రెస్
1998-99 జైపాల్ రెడ్డి జ‌న‌తా పార్టీ
1999-04 జితేంద‌ర్ రెడ్డి బీజేపీ
2004-09 విఠ‌ల్ రావు కాంగ్రెస్
2009-14 కేసీఆర్ టీఆర్ఎస్
2014-19 జితేందర్ రెడ్డి టీఆర్ఎస్

గ‌త ఎన్నిక‌ల స‌ర‌ళిని ప‌రిశీలిస్తే.. జితేంద‌ర్ రెడ్డికి 32.94 శాతం ఓట్లు రాగా... కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన జైపాల్ రెడ్డికి 32.69 శాతం ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ నుంచీ బ‌రిలో ఉన్న నాగం జ‌నార్దన్ రెడ్డికి 26.88 శాతం ఓట్లు పోల‌య్యాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి కొత్తగా మ‌న్నె శ్రీ‌నివాస్ రెడ్డికి సీటు కేటాయించిన కేసీఆర్... ఆయ‌న‌ను గెలిపించే బాధ్యతను మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్‌కు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ నుంచీ కల్వకుర్తికి చెందిన వంశీచంద‌ర్ రెడ్డి బ‌రిలో ఉండ‌గా... నిన్నటి దాకా కాంగ్రెస్‌లో చ‌క్రం తిప్పిన డి.కె.అరుణ‌... బీజేపీ కండువా కప్పుకొని... ఆ పార్టీ తరపున పోటీలో ఉన్నారు. ఇపుడు ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌ మ‌ధ్యే ఉందని చెప్పవచ్చు.

వరుస విజయాలతో జోరుమీదున్న టీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో భారీ షాక్ త‌గిలింది. మూడు సీట్లను కోల్పోయింది. ఆ ప్రభావం లోక్ సభ ఎన్నిక‌ల్లో ఉంటుందన్నది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా. అన్ని పార్టీలు ఉన్నత వ‌ర్గాల‌కే సీట్లు కేటాయించ‌డంపై బ‌హుజ‌నులు గుర్రుగా ఉన్నారు. మ‌హిళ‌లు, యువ‌త‌, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల ఓట‌ర్లే కీల‌కం కానున్నారు. వీరు ఎవ‌రి వైపు మొగ్గితే వారే విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంది.
First published: March 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>