గ్రేటర్‌లో గెలుపెవరిది... ఫస్ట్ రిజల్ట్ హైదరాబాద్‌దే...

Telangana Lok Sabha Election Results 2019 : ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎలాగైతే ఫలితాలపై ఆసక్తి ఉందో, తెలంగాణలోనూ లోక్ సభ ఫలితాలపై ఆసక్తి కొనసాగుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 2:21 PM IST
గ్రేటర్‌లో గెలుపెవరిది... ఫస్ట్ రిజల్ట్ హైదరాబాద్‌దే...
చార్మినార్ (ప్రతీకాత్మక చిత్రం)
Krishna Kumar N | news18-telugu
Updated: May 22, 2019, 2:21 PM IST
హైదరాబాద్ నుంచీ ఈసారి ఢిల్లీకి వెళ్లే ప్రతినిధులెవరో కొన్ని గంటల్లో తేలిపోబోతోంది. గురువారం మార్నింగ్ 8 గంటల నుంచీ హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాల్లో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ జరగనుంది. గ్రేటర్‌ పరిధిలో అతి తక్కువ ఓట్లున్న హైదరాబాద్‌ లోక్‌ సభ ఫలితం తొందరగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఆపై సికింద్రాబాద్, చేవెళ్ల చివరిగా మల్కాజిగిరి లోక్‌సభ ఫలితాల్ని ప్రకటించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో అన్ని శాసనసభ స్థానాల్లో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. ఈవీఎం ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో 5 వీవీప్యాట్లను లాటరీ ద్వారా ఎంపిక చేసి... వాటిలో స్లిప్పులను లెక్కపెట్టి... ఈవీఎంలలో ఫలితాలతో సరిపోల్చుతారు. ఆ తర్వాత అంతా సరిగ్గా ఉంటే, ఫలితాన్ని ఆన్‌లైన్‌లోని ఈసీ వెబ్‌సైట్‌లో ఎంటర్ చేసి, అప్పుడు ప్రకటిస్తారు.

దేశంలోనే అత్యధిక ఓటర్లతో రికార్డు సృష్టించిన మల్కాజిగిరి లోక్‌సభ ఫలితం అధికారిక ప్రకటనకు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కుత్బులాపూర్‌ ఓట్లను అత్యధికంగా 34 రౌండ్లలో మేడ్చల్, ఎల్బీనగర్‌ శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లను 28 రౌండ్లలో లెక్కిస్తారు. అత్యధిక ఓట్లు పోలైన నియోకజవర్గాల్లో లెక్కింపు టేబుళ్లను కూడా 14 నుంచీ 24 వరకూ ఏర్పాటు చేశారు.

చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి అత్యధిక ఓట్లు నమోదైన శేరిలింగంపల్లి అసెంబ్లీ ఓట్ల కౌంటింగ్‌ 43 టేబుళ్ల ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల ఓట్లను ఎల్బీ, కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలు, ఉస్మానియావర్సిటీ, రెడ్డి వుమెన్స్‌ కాలేజీ, కోఠి వుమెన్స్‌ కాలేజీ, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్, నిజాం కాలేజీ, మాసబ్‌ట్యాంక్‌ పాలిటెక్నిక్‌, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాల ఓట్లను పాల్మాకులలోని గురుకుల పాఠశాలలో లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

 ఇవి కూడా చదవండి :

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు...

గోవాలో రష్యా మహిళపై అఘాయిత్యం... బైక్‌పై వెంటాడి... పగబట్టి...

కర్నూలులో టీడీపీ నేత దారుణ హత్య... రాడ్లు, కర్రలు, బండరాళ్లతో....

Ola Cab : ఓలా ఆఫీస్ ఎదుట క్యాబ్ డ్రైవర్ నగ్న నిరసన...
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...