హోమ్ /వార్తలు /తెలంగాణ /

Internet Usage: తెలంగాణ‌లో ఇంటర్​నెట్​ అమ్మాయిలు ఎక్కువ వాడుతారా? అబ్బాయిలా? సర్వేలో షాకింగ్​ రిజల్ట్స్​.. వివరాలివే

Internet Usage: తెలంగాణ‌లో ఇంటర్​నెట్​ అమ్మాయిలు ఎక్కువ వాడుతారా? అబ్బాయిలా? సర్వేలో షాకింగ్​ రిజల్ట్స్​.. వివరాలివే

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఇంట‌ర్ నెట్ మ‌న రోజువారి జీవితాల్లో ఎంత‌టి పాత్ర పోషిస్తోంది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే తాజాగా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే- 5 (NFHS-5) లో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి

(Balakrishna, News18)

ఇంట‌ర్ నెట్ (Internet) మ‌న రోజువారి జీవితాల్లో ఎంత‌టి పాత్ర పోషిస్తోంది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే తాజాగా జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే- 5 (NFHS-5) లో ఆశ్చ‌ర్య‌ప‌రిచే విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఈ స‌ర్వే (National Health Family Survey)  ప్రకారం తెలంగాణలో (Telangana) 15-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లో కేవలం 26.5% మంది మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. దేశంలో, 15-49 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో 33.3% మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. తెలంగాణలో 15-49 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 50% మంది పురుషులు (Men) ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో, 51.2% మంది పురుషులు ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.  15-49 సంవత్సరాల మధ్య వయస్సు గల స్త్రీలలో (Women) దాదాపు 17.1% మంది సాధారణంగా వార్తాపత్రిక లేదా మ్యాగజైన్‌ని చదువుతారు, 75.1% మంది మహిళలు కనీసం వారానికి ఒకసారి టెలివిజన్ చూస్తారు, 2.1% మంది మహిళలు వారానికి ఒకసారి రేడియో వింటారు, 15.7% మంది మహిళలు సాధారణంగా కనీసం నెలకు ఒకసారి సినిమా థియేటర్‌ని  వెళ్ల‌తార‌ని స‌ర్వే చెబుతుంది.

గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలలో..

దేశంలో 15-49 సంవత్సరాల వయస్సు గల పురుషులలో ముప్పై మూడు శాతం మంది అండ్ సగం కంటే ఎక్కువ మంది (51%) ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో సగానికిపైగా (52%) మహిళలు, 66% మంది పురుషులు ఇంటర్నెట్‌ను ఉపయోగించారు, గ్రామీణ ప్రాంతాల్లోని (In village) స్త్రీలలో నాలుగింట ఒక వంతు, 43% మంది పురుషులు మాత్రమే ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. వివాహం చేసుకోని స్త్రీలు, పురుషులు ఇతర వైవాహిక స్థితి సమూహాల కంటే ఇంటర్నెట్‌ను (వరుసగా 50% మరియు 57%) ఉపయోగిస్తోన్నారు. మొత్తం పై తెలంగాణ‌లో స్త్రీల కంటే పురుషులే ఎక్కువ శాతం ఇంటర్నెట్‌ను వినియోగిస్తోన్నార‌ని సర్వే చెబుతుంది. ఇందులో దాదాపు ఇంట‌ర్ నెట్ ను వార్త‌లు చ‌ద‌వ‌డానికి (To Read news) ఇత‌ర ఆన్ లైన్ కార్య‌క్ర‌మాల‌కు ఎక్కువ శాతం వాడుతున్నారు.

పల్లెల్లో ఉన్న మ‌హిళ‌లే..

పురుషుల్లో చాలా మంది ఇంట‌ర్ నెట్ ను వార్త‌లు చ‌ద‌వ‌డానికి రోజువారి వ్య‌వ‌హారాలు తెలుసుకోవ‌డానికి ఉప‌యోగ‌స్తోన్న‌ట్లు స‌ర్వేలో వెల్ల‌డైంది. తెలంగాణ పల్లె ప్రాంతాల్లో కూడా ఇంట‌ర్ నెట్ వినియోగం బాగానే ఉంది. ప‌ట్ట‌ణాల్లో కంటే పల్లెల్లో ఉన్న మ‌హిళ‌లే ఇంట‌ర్ నెట్ ను ఎక్కువ ఉప‌యోగిస్తున్నట్లు స‌ర్వే లో వెళ్ల‌డైంది. య్యూటూబ్ లో వంట‌ల కార్య‌క్ర‌మాలు ఇత‌ర ట్రావెల్ ను సంబంధించిన కార్య‌క్ర‌మాల‌ను చూడ‌డానికి ప‌ల్లే ప్రాంతాల్లో నెట్ ను ఎక్కువ మంది ఉప‌యోగిస్తోన్న‌ట్లు స‌ర్వేలో వెల్ల‌డైంది.

First published:

Tags: Internet, Survey, Village, WOMAN

ఉత్తమ కథలు