Huzurabad : టీఆర్ఎస్‌కు హుజురాబాద్ అసెంబ్లీ అభ్యర్థి ఎవరు..? పక్కపార్టీనేతలే పార్టీ అభ్యర్థులుగా మారనున్నారా..?

Huzurabad : టీఆర్ఎస్‌కు హుజురాబాద్ అసెంబ్లీ అభ్యర్థి ఎవరు..? పక్కపార్టీనేతలే పార్టీ అభ్యర్థులుగా మారనున్నారా..?

Huzurabad by elections : ఈటలపై తన గళాన్ని విప్పుతున్న కాంగ్రెస్ పార్టీనేతను హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పోటికి దింపనుందా...? ఇప్పటికే ఆ స్థానాన్ని ఆశిస్తున్న మాజీ మంత్రులతో పాటు బీసీ నేతల పరిస్థితి ఏంటి.. పార్టీకి సెకండ్ కేటగిరి నాయకులు లేని హుజురాబాద్‌లో టీఆర్ఎస్ వ్యుహం ఎలా ఉండబోతుంది..?

  • Share this:
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు..పరిస్థితులను బట్టి ఇక్కడి నేతలు, అక్కడికి, అక్కడి నేతలు ఇక్కడికి పార్టీలు మారుతూ.. ఉంటారు..ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ రాజకీయాలు కూడా అదేవిధంగా మారాయి.. 19 సంవత్సరాలుగా ఈటల ఏకచత్రాధిపత్యం చేసిన నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ ఇప్పుడు అభ్యర్థుల వేటలో పడింది.. అక్కడ పోటి చేయించేందుకు పలువురితో మంతనాలు జరుపుతోంది.. ఈ క్రమంలోనే ఈటలకు ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేత కౌశిక్ రెడ్డి ని టీఆర్ఎస్ పార్టీ నుండి పోటి చేయించేందుకు సిద్దమవుతున్నారనే చర్చ కొనసాగుతోంది.

ఇందుకు అనుగుణంగానే మంత్రి కేటిఆర్‌తో కౌశిక్ రెడ్డి బహిరంగ మంతనాలే చేశారు..కౌశిక్‌రెడ్డి స్నేహితుడి తండ్రి పది రోజుల కిందట మరణించడంతో ఆయన దశ దినకర్మ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్‌ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డి కాసేపు ఆయనతో మాట్లాడుతూ కనిపించారు. కేటీఆర్‌ తిరిగి వెళ్లే సమయంలో కూడా మరోసారి ఆయన కారు వద్ద ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తోంది...ఇక వీటికి సంబంధించిన ఫొటోలు సైతం శుక్రవారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి..దీనికి తోడు ఈటలను టీఆర్ఎస్ మంత్రి పదవి చేపట్టిన నాటి నుండే...కౌశిక్ రెడ్డి ఆయనపై విరుచుకుపడుతున్నారు..?ఇన్నాళ్లు లేని అవినీతి మరకలపై పలు సంధర్బాల్లో నిలదీశారు. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆయన వంతపాడుతూ వస్తున్నాడు..దీంతోపాటు తాజాగా మంత్రి కేటిఆర్‌తో చర్చలు జరపడం..ఆయన పార్టీ మారి టీఆర్ఎస్ నుండి పోటి చేయనున్నారనే పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాని ఈ వార్తలను కౌశిక్‌రెడ్డి మాత్రం కొట్టి పారేశాడు..ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయన వరసకు సోదరుడు కావడంతో తాను పార్టీని వీడే ప్రసక్తి లేదని ఖండించాడు..అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కొద్దిరోజులే పార్టీకి అధ్యక్షత వహించనున్న నేపథ్యంలోనే ఇద్దరి భేటి ప్రాధాన్యతను చేకూర్చింది..ఇటు కౌశిక్ రెడ్డితో పాటు నియోజకవర్గంలోని ఈటలపై నిప్పులు చెరుగుతున్న మాజీ మంత్రి ప్రస్తుతం బీజేపీ నేత ఇనుగాల పెద్దిరెడ్డి , ప్రస్తుతం టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న బీసీ నేత వకుళభరణం క‌ృష్ణమోహన్‌లు కూడా పార్టీ ఆదేశిస్తే అక్కడి నుండి పోటి చేసేందుకు సిద్దమవుతున్నారు..అయితే టీఆర్ఎస్ మాత్రం ఇప్పుడే అభ్యర్థి పేరు చెప్పకుండా ఈటలకు వ్యతిరేకంగా పనిచేసే నాయకుల మద్దతు కూడగడుతుంది..ఇందులో భాగంగానే స్థానిక నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు గులాబి బాస్.

మరోవైపు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత పావులు కదుపుతున్నారు. ముందుగా అభివృద్ది మంత్రం జపించి...నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ నేపథ్యంలోనే ఆయన స్వయంగా మానేరు రివర్ ఫ్రంట్ అభివృద్దికి కావాల్సిన నిధులను విడుదల చేసి స్వయంగా గంగుల కమలాకర్‌కు జీవో కాపీ అందిందించారు. మరోవైపు మంత్రి కేటిఆర్ సైతం జిల్లా నేతలు, అధికారులతో పాటు పెండింగ్ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న రెండు మున్సిపల్ అభివృద్దిపై దృష్టించనున్నారు.

ఈటల రాజేందర్ రాజీనామా సమర్పించిన తర్వాత ఆయన సోమవారం బీజేపీలో చేరునున్నారు..అందుకోసం ఆయన నేడు ఢిల్లీకి తన అనుచరుతో ప్రత్యేక విమానంలో వెళ్లనున్నట్టు బిజెపి అధికారులు వెల్లడించారు. అయితే తన రాజీనామాను స్పీకర్ అమోదించిన తర్వాత ఆరు నెలల్లోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది..అప్పటిలోగా అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీలు ఎత్తులు పైఎత్తులకు వేదిక కానుంది.
Published by:yveerash yveerash
First published: