Home /News /telangana /

WHO IS THE KEY ROLE IN THE BJP TO TAKE EETALA RAJENDER INTO PARTY VRY HYD

Eetala Rajender : ఈటల బిజేపీతో మంత‌నాల వెనుక కీల‌క పాత్ర వ‌హించిన ఆ నేత ‌?

Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్

Eetala Rajender :స్పీకర్‌కు రాజీనామా లేఖ అందించనున్న ఈటల ..పదకొండు గంటలకు ముహుర్తం ఫిక్స్

Eetala Rajender : ఈటల రాజేందర్ ఇప్పుడు చాల ఉత్కంఠ త‌రువాత త‌న రాజ‌కీయ కార్య‌చ‌ర‌పై ఒక స్ప‌ష్టత ఇచ్చార‌నే చెప్పుకోవాలి. ఇప్ప‌టికీ అధికారింకంగా ప్ర‌క‌టించ‌క‌పోయిన ఆయ‌న బీజేపీ కండువా కప్పుకోవ‌డం దాదాపు ఖాయ‌మైపోయింది. ఇప్ప‌టికే ఎమ్మెల్యే ప‌ద‌వికి, టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయ‌న తాను బిజేపీలో చేరాతారా లేదా అనే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌కుండానే త‌న ప్రెస్ మీట్ ముగించారు.

ఇంకా చదవండి ...
    అయితే ఈటల బిజేపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక ఎవరు కీలకంగా వహించారనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది..ఈ నేపథ్యంలోనే పార్టీలో ఆ నాయ‌కుడు చొర‌వ‌తోనే ఈటెల క‌షాయ కండువా కప్పుకున్నారా అంటే అవున‌నే అంటున్నారు ఈటల స‌న్నిహితులు. అయనే వివేక్ వెంట‌క స్వామి , తాజా రాజకీయ పరిణామాల్లో ఈయ‌నే ఈటెల బిజేపీలో చేరాడానికి లైన్ క్లీయ‌ర్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం త‌రువాత టీఆర్ఎస్ లో కీల‌కంగా వ్య‌వ‌హారించాల‌ని వివేక్ భావించారు. అయితే త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల్లో ఆయ‌న‌కు ఆ పార్టీలో పెద్ద‌గా గుర్తింపు లేక‌పోవ‌డంతో ఆయ‌న బిజేపీ కండువా కప్పుకున్నారు.

    అయితే బీజేపీలో చేరిన‌ప్పుడు కూడా ఆ పార్టీ నేత‌ల నుంచి స్ప‌ష్ట‌మైన హామి వ‌చ్చిన త‌రువాతే ఆయ‌న పార్టీ మారారు. బిజేపీ నుంచి రాజ్య‌స‌భ‌కు పంపడం లేదా ఎదైన నామినేటెట్ పోస్ట్ ఇస్తామ‌ని బిజేపీ పెద్ద‌ల నుంచి హామి వ‌చ్చిన త‌రువాత పార్టీ మారారు వివేక్. అయితే పార్టీ చేరి రెండేళ్లు అవుతున్న ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న‌కిచ్చిన హామిలు నేర‌వెర‌క‌పోవ‌డంతో కాస్త అసంతృప్తిగా ఉన్నార‌ని తెలుస్తోంది.

    దీంతో ఆయన పార్టీ రాష్ట్ర అధినేత బండి సంజ‌య్ వెంట న‌డిచాడు.. ఇప్పుడు ఇక లాభం లేద‌ని కేంద్ర మంత్రి కోట‌రీలోకి చేరిన‌ట్లు తెలుస్తోంది. ఈ కోట‌రిలో చేరాడ‌నికి త‌న లైన్ క్లీయ‌ర్ చేసుకోవాడ‌నికి ఈటెలను బిజేపీలోకి తీసుకురావ‌డంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించార‌ని తెల‌ుస్తోంది. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ద్వారా మంత‌నాలు జ‌రిపి ఈటల‌తో ర‌హాస్య భేటీల త‌రువాత అధిష్టానం నుంచి స్ప‌ష్ట‌మైన హామీలు వ‌చ్చిన త‌రువాత ఈటెలను పార్టీలోకి తీసుకొచ్చార‌ని తెలుస్తోంది. అందులో భాగంగానే ఈటెల ఢిల్లీ టూర్ లో వివేక్ క‌నుస‌న్న‌ల్లో జ‌రిగింద‌ని తెలుస్తోంది.

    ఈటల‌ను పార్టీలోకి తీసుకొస్తే తానుకు కూడా పార్టీలో పూర్తి స్థాయి గుర్తింపు రావ‌డంతోపాటు త‌న‌కిచ్చిన హామీల‌పై బిజేపీ పెద్ద‌లు ఏమైన నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న‌తోనే వివేక్ ఈటెలను బిజేపీలోకి తీసుకురావ‌డానికి క‌ష్ట‌ప‌డ్డార‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వివేక్ బిజేపీలో చేరిన త‌రువాత బండి సంజ‌య్ తో స‌న్నిహితంగా ఉన్నారు... త‌న‌కిచ్చిన హామిని బిజేపీ పెద్ద‌ల నుంచి వ‌చ్చేలా బండి సంజ‌య్ చేస్తారాని ఇన్ని రోజులు న‌మ్మ‌కం పెట్టుకున్నారు ఆయితే రెండేళ్లు అవుతున్న ఇప్ప‌టికి ఒక క్లారిటీ రాక‌పోవ‌డంతో వివేక్ బండి గ్రూప్ నుంచి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి గ్రూప్ కు మారిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న స‌హాకారంతోనే ఇప్పుడు ఈటెల‌ను పార్టీలోకి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Eetala rajender, Huzurabad By-election 2021, Telangana bjp, Vivek Venkataswamy

    తదుపరి వార్తలు