Huzurabad by elections : హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంట్‌డౌన్.. ఎవరి బలాలు ఏమిటి.. ?

హుజూరాబాద్ (ప్రతీకాత్మక చిత్రం)

Huzurabad by Elections : హుజూరాబాద్ ఉప ఎన్నికకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఎన్నికల్లో గెలుపుకు ప్రధానంగా అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీలు తీవ్ర పోరు కొనసాగిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు మాదేంటే మాదని దీమాతో ఉన్నాయి.. అయితే ఆయా పార్టీల బలాబలాలు ఏమిటీ.. ఏపార్టీకి సానుకూలా పవనాలు వీస్తున్నాయి..?

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల
    తెలంగాణలోని హుజూరాబాద్ ( Huzurabad by elections) ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (cec)షెడ్యుల్ విడుదల చేసింది. కాగా అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టొబర్ 8,  ఉప సంవసంహరణకు అక్టోబర్ 13 గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి..

    రాష్ట్ర రాజకీయాలను మార్చిన ఉప ఎన్నిక

    హుజూరాబాద్(Huzurabad by elections) ఉప ఎన్నిక సమరం చివరి అంకానికి చేరుకుంది. ముప్పై రోజుల ప్రణాళికతో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈటల రాజేందర్ రాజీనామా( Eetala rajender) తర్వత అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికల రాష్ట్ర రాజకీయాలనే మార్చివేసింది. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హుజూరాబాద్‌ను కైవసం చేసుకునేందుకు తీవ్ర పోరును కొనసాగిస్తున్నాయి. దీంతో గతంలో ఏ ఉప ఎన్నికలకు లేనట్టుగా ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ నేతలు నియోజకవర్గంలో మోహరించారు.. పోటాపోటిగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈటల రాజేందర్ పాదయాత్ర చేయగా అధికార టీఆర్ఎస్ ఏకంగా ముగ్గురు మంత్రులను రంగంలోకి దింపింది.

    ఇది చదవండి :హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల


    నాయకుల మోహరింపు

    అధికార టీఆర్ఎస్ నుండి మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్‌తోపాటు గంగుల కమలాకర్‌లు నియోజకవర్గంలోనే మకాం వేసి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అదనంగా ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నాయకుల మోహరింపు ,కుల సంఘాల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అదనంగా సీఎం కేసీఆర్ (cm kcr)సైతం ఎన్నికల ముందే దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్‌లో పర్యటించారు. సుమారు రెండు వేల కోట్లను కేటాయించి పథకాన్ని ప్రారంభించారు.

    నిధుల వరద

    మరోవైపు మంత్రులు నియోజవర్గంలోని పలు సమస్యలపై దృష్టి సారించారు. నియోజకవర్గంలోని అడిగిన అన్ని కులాలకు స్థలాలు, భవనాలకు నిధుల కేటాయింపు కూడా చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ (ktr)సైతం మున్సిపల్ శాఖ పరంగా ఉన్న సమస్యలను తీర్చేందుకు నిధులు విడుదల చేశారు. దీంతో జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటిలకు కావాల్సిన నిధులను అందించారు. ఇక నియోజకవర్గంతో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రం అభివృద్ది కూడ నిధులు విడుదల చేశారు.

    ఇది చదవండి : అమావాస్య రోజు ఆడపిల్ల పుడితే.. జరిగేది ఇదే!


    పదవుల పందేరం..నేతల చేరిక

    అభివృద్దితోపాటు నేతలకు పదవులు కూడా ఆ పార్టీ కట్టబెట్టింది. బీసీ అభ్యర్థి అయిన గెల్లు శ్రీనివాస్‌ను (Gellu srinivas)రంగంలోకి దింపడంతో పాటు ఎస్సీలను ఆకట్టుకునేందుకు దళితబంధును తీసుకువచ్చింది. జిల్లాకు చెందిన రసమయి బాలకిషన్‌కు సంస్కృతిక సారధి చైర్మన్‌గా మరోసారి పొడిగించారు. నియోజవర్గానికి చెందిన బండ శ్రీనివాస్‌ను ఎస్సి కార్పేరేషన్ చైర్మన్‌గా నియమించారు. దీంతోపాటు ఆయా పార్టీల్లో ఉన్న సీనియర్ నేతలను సైతం టీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుండి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డి, బీసీ వర్గానికి చెందిన టీడిపీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్ రమణతోపాటు బీజేపీ నుండి ఇతర నేతలను సైతం పార్టీలోకి ఆహ్వానించారు.

    దళిత బంధు ఆదుకుంటుందా..

    నియోజకవర్గంలోని 20వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా దళితబంధును ప్రభుత్వం తీసుకువచ్చింది.లబ్ధిదారుల ఎంపిక కూడ పూర్తయి.. వారి ఖాతాల్లోకి డబ్బులు కూడా చేరాయి. దీంతో కొంతమంది లబ్ధిదారులు వాటి ప్రయోజనాలు కూడ పొందుతున్నారు. అయితే 40వేల ఓట్లు ఉన్న దళిత వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని నేరుగా ప్రభుత్వ పథకం ద్వారా ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ పథకంపై మొదట్లో విమర్శలు వచ్చినా.. దళితుల స్కీం కావడంతో విపక్షాలు యూ టర్న్ తీసుకున్నాయి. నియోజకవర్గంలో అమలుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాయి.

    ఇది చదవండి : పవన్-పేర్ని నాని మధ్య ట్వీట్ల వార్.., ఎవరూ తగ్గట్లేదుగా..!


    నియోజకవర్గంలోనే ఈటల

    ఇక ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత నియోజవర్గంలోనే మాకం వేశారు. అనంతరం పాదయాత్ర నిర్వహించారు. అయితే అనారోగ్య కారణాలతో దాన్ని విరమించినా... నిత్యం నియోజకవర్గంలోనే ఉంటూ ఆయన భార్య జమునతోపాటు ఈటల రాజేందర్ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈటల రాజేందర్ ప్రచారానికి ఆయన చేసిన అభివృద్దితోపాటు ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న దళిత బంధు లాంటి పథకాలు తన రాజీనామా వచ్చాయని ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ అగ్రనాయకులతో ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.

    అభ్యర్థిని ప్రకటించని కాంగ్రేస్,,

    నియోజకవర్గంలో బీజేపీ,టీఆర్ఎస్ పార్టీలు హోరాహోరి పోరాడుతుండగా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉప ఎన్నికను లైట్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది. నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నిక తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కసరత్తు చేస్తున్నా... హుజూరాబాద్ పై మాత్రం పెద్దగా ఫోకస్ చేయలేదు..అయితే వరంగల్‌కు చెందిన కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తున్నా... నేటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కొండా సురేఖ పోటి చేయడం ద్వార అటు పద్మశాలిల ఓట్లతోపాటు మున్నూరు కాపుల ఓట్లను ఆకర్షించవచ్చనే నేపథ్యంలోనే దీటైన అభ్యర్థిగా ఆమెను దింపాలని పార్టీ నిర్ణయించింది. అయితే ఆ పార్టీ సైతం రెండు మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    వ్యుహత్మకంగా ఎన్నికల షెడ్యుల్

    ఈటల రాజీనామా చేసిన వెంటనే షెడ్యుల్ విడుదల చేస్తారని భావించినా .. కోవిడ్ ప్రభావంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాల అభిప్రాయాన్ని కోరింది. దీంతో బీజేపీ ఎన్నికల నిర్వహాణకు అభ్యంతరం చెప్పకపోయినా... అధికార టీఆర్ఎస్ మాత్రం కోవిడ్ ఉన్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది. దీంతో ఎన్నికల సంఘం వెనక్కి తగ్గింది.తాజాగా రాజీనామా చేసి నాలుగు నెలలు గడుస్తుండడంతో ఉప ఎన్నిక షెడ్యుల్ అనివార్యంగా విడుదల చేశారు.
    Published by:yveerash yveerash
    First published: