• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • WHILE TESTING THE CORONA FOR THE SARPANCH THE SWAB STICK BROKE AND GOT STUCK IN THE NOSE INCLUDING THE COTTON WOOL WRAPPED AROUND IT IN KARIMNAGAR DISTRICT VB KNR

Corona Test: కరోనా టెస్టు చేస్తుండగా.. ముక్కులోనే విరిగిన పుల్ల.. తర్వాత ఏమైందంటే..

ముక్కులో విరిగిన స్వాబ్ ను తీస్తున్న డాక్టర్ (Image credit Youtube)

Corona Test: సర్పంచ్​ ​కు కరోనా టెస్టు చేస్తుండగా స్వాబ్​ స్టిక్ విరిగి దానికి చుట్టిన దూదితో సహా ముక్కులోనే ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న డాక్టర్, సిబ్బంది తీసేందుకు ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. స్థానికులు వెంటనే కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ఈఎన్​టీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

  • Share this:
    కరోనా టెస్టులు చేసేటప్పడు స్వాబ్ స్టిక్ ను సాధారణంగా ముక్కులో పెడతారు. ముక్కులో పెట్టి రెండు సార్లు అటూ ఇటూ తిప్పిన తర్వాత బయకుతీసి దానిని కిట్ కు సంబంధించిన లిక్విడ్ లో వేస్తారు. దీని ద్వారా కొంత సమయానికి ఫలితం తేలిపోతుంది. అయితే ఆ గ్రామంలో కరోనా టెస్టు క్యాంప్ నిర్వహించిన వైద్య అధికారులకు ఓ సంఘటన ఎదురైంది. గ్రామంలో ప్రత్యేక కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ప్రారంభానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్‌ హాజరయ్యారు. మొదటగా అతడికే కరోనా టెస్టును చేయాలి కావునా అతడిని పరీక్ష నిర్వహించే స్థలంలో కూర్చొబెట్టి స్వాబ్ ను ముక్కులోని పంపించారు. అయితే ఆ పుల్లను అటూ ఇటూ తిప్పుతుండగా స్వాబ్ ​స్టిక్ (టెస్ట్ ​చేసే పుల్ల) విరిగి ముక్కులో ఇరుక్కుపోయింది. స్వాబ్​ స్టిక్ విరిగి దానికి చుట్టిన దూదితో సహా ముక్కులోనే ఇరుక్కుపోయింది. అక్కడే ఉన్న డాక్టర్, సిబ్బంది తీసేందుకు ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. స్థానికులు వెంటనే కరీంనగర్​లోని ఓ ప్రైవేట్​ఈఎన్​టీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్​పరిశీలించి ముక్కులో నుంచి గొంతులోకి వెళ్లిందని గుర్తించారు. ఎండోస్కోపి ద్వారా స్వాబ్​స్టిక్, దూదిని బయటకి తీశారు. అనుభవం లేని సిబ్బంది టెస్టు చేయడంతోనే ఇలా జరిగిందని సర్పంచ్ ఆరోపించారు.

    దీనికి సంబంధించి గ్రామస్తులు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గోపాల్​రావుపేట పీహెచ్​సీ ఆధ్వర్యంలో వెంకట్రావ్​పల్లిలోని పంచాయతీ ఆఫీస్​వద్ద కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులు ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో సర్పంచ్ జవ్వాజి శేఖర్ కు హెల్త్ సూపర్ వైజర్ కరోనా టెస్ట్ చేస్తుండగా ముక్కులోనే స్వాబ్ (పుల్ల) విరిగిపోయింది. విరిగిన స్వాబ్ ను తొలగించేందుకు శేఖర్ ను కరీంనగర్ లోని ఈఎట్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే శేఖర్ ను పరీక్షించిన వైద్యులు ముక్కులో నుంచి గొంతులోకి వెళ్లిందని గుర్తించారు. అనంతరం స్కానింగ్ చేసి ఎండో స్కోపి ద్వారా ముక్కు నుండి స్వాబ్ బయటకి తీసినట్టు అధికారులు తెలిపారు. అనుభవం లేని సిబ్బంది టెస్టు చేయడంతోనే ఇలా జరిగిందని సర్పంచ్ శేఖర్ ఆరోపించారు.

    సర్పంచ్ ను పరిశీలిస్తున్న వైద్యుడు (Image credit : youtube)


    వారి నిర్లక్ష్యంతో నాలుగు గంటల పాటు నరకయాతన అనుభవించానని చెప్పారు. గొంతు నొప్పితో మాట్లాడడం కూడా కష్టమైందని పేర్కొన్నాడు. కరోనా పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు నిర్లక్ష్యం వ్యవహరించకూడదని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అతడు కోలుకున్న తర్వాత గ్రామ కేంద్రంలో నైపుణ్యంలేని సిబ్బందితో టెస్టులు చేయించారని పిర్యాదు చేశారు. కాగా, అతడికి జరిగిన ఘటనతో గ్రామస్థులు టెస్టు చేయించుకోవాలంటేనే భయపడిపోతున్నారు. అయితే, అధికారులు గ్రామస్థులకు నచ్చజెప్పి వారికి టెస్టులు చేస్తున్నారు. ఆ ఘటన అనుకోకుండా జరిగిందని వారికి వివరించారు.
    Published by:Veera Babu
    First published: