టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కి నోటీస్ గడువు ముగిసింది. అందువల్ల ఇవాళ 11 గంటలకు ఆయన పోలీసుల ముందు హాజరుకావాల్సి ఉంది. ఆయన హాజరు కాలేదు కాబట్టి, ఆయన్ని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రవి ప్రకాష్ ముందస్తు బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అందువల్ల రవి ప్రకాష్ అరెస్టవుతారన్న వాదన వినిపిస్తోంది. పోలీసులు రవి ప్రకాష్ కోసం గాలిస్తున్నారు. అలంద మీడియా సంస్థ డైరెక్టర్ కౌశిక్‌రావు కంప్లైంట్‌తో రవి ప్రకాష్‌పై ఫోర్జరీ, డేటా చోరీ కేసులు నమోదుచేశారు. ఈ నెల 9న రవి ప్రకాష్ ఇంట్లో సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఐతే, తనిఖీలు చేసిన రోజు నుంచీ రవి ప్రకాష్ కనిపించట్లేదు. ఆయన ఎక్కడికి వెళ్లిందీ చెప్పలేదని ఆయన భార్య తెలిపారు. రవి ప్రకాష్ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయి ఉన్నాయి. ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు... చివరిగా CRPC 41 కింద మరో నోటీస్ జారీ చేశారు. దాని ప్రకారం ఆయన మూడు రోజుల్లో పోలీసుల ముందు హాజరు కావాల్సి ఉంది. అలా జరగలేదు కాబట్టి అరెస్టు చేసే అవకాశాలున్నాయి.
ఇక ఇదే కేసులో టీవీ 9 మాజీ డైరెక్టర్ MVVN మార్తిని పోలీసులు సోమవారం ప్రశ్నించారు. టీవీ 9లో ఎవరు షేర్లు కొన్నారు.. ? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా? ఫోర్జరీ లేఖను ఎవరు తయారుచేశారు ? అని ప్రశ్నించారు. ఆయన నుంచీ సేకరించిన ఆధారాలతో... రవి ప్రకాష్‌ను ప్రశ్నించాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఈ కేసుపై ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు.
రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారని చెబుతున్న సంతకంతోపాటు ఫోర్జరీ వల్ల ఇబ్బందులు పడినట్లు చెబుతున్న వ్యక్తి అసలు సంతకాన్ని పోలీసులు ఇంతకుముందే సేకరించారు. ఆ రెండింటినీ పోల్చటంతోపాటు వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించి, ప్రాథమిక నివేదిక తెప్పించుకున్నారు. తనపై ఉన్న కేసులపై రవి ప్రకాష్ ఓవైపు నలంద మీడియా సంస్థ ప్రతినిధులతో రాజీ ప్రయత్నాలు చేస్తూ... మరోవైపు తనను అరెస్టు చెయ్యకుండా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఆయన ముంబై వెళ్లారనీ, కాదు ఏపీ వెళ్లారనీ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ ఎక్కడున్నదీ మాత్రం తెలియట్లేదు. విచారణకు హాజరైతే కచ్చితంగా అరెస్టు చేస్తారన్న ఉద్దేశంతో రవిప్రకాష్... విచారణకు హాజరు కావట్లేదని తెలుస్తోంది.
రవిప్రకాశ్‌తోపాటు సినీనటుడు శివాజీకి CRPC 160 సెక్షన్ కింద సైబరాబాద్ పోలీసులు రెండుసార్లు నోటీసులు జారీచేశారు. వీటికి ఇద్దరూ స్పందించలేదు. అందుకే సోమవారం రాత్రి మరోసారి CRPC 41 కింద నోటీసులు జారీచేశారు. తాజా నోటీస్ ప్రకారం మూడు రోజుల్లో విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఇవాళ విచారణకు రాకపోతే, ఇద్దర్నీ అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈజీగా పట్టుకోవచ్చు : రవి ప్రకాశ్ కోసం పోలీసులు ఎక్కడెక్కడో వెతకాల్సిన పనిలేదు. ఆయన గనుక తన సెల్‌ఫోన్ల నుంచీ సిమ్ కార్డులను తీసివేసి ఉండకపోతే, ఆయన ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు. సెల్‌ఫోన్లలో ఉండే IMEI నంబర్ ఆధారంగా... ఆయన ఎక్కడున్నదీ తెలిసిపోతుంది. ఐతే... అలా జరగాలంటే... సెల్‌ఫోన్లను స్విచ్ఛాన్ చెయ్యాలంటున్నారు టెక్నీషియన్లు. ఆయన తరపు లాయర్ 10 రోజుల గడువు కోరారు కాబట్టి... మరో ఐదు రోజుల్లో ఆయనే స్వయంగా పోలీసుల ముందుకు వస్తారనే అంచనా కూడా ఉంది. మొత్తానికి టీవీ 9 నుంచీ బయటకు వచ్చిన రవి ప్రకాశ్ ఏమైపోయారన్నది మిస్టరీగా మారింది.
ఇవి కూడా చదవండి :
నేడు పులివెందులలో జగన్ ప్రజాదర్బార్... రాయలసీమలో వైసీపీ గెలుపుపైనా సమీక్ష..?
టీడీపీకి 110 సీట్లు... వైసీపీకి యూత్ ఓట్లు... చంద్రబాబు సర్వేల్లో తేలింది ఇదేనా..?
ఏపీలో బుకీలకు షాక్... బెట్టింగ్ రద్దు చేసుకుంటున్న ప్రజలు... ఐపీఎల్ ఎఫెక్ట్...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ravi prakash, Telangana, Telangana updates, TV9