హోమ్ /వార్తలు /తెలంగాణ /

రవి ప్రకాశ్ ఎక్కడ..? గాలిస్తున్న పోలీసులు... సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్... నో క్లూ...

రవి ప్రకాశ్ ఎక్కడ..? గాలిస్తున్న పోలీసులు... సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్... నో క్లూ...

రవి ప్రకాశ్ (File)

రవి ప్రకాశ్ (File)

Ravi Prakash : టీవీ 9 మేనేజ్‌మెంట్‌ తనపై లేని పోని ఆరోపణలు చేస్తోందంటూ రివర్సైన రవి ప్రకాశ్ ప్రస్తుతం ఎక్కడున్నారు... ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు?

    టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌ సడెన్‌గా కనిపించకుండా పోయారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని సైబరాబాద్‌ పోలీసులు భావిస్తున్నారు. టీవీ9కు సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకునేందుకు సైబరాబాద్‌ ప్రత్యేక పోలీస్‌ టీమ్, సైబర్‌ క్రైమ్‌ అధికారులు బంజారాహిల్స్‌లోని రవి ప్రకాశ్‌ ఇంటికి వెళ్లారు. ఆయన్ని మేనేజ్‌మెంట్ సీఈఓ పదవి నుంచీ తప్పించింది కాబట్టి ఆయన ఇంట్లో ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. తీరా చూస్తే... ఆయన బయటకు వెళ్లారనీ, ఎక్కడికి వెళుతున్నారో తమకు చెప్పలేదని ఇంట్లో వాళ్లు వివరించారు. రవి ప్రకాశ్‌ పోలీసులకు పూర్తిగా సహకరిస్తారనీ, ఇందుకు పదిరోజుల గడువు కావాలని ఆయన తరపు లాయర్... పోలీస్‌ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ పత్రం ఇచ్చారు.


    రవి ప్రకాశ్‌ ఎక్కడికి వెళ్లారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఆయన సన్నిహితులు, కొంతమంది టీవీ9 ఉద్యోగులను అడిగితే... వాళ్లు కూడా తమకు చెప్పలేదని అధికారులతో అంటున్నారు. సింపుల్‌గా కాల్ చేస్తే ఆయన ఎక్కడున్నదీ తెలిసిపోయేదే. ఐతే... రవిప్రకాశ్‌ సెల్‌ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేసుకున్నారు. అందువల్ల ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు అంచనాకొచ్చారు. ఆయన కోసం గాలిస్తున్నామని చెబుతున్నారు.


    ఈజీగా పట్టుకోవచ్చు : రవి ప్రకాశ్ కోసం పోలీసులు ఎక్కడెక్కడో వెతకాల్సిన పనిలేదు. ఆయన గనుక తన సెల్‌ఫోన్ల నుంచీ సిమ్ కార్డులను తీసివేసి ఉండకపోతే, ఆయన ఎక్కడున్నదీ తెలుసుకోవచ్చు. సెల్‌ఫోన్లలో ఉండే IMEI నంబర్ ఆధారంగా... ఆయన ఎక్కడున్నదీ తెలిసిపోతుంది. ఐతే... అలా జరగాలంటే... సెల్‌ఫోన్లను స్విచ్ఛాన్ చెయ్యాలంటున్నారు టెక్నీషియన్లు. ఆయన తరపు లాయర్ 10 రోజుల గడువు కోరారు కాబట్టి... పది రోజుల్లో ఆయనే స్వయంగా పోలీసుల ముందుకు వస్తారనే అంచనా ఉంది.


    టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు రెండో రోజూ ప్రశ్నించారు. టీవీ 9లో ఎవరు షేర్లు కొన్నారు.. ? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా? ఫోర్జరీ లేఖను ఎవరు తయారుచేశారు ? అని ప్రశ్నించారు. ఇక విచారణకు హాజరుకాని నటుడు శివాజీకి మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ వివరించారు. అప్పటికీ స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి టీవీ 9 నుంచీ బయటకు వచ్చిన రవి ప్రకాశ్ ఏమైపోయారన్నది మాత్రం అందరికీ మిస్టరీగా మారింది.


     


    ఇవి కూడా చదవండి :


    ఏపీలో కింగా, కింగ్ మేకరా... నేడు తేల్చనున్న పవన్ కళ్యాణ్...


    IPL Final Match : ఫైనల్ మ్యాచ్‌కి సిద్ధమైన CSK, MI... జోరుగా బెట్టింగ్, బ్లాక్ టికెట్ల దందా


    ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్... ఒక్కో ఎమ్మెల్యే రేటు రూ.30 కోట్లు..?


    జగన్ కి శ్రీ రెడ్డి సపోర్ట్... వైసీపీ లోకి ఎంట్రీ..? మరో రోజా అవుతారా..?

    First published:

    Tags: Ravi prakash, Telangana News, Telangana updates, TV9

    ఉత్తమ కథలు