హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ద‌స‌రా సెల‌వుల‌కు ఊరెళ్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌లు పాటించండి

Telangana : ద‌స‌రా సెల‌వుల‌కు ఊరెళ్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌లు పాటించండి

ప్రతికాత్మక చిత్రం

ప్రతికాత్మక చిత్రం

Telangana : పండ‌గ సెలవులు వ‌స్తే పిల్ల‌ల‌కు, ఆఫీస్‌ల‌కు సెలవులు వ‌స్తాయి. అంద‌రూ సొంత ఊర్ల‌కు వెళ్తుంటారు. ఇదే అద‌నుగా చూసి తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేసి దొంగ‌లు చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని పోలీసులు సూచిస్తున్నారు.

ఇంకా చదవండి ...

  - మ‌హేంద‌ర్‌, నిజామాబాద్, న్యూస్ 18

  పండ‌గ సెలవులు వ‌స్తే పిల్ల‌ల‌కు, ఆఫీస్‌ల‌కు సెలవులు వ‌స్తాయి. అంద‌రూ సొంత ఊర్ల‌కు వెళ్తుంటారు. ఇదే అద‌నుగా చూసి తాళం వేసిన ఇళ్ల‌ను టార్గెట్ చేసి దొంగ‌లు చోరీల‌కు పాల్ప‌డుతున్నారు. నిజామాబాద్‌ (Nizamabad) లో ఇప్ప‌టికే మూడు ఇళ్లాలో చోరీలు జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో జిల్లా వాసులు అప్ర‌మత్తంగా ఉండాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు లో ఉండ‌డంతో చోరీలు ఎక్కువ‌గా జ‌రిగే అవ‌కాశాలు ఎక్కువ‌. రైలు మార్గం ఉండటంతో మ‌హారాష్ట్ర దొంగ‌ముఠాలు సులువుగా చోరీలు చేసి రాత్రికి రాత్రే ఉడ‌యిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో జ‌నం, పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతం వెళ్లే వారిని గుర్తించి తాళం వేసిన రాత్రే చోరీకి పాల్ప‌డుతున్నారు.

  నిజామాబాద్ న‌గ‌రంలోని బాంక్ కాల‌నీలో నివాసం ఉండే విజ‌య్ కుమార్ సెప్టెంబర్ 29న కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి సొంతురికి వెళ్లారు.. ఆ రోజు రాత్రి తాళం ప‌గుల గోట్టి 12తూలాల బంగారు అభ‌ర‌ణ‌లు, 4ల‌క్ష‌ల రూపాయ‌లు దొంగ‌లు దోచుకేళ్లారు.. అంత‌కు ముందు దాదాపు 15 తులాల బంగారు నగలు అపహరణకు గురయ్యాయి.

  Fake TET Certificates : నకిలీ టెట్‌ సర్టిఫికెట్లతో టీచ‌ర్‌ ఉద్యోగం.. 36 మందిపై కేసు


  ఈ దొంగ‌త‌నాలు చేసిన దొంగ‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు.. త్వ‌ర‌లోనే ప‌ట్టు కుంటామాని చెబుతున్నారు.. దొంగ‌లు ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు రెక్కి నిర్వ‌హించి దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్నారని సీపీ కార్తీకేయ తెలిపారు. కావున ఇంట్లో విలువైన వ‌స్తువులు ఉంటే సెల‌వుల్లో ఊర్ల‌కు వెళ్లేవారు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చి వెళ్లాళ్తే మంచిద‌ని ఆయ‌న సూచిస్తున్నారు.

  ఏటా వంద‌ల దొంగ‌త‌నాలు..

  జిల్లాలో ప్ర‌తీ సంవ‌త్స‌రం సుమారు 750వ‌ర‌కు వివిధ రకాల చోరీ కేసులు వెలుగుచూస్తున్నాయి.. మహారాష్ట్ర దొంగ‌ ముఠాలు చేసిన చోరీలే సుమారు 250 వ‌ర‌కు ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఎక్కువ సెల‌వుల్లో ఊరికి వెళ్లిన స‌మ‌యాల్లోనే జ‌రుగుతున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. కాస్త కోవిడ్ ప్రభావం త‌గ్గ‌డంతో చాలా మంది కుటంబీకుల‌తో గ‌డిపేందుకు ఇళ్ల‌కు వెళ్తున్నారు. అయితే ఊరికి వెళ్లాల‌నే ఆరాటంలో ఇంట్లో విలువైన వ‌స్తువుల‌ను అలానే ఉంచి తాళాలు వేసి వెళ్తున్నారు. ప‌క్క‌న ఉన్న‌వారికి ఊరికి వెళ్తున్నారో లేక బ‌య‌ట‌కు వెళ్తున్నారో తెలీదు. ఇదే అద‌నుగా నిఘా వేసిన‌ దొంగ‌లు చోరీల‌కు పాల్ప‌డుతున్నారు.

  Huzurabad by-Elections : ప్లీజ్ మా ఇంటికి ప్ర‌చారానికి రావొద్దు.. మా ఓటు వారికే..


  ఏం చేయాలి..

  -ఇంటికి తాళం వేసిన‌ప్పుడు ప‌క్కింట్లో ఎవ‌రైనా ఉంటే ఊరికి వెళ్తున్నామ‌ని చెప్పి వెళ్ల‌డం మంచిది. వారు గ‌మ‌నిస్తూ ఉంటారు. దాని ద్వారా అలికిడి అయితే మీరు లేకుండా అలికిడ‌వుతుంద‌ని అనుమానంతో పోలీసుల‌కు వెంట‌నే స‌మాచారం అందించ‌వ‌చ్చు.

  - కాలనీల్లో రద్దీ పేపర్లు, ఖాళీ సంచుల కోసం వచ్చినావారు అనుమాన స్పదంగా క‌నిపిస్తే పోలీసుల‌కు స‌మాచారం అందించాలి.

  - కాల‌నీలో మ‌ధ్యాహ్నం, రాత్రి స‌మ‌యాల్లో కొత్త‌వారు క‌నిపిస్తే 100 కు డ‌యల్ చేయాలి.

  - ఇంటికి తాళం వేసి వెళ్లిన‌ప్పుడు బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఇంట్లో ఉండ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Nizamabad District, Nizamabad police, Telangana

  ఉత్తమ కథలు