Home /News /telangana /

Eetala Rajendar : సమయం చూసి రంగంలోకి దూకుతా...కరోనా తర్వాతే రాజకీయా నిర్ణయం .

Eetala Rajendar : సమయం చూసి రంగంలోకి దూకుతా...కరోనా తర్వాతే రాజకీయా నిర్ణయం .

ఈటల రాజేందర్

ఈటల రాజేందర్

Eetala Rajendar : సమయం వచ్చినప్పడు తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఈటల రాజేందర్ చెప్పారు. ఇందుకోసం కార్యకర్తలు నాయకులతో పాటు ఇతర పార్టీల నేతలతో కూడ సంప్రదింపులు జరుపుతున్నట్టు ప్రకటించారు.

    ఈటల అభిమానులంతా ఆయన వెంటే ఉంటామని స్పష్టం చేసినట్టు ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని పేర్కోన్నట్టు స్పష్టం చేశారు ఈ నేపథ్యంలోనే స్థానిక నేతల సలహలు సూచనలను తీసుకుని సమయం వచ్చినప్పుడు స్పందిస్తానని చెప్పారు.

    ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై తాను అడిగితే రాజీనామా చేసేవాడినని, కాని దుర్మార్గంగా సీఎం వ్వవహరించడంపై ఆయన మండిపడ్డారు. కాగా నేడు నియోజకవర్గ ప్రజలతో సమావేశం అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గం ప్రజలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, విదేశాల్లో ఉన్న వారు సైతం తనతో మాట్లాడుతున్నారని ఆయన జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.

    ప్రస్తుత సమయంలో రాజకీయాల కంటే కరోనాను ఎదుర్కోవడమే ముఖ్యమని చెప్పారు. అందుకే రాజకీయా పరమైన నిర్ణయాన్ని తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పారు. ఇతర పార్టీల నేతలు ,నాయకులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

    ఇక తనకు జరిగిన అన్యాయానికి కోర్టు ద్వార సమాధానం ఇస్తానని చెప్పారు. సీఎం కేసీఆర్ అనుమానాలకు ఎక్కువగా తావు ఇస్తున్నారని, ఏ ఇతర పార్టీ నేతలతో మాట్లాడినా..పార్టీలు మారుతున్నారనే ప్రచారం చేస్తున్నారని అన్నారు. అయితే 2014కంటే ముందు తాము కాంగ్రెస్ మంత్రుల వద్దకు వెళ్లి అభివృద్ది పనులు చేయించుకున్నామని కాని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు. కాని రానున్న రోజుల్లో అన్ని పార్టీల నేతలతో మాట్లాడి తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని చెప్పారు.

    మరోవైపు పార్టీ చర్యల తర్వాతే ఆయన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక్కరోజులోనే కక్షపూరితంగా వ్యవహరించడం..భూకబ్జా ఆరోపణలు చేసి , ఆ వెంటనే మంత్రి పదవి నుండి తప్పించడం అనంతరం చివరికి భర్తరఫ్ చేయడం లాంటీ పరిణామాలు ఈటలకు సానుభూతిని తెచ్చిపెట్టాయి. దీంతో అందుకే ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. సీఎం మంత్రి పదవి నుండి తప్పించినా..పెద్దగా స్పందించేందుకు ముందుకు రాలేదు. తానంతట తానుగా రాజీనామా చేసి బయటకు రావడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవడంతో పార్టీ నిర్ణయం తర్వాతే పూర్తి స్థాయిలో స్పందించేందుకు ఆయన ఆలోచనగా తెలుస్తోంది.

    ఇక సీఎం కేసిఆర్ కూడ ప్రభుత్వం తరుఫు నుండి తన నిర్ణయాలను వెంటనే అమలు పరిచినా..పార్టీ పరంగా 20 సంవత్సరాల పాటు సేవచేసిన వ్యక్తిని పూర్తిగా పార్టీ నుండి తొలగించడం ద్వార వ్యతిరేక పవనాలు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు.అయితే స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు జిల్లా మంత్రుల చేత ఆయన వ్యతిరేకంగా ప్రకటనలు చేసి అనంతంర పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఎవరు ముందు అనే దాంతో ఎత్తుకు పైఎత్తులు కొనసాగుతున్నాయి.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Eetala rajender, Karimangar, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు