ఎన్‌కౌంటర్‌పై NHRC రెండ్రోజుల విచారణ... నెక్ట్స్ ఏంటి?

Disha Case Encounter : దిశ హత్యాచార కేసులో ఎన్‌కౌంటర్‌పై NHRC సీరియస్‌గా దృష్టిసారిస్తోంది. ఏకంగా రెండ్రోజులపాటూ దర్యాప్తు చెయ్యడం కలకలం రేపుతోంది.

news18-telugu
Updated: December 9, 2019, 6:29 AM IST
ఎన్‌కౌంటర్‌పై NHRC రెండ్రోజుల విచారణ... నెక్ట్స్ ఏంటి?
ఎన్‌కౌంటర్‌పై NHRC రెండ్రోజుల విచారణ... నెక్ట్స్ ఏంటి?
  • Share this:
Disha Case Encounter : దిశ హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌లో కాల్చిచంపడంపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) ఏకంగా రెండ్రోజులపాటూ దర్యాప్తు చేసింది. మొదటి రోజు మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో నిందితుల మృతదేహాల్ని పరిశీలించి, నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి... దిశపై హత్యాచారం, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాలకు వెళ్లి పరిశీలించిన NHRC... రెండోరోజు... మళ్లీ నిందితుల ఎన్‌కౌంటర్ వివరాల్ని వివిధ కోణాల్లో పరిశీలించారు. ఈ పరిస్థితుల్లో నిందితుల కుటుంబ సభ్యులను పోలీసులు ఆదివారం హైదరాబాద్‌కి తీసుకెళ్లారు. వారిని NHRC ముందు ఉంచారు. వారిని NHRC సభ్యులు కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే నిందితుల మృతదేహాల్ని పోలీసులు... మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రి మార్చురీ గది నుంచీ మహబూబ్ నగర్ పట్టణానికి దగ్గర్లోని మెడికల్ కాలేజీకి తరలించి, భద్రపరిచారు. ఇవాళ మృతదేహాల్ని అప్పగించే అవకాశాలున్నా... దీనిపై NHRC సభ్యులు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దర్యాప్తు ముగించినట్లేనా లేక ఇంకా కొనసాగిస్తారా అన్నదాన్ని బట్టీ... మృతదేహాల్ని అప్పగించే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఐతే... మృతదేహాలకు మళ్లీ పోస్ట్‌మార్టం జరిపిస్తారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే... NHRC దర్యాప్తు మంగళవారం వరకూ కొనసాగే అవకాశాలుంటాయి.

డిసెంబర్ 6న జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ని ఏర్పాటు చేసింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులలో సిట్ ఏర్పాటైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఓవైపు NHRC దర్యాప్తు చేస్తుంటే... మళ్లీ సిట్ ఏర్పాటు ఎందుకంటున్నారు ఆ కొందరు. డిసెంబర్‌ 27న దిశ హత్యాచారం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం నలుగురు నిందితులను పోలీసులు విచారించేందుకు దిశను తగులబెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈనెల 6న తెల్లవారుజామున నిందితులు పోలీసుల దగ్గరున్న తుపాకులను లాక్కుని పోలీసుల మీద రాళ్లతో దాడి చేశారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. నిందితులు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రాణరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో నలుగురు నిందితులు చనిపోయారని తెలిపారు. దీనిపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

Pics : అందాల విందు చేస్తున్న అన్వేషి జైన్
ఇవి కూడా చదవండి :నేడు తెలంగాణ గవర్నర్ ప్రజాబాట... బీజేపీ వ్యూహం అదేనా?

నేడు లోక్‌సభలో పౌరసత్వ బిల్లు... ఆమోదం కోసం బీజేపీ విప్ వ్యూహంపాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి

Health Tips : ఎంతకీ చుండ్రు తగ్గట్లేదా? ఇలా చెయ్యండి చాలు

Published by: Krishna Kumar N
First published: December 9, 2019, 6:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading