Harishrao on Eetala: ఈటల గెలిస్తే వచ్చే లాభం ఏంటీ ..?

Harishrao on Eetala: ఈటల గెలిస్తే వచ్చే లాభం ఏంటీ ..?

Harishrao on Eetala: హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి అని మంత్రి హరీష్ రావు మరోసారి ప్రశ్నించారు.. గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.. కాని అక్కడి అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు నియోజకవర్గంలో వ్యక్తి ప్రయోజనమా... లేక హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలన్నారు..

  • Share this:
    హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిస్తే వచ్చే లాభం ఏంటి అని మంత్రి హరీష్ రావు మరోసారి ప్రశ్నించారు.. గెలిస్తే ఆయనకు మాత్రమే లాభం.. కాని అక్కడి అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు .నియోజకవర్గంలో వ్యక్తి ప్రయోజనమా... లేక హుజూరాబాద్ ప్రజల ప్రయోజనమా..అన్న చర్చ పెట్టాలన్నారు..దళిత బంధు హుజూరాబాద్ లో వద్దని ఈటల రాజేందర్ అంటున్నారని కాని...కళ్యాణ లక్ష్మి, రైతు బంధు తో పాటు దళిత బంధుపై బీజేపీ వైఖరేంటో బండి సంజయ్ ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు...

    రైతు బంధును హుజూరాబాద్ లో మొట్టమొదటి గా ప్రారంభిస్తే ఆనాడు ఈటల చప్పట్లు కొట్టారని...అదే సెంటిమెంట్ తో హుజూరాబాద్ లో దళిత బందు ప్రారంభిస్తామని సీఎం ప్రకటిస్తే గుండెలు బాదుకుంటున్నారని విమర్శించారు.దళిత బంధుపై బీజేపీ నేతలు‌ ఎన్నికల‌ సంఘానికి ఫిర్యాదు చేశారని .,తొందరగా ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని‌ కేంద్ర ఎన్నికల‌ సంఘం పై ఒత్తిడి తెస్తున్నారని దుయ్యబట్టార. దీని‌వల్ల దళిత బంధు పథకం ఆగిపోతుందని వారి ఆశ పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే రైతుబంధు, దళిత బంధు దండగ అనే బీజేపీ నేతలు ఈటల కావాలా...తెరాస కావాలా అన్న చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

    ఇక గత బడ్జెట్ లోనే దళితుల అభ్యున్నతికి 1200 కోట్లతో దళిత్ ఎంపవర్ మెంట్ స్కీం‌ ను ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో నేను ప్రకటించానని ఇప్పుడే అందుకే దళిత బంధును తీసుకువచ్చామని చెప్పారు. మరోవైపు గడియారాలు, కుట్టు మిషన్లు, గొడుగులు, కుక్కర్లను ఈటల రాజేందర్ పంచుతూ హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని మంత్రి హారిష్ రావు విమర్శించారు..

    అందుకే ప్రజలు సీఎం కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకుని, ఆ గడియారాలను పగుల‌గొడుతున్నారని అన్నారు..ఇక  తెరాస గెలుపు పక్కా..అని ఆయన ఆశభావం వ్యక్తం చేశారు.. ఇక 2014 లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాయి. తెరాస రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నెంబరు వన్ గా నిలిపింది. మరో వైపు మన దేశ జీడీపీ బంగ్లాదేశ్ కన్నా తక్కువగా పడిపోయోలా బీజేపీ పాలన సాగిందని ఆయన విమర్శించారు . హుజూరాబాద్ లో బీజేపీ వాళ్లు ఎం చెప్పి ఓట్లు అడుగుతారో చెప్పాలని అన్నారు...ఏడాదికి రెండు కోట్ల‌ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వ నందుకు ఓట్లు అడుగుతారా పెట్రోల్, డిజీల్, గ్యాస్ ధరలు పెంచామని చెప్పి ఓట్లు అడుగుతారా..అంటూ ఆయన విమర్శించారు..
    Published by:yveerash yveerash
    First published: