Home /News /telangana /

WHAT IS THE CONDITION OF NAMPALLY RAILWAY STATION AFTER SECUNDERABAD RAILWAY STATION WAS SET ON FIRE DUE TO AGNEEPATH SCHEME CONTROVERSY PRV

Secunderabad Railway Station: సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్​కు నిప్పు.. నాంపల్లి రైల్వేస్టేషన్లో​ పరిస్థితి ఎలా ఉందంటే..!

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్లో మంటలు

సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్లో మంటలు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రణ రంగమైంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. ఈ నేపథ్యంలో నాంపల్లి రైల్వే స్టేషన్​లో పోలీసులు అప్రమత్తమయ్యారు.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) రణ రంగమైంది. అగ్నిపథ్ ఆర్మీ నియామకాలను (AgnipathRecruitmentScheme )వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు స్టేషన్‌ను ముట్టడించారు. స్టేషన్‌లోని ఫర్నిచర్, షాపులను ధ్వంసం చేశారు. పట్టాలపై ఆగి ఉన్న మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. రాళ్లు దాడులు చేశారు. ఈ క్రమంలోనే రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. గాల్లోకి 15 రౌండ్ల కాల్పులు జరపడంతో కొన్ని బుల్లెట్స్ ఆందోళనకారులను తగిలినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఒక వ్యక్తి మరణించాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలించగా.. కాసేపటికే మృతి చెందాడు. మరికొందరు నిరసనకారులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    స్టేషన్లలో భద్రత..

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు ముందస్తు జాగ్రత్తగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను (Nampally Railway Station) మూసేశారు. ప్రయాణికులెవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా వరంగల్ నుంచి సికింద్రాబాద్, హైదరాబాద్ వైపు వచ్చే రైళ్లను వరంగల్ స్టేషన్లోనే నిలిపివేశారు. కాజిపేట, మహబూబాబాద్, తదితర స్టేషన్లలో భద్రత పెంచారు.

    సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మొత్తం మూడు రైళ్లు తగలబడ్డాయి. దర్భంగా, ఈస్ట్‌కోస్ట్, అజంతా ఎక్స్‌ప్రెస్ రైళ్లు మంటల్లో కాలిపోయాయి. స్టేషన్‌లో ఉన్న షాపులు, ఇతర ఫర్నిచర్‌ను కూడా ధ్వంసం చేయడంతో.. కోట్లల్లో ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిజాం కాలంలో నిర్మించారు. ఈ స్టేషన్ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. ఈ స్థాయిలో ఎప్పుడూ విధ్వంసం జరగలేదు. స్టేషన్ పూర్తిగా కళతప్పిపోయింది. ధ్వంసమైన షాపులు.. పగిలిపోయిన అద్దాలు... కాలిపోయిన రైళ్లతో.. స్టేషన్ మొత్తం గందరగోళంగా మారిపోయింది.



    వాస్తవానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ముట్టడికి సంబంధించి నిన్ననే NSUI ప్రకటన చేసింది. ఆందోళనకారులు స్టేషన్ పరిసరాల్లోకి వస్తే.. అడ్డుకుందామని పోలీసులు భావించారు. కానీ అనూహ్యంగా వేలాది మంది ఎలా వచ్చారన్నది అర్థం కావడం లేదు. ముందస్తు ప్రణాళికతో.. ఆందోళనకారులంతా ఎంఎంటీఎస్ రైళ్లలో స్టేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం స్టేషన్‌లో హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు. ఐతే ఈ ఘటనలతో NSUIతో సంబంధం లేదని ఎన్‌ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తెలిపారు. ఆందోళనకారుల్లో తమ యూనియన్‌కు చెందిన విద్యార్థులెవరూ లేరని ఆయన స్పష్టం చేశారు.

    అగ్నిపథ్ (AgnipathRecruitmentScheme ) ఎగ్జామ్ క్యాన్సిల్ కావడంతో 48 గంటల్లో 44 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని వెంకట్ తెలిపారు. ఆ బాధ, ఆవేదనతోనే విద్యార్థులు సికింద్రాబాద్ లో ఆందోళకు దిగారు. అంతేకానీ ఈ ఘటనతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలకు సంబంధం లేదన్నారు. సికింద్రాబాద్ అల్లర్లకు ఎన్ఎస్ యూఐ (NSUI) కారణమంటే వచ్చిన వార్తలను ఖండిస్తున్నామని వెంకట్ అన్నారు. సామాన్య ప్రయాణికులను ఇబ్బందిపెట్టేలా ఎవరూ వ్యవహరించకూడదని అలా ఎవరైనా కనిపిస్తే అడ్డుకోడానికి ప్రయత్నించలని ఎన్ఎస్ యూఐ శ్రేణులకు వెంకట్ సూచించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Agnipath Scheme, Army, Hyderabad, Secunderabad railway station

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు