WHAT IS SPECIALITY OF MEDAK CHURCH CHRISTMAS SPECIAL NEWS VRY MDK
Medak church Special news : ఒకనాటి కరువును ఆదుకున్న కరుణామయుడి చర్చ్..నేడు ఎలా ఉంది..?
Christmas special
Medak chueh Special news : క్రిస్మస్ వేడుకలకు అంత్యంత ప్రాచుర్యం పొందిన మెదక్ చర్చ్ సిద్దమైంది.. వేడుకల్లో భాగంగా విదేశాల నుండి సైతం పర్యాటకులతో పాటు భక్తులను ఆకర్షిస్తోంది.. ఇలా ప్రపంచవ్యాప్తంగా మెదక్ చర్చ్ ప్రశస్తం పై న్యూస్ 18 స్పెషల్ స్టోరీ...
కరుణామయుడి దివ్య కోవెల ,నమ్మిన బక్తులకు అండగా వుంటూ.. ఆసియా ఖండంలోనే తనకంటూ ప్రత్యేక స్థానాని నిలుపుకున్న చర్చ్, మెదక్ చర్చ్, కరుణామయుని జన్మను పురస్కరించుకొని క్రిస్మస్ సందర్బంగా ప్రత్యేకతను సంతరించుకుని విదేశాలనుండి సైతం పర్యాటకులను ఆకర్షిస్తుంది.
కాగా ఈ చారిత్రాత్మక కట్టడం ,దాదాపు 100 సంవత్సరాల నాటి కట్టడం యొక్క నిర్మాణ శైలికి అద్దంపడుతుంది మెదక్ పట్టణంలో గల సి.ఎస్.ఐ చర్చ్ ,లండన్ కు చెందిన పాస్నేట్ అనే మత గురువు మెదక్ ప్రాంతానికి వచ్చిన సమయంలో మెతుకు సీమా అంత కరువు, కాటకాలతోపాటు అనారోగ్యలతో, ఆకలితో వుండగా చలించి తన వంతు సహాయం చేయడానికి ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించాడు. దీంతో చర్చి నిర్మాణం కోసం నాడు పనికీ ఆహార పథకం ప్రవేశపెట్టి ఈ నిర్మాణంలో అందరికి పని కల్పించారు. ఇలా 1914 లో ప్రారంభమయిన ఈ చర్చి దాదాపు 12 వేల మంది కార్మికులు 10 సంవత్సరాలు కష్టపడి , 1924 నిర్మాణం పూర్తి చేశారు.
ఇలా మెదక్ పట్టణంలోని ఈ సుప్రసిద్ధ చర్చి అతిసుందర కట్టడంగా పేరుగాంచింది. అత్యద్బుతమయిన నిర్మాణ శైలి దీని సొంతం. ఆసియా ఖండంలోనే రెండవ పెద్ద చర్చగా గుర్తింపు పొందిన ఈ కేథడ్రాల్ చర్చ్, రఫ్ గోతిక్ శైలిలో నిర్మితమయినది. ఇటలి దేశస్థులతో పాటు భారత దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులు ,కళాకారులూ చర్చి నిర్మాణం పనుల్లో పాలుపంచుకున్నారు. ఈ చర్చి 200 అడుగుల పొడవు 100 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుని ,175 అడుగుల ఎత్తున్న శిఖరం ప్రత్యేక ఆకర్షణ గా రూపుదిద్దుకుంది. పూర్తిగా రాళ్ళు దంగుసున్నం తో నిర్మితమైంది.
ఈ చర్చ్ లో ప్రతి అడుగు ఒక కళాఖండం ,పిల్లర్లు, భీములు లేకుండా రెండు అంతస్తులతో విశాలమయిన ప్రార్థన మందిరాన్ని ,శికరాన్ని నిర్మించడం నాటి పనితనానికి అద్దం పడుతుంది. ఈ చర్చ్ కు వున్నా మరో ప్రత్యేకత లోపల వున్నా రంగు అద్దాలు ,ఈ అద్దాల పై ఏసు క్రీస్తు కు సంబంధించిన జనన వృత్తాంతం మొదలు కొని అయన శిలువ అయ్యేంతవరకు తిరిగి లేచెంత వరకు జరిగిన సంఘటనలు ముద్రించారు . అంతేకాక కేవలం సూర్య కిరణాలూ ప్రసరించినప్పుడు మాత్రమే ఆ అద్దాల పై ఈ చిత్రాలు ఏర్పడటం గమనార్హం.మిగిలిన సమయాలలో ఎంత ప్రయత్నించిన ఇవి కనపడవు.ఇక ఈ చర్చిలో ఒకేసారి దాదాపు 5 వేల మంది ప్రార్ధన చేసుకునే అవకాశం ఉంది. ,క్రిస్మస్ లాంటి ప్రత్యేక సందర్బాలలో మన రాష్టం నుండే కాకా వివిధ ప్రాంతాల నుండి భక్తుల భారిగా తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.
నేటి క్రిస్మస్ వేడుకలకు కూడా చర్చి ముస్తాబైంది.. కాగా గత సంవత్సరం కోవిడ్ కారణాలవల్ల నిరాడంబరంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయని, ఈ సంవత్సరం క్రిస్మస్ రోజున ఈ చర్చ్ ను సందర్శించుకోవడానికి సుమారు పది లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రిస్మస్ రోజు ఉదయం 4 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమవుతాయని ప్రత్యేక ఆరాధన కార్యక్రమం మొదలు కొని సాయంత్రం 8 గంటల వరకు ఆశీర్వాద ప్రవచనం ఉంటుందని ఇక్కడి వచ్చిన వారికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలను కల్పించామని తెలిపారు. సుమారు 500 మంది పోలీసు బలగాలతో పాటు వివిధ శాఖల సహాయంతో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.