హోమ్ /వార్తలు /తెలంగాణ /

Konijeti Rosaiah : .ఫ్యాక్షన్లు లేవ్… కక్షల్లేవ్… దిగజారుడు పాలిటిక్స్ అసలే లేవ్…

Konijeti Rosaiah : .ఫ్యాక్షన్లు లేవ్… కక్షల్లేవ్… దిగజారుడు పాలిటిక్స్ అసలే లేవ్…

Konijeti Rosaiah : ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక వేత్త, నిరాంబడరుడు... పార్టీ సిద్దాంతాలనే ఊపిరిగా కొనసాగిన రోశయ్య ఈ స్థాయికి ఎలా ఎదిగాడు.. సీఎం గా అవకాశం వచ్చినా... 
అర్థరాంతరంగా దిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..?

Konijeti Rosaiah : ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక వేత్త, నిరాంబడరుడు... పార్టీ సిద్దాంతాలనే ఊపిరిగా కొనసాగిన రోశయ్య ఈ స్థాయికి ఎలా ఎదిగాడు.. సీఎం గా అవకాశం వచ్చినా... అర్థరాంతరంగా దిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..?

Konijeti Rosaiah : ఉమ్మడి రాష్ట్రంలో 15 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక వేత్త, నిరాంబడరుడు... పార్టీ సిద్దాంతాలనే ఊపిరిగా కొనసాగిన రోశయ్య ఈ స్థాయికి ఎలా ఎదిగాడు.. సీఎం గా అవకాశం వచ్చినా... అర్థరాంతరంగా దిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..?

ఇంకా చదవండి ...

  జీ.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్ 18 తెలుగు, ఖమ్మం జిల్లా

  ఎనభై ఎనిమిదేళ్ల (88) వయస్సులో కొణిజేటి రోశయ్య కన్నుమూశాడు..! నిజానికి చాన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం కుదురుగా లేదు… వార్ధక్యంతోపాటు వచ్చే సమస్యలే… ప్రతిసారీ ఒక ప్రశ్న… ఎన్‌జీరంగా శిష్యుడు, ఫిఫ్టీస్‌‌లోనే కామర్స్‌లో డిగ్రీ, ఆంధ్రా ఉద్యమం… సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకుంటాడు, చదువుతాడు, పరిస్థితులకు సరిగ్గా అన్వయిస్తాడు… కాస్త వ్యంగ్యాన్ని రంగరించి ప్రత్యర్థుల మీదకు వదిలేస్తాడు… ఇక జవాబు ఏమివ్వాలో తెలియక ఎదుటోడు గిరగిరా…( United AP former cm konijeti Rosaiah was death ) ఇలా 15 సార్లు ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఆర్థిక బడ్జెట్ ప్రేవేశపెట్టారు.. ఒక దశలో వరుసగా ఏడుసార్లు… కాంగ్రెస్ సీఎంలు ఎవరైతేనేం, ఆర్థికం అనగానే రోశయ్యే… ఏ క్లిష్టమైన సబ్జెక్టు అయినా సరే, ఫైల్ రోశయ్య దగ్గరికి పంపించబడేది…

  అంతటి సీనియర్, అంతటి పరిణతి ఉన్న రోశయ్య ఓ బలమైన లీడర్‌గా ఎందుకు ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు… ఇదీ కాస్త ఇంట్రస్టింగ్ ప్రశ్న…అందరివాడిలా ఉండాలి, గ్రూపులు లేవు… ఎవరితోనూ కక్షల్లేవు… సంపాదనలో కక్కుర్తి లేదు… వారసత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నాలు లేవు…( United AP former cm konijeti Rosaiah was death ) ఆయన అచ్చంగా ఓ సగటు షావుకారు… దేనికైనా లెక్క ఉండాలి, ఖర్చులో పొదుపు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, ప్రతి పైసా ఖర్చుకు ఏదైనా ప్రయోజనం ఉండాలి… చివరకు డబ్బులు ఏట్లో వేసినా ఎంచి వేయాలనేవాడు…

  Konijeti Rosaiah: మాజీ సీఎం రోశయ్య ఇక లేరు.. అనారోగ్యంతో కన్నుమూత


  అయితే.. వర్తమాన రాజకీయ పోకడలకు దూరం… అనవసర వివాదాల్లో వేళ్లు, కాళ్లు, తల దూర్చేవాడు కాదు… నో ఫ్యాక్షన్స్… సీఎం ఎవరైనా సరే, ఎస్ సార్… దీంతో ఆయన ఎప్పుడూ రెండో శ్రేణిలోనే ఉండిపోయాడేమో… అఫ్‌కోర్స్, వైఎస్ మరణించినప్పుడు ఓ తాత్కాలిక సర్దుబాటుగా ముఖ్యమంత్రిని చేశారు తప్ప ఆయనపై హైకమాండ్‌కు పెద్ద ఆశలేమీ లేవు…( United AP former cm konijeti Rosaiah was death ) ఆయన కులం కూడా ఆయనకు ప్రతికూలం అయ్యిందేమో…

  ...ఎడాపెడా అప్పులు తేవడం, ప్రజలకు ఉదారంగా పంచిపెట్టడం పట్ల ఆయన విముఖుడు… సంక్షేమ వ్యతిరేకి కాదు, కానీ ఖజానా నుంచి ఖర్చయ్యే ప్రతి పైసాకు దీర్ఘకాలం ప్రయోజనాలు ఉండాలనే ధోరణి… వైఎస్ పథకాలను కూడా పలుసార్లు ఆంతరంగికంగా వ్యతిరేకించేవాడు… కానీ తప్పనిసరై ఆ పథకాలకు ఎలాగోలా డబ్బు సర్దేవాడు…

  మంచి ఆర్థికవేత్త వంటి పెద్ద పదం అక్కర్లేదు గానీ… రోశయ్య ఓ మంచి, సమర్థుడైన ఫైనాన్స్ మేనేజర్… సోనియా జగన్‌ను ఓ తలనొప్పిగా భావించడం, తనకు వైఎస్ వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి కావాలంటూ జగన్ పట్టుపట్టడం, సొంత పార్టీ ప్రయత్నాల్లో పడటం,( United AP former cm konijeti Rosaiah was death ) ఈలోపు వ్యూహాత్మకంగా తెలంగాణ ఇష్యూను ఓ డైవర్షన్ టాక్టిస్‌లా తెరపైకి తీసుకురావడం, జగన్ మీద కేసుల వల విసరడం… ఈ రాజకీయ సంధి దశలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఓ ప్రేక్షకపాత్రే పోషించాల్సి వచ్చింది… హైకమాండ్ చెప్పగానే అయిదు నిమిషాల్లో ప్రెస్‌మీట్ పెట్టేసి, తాను వైదొలుగుతున్నట్టు చెప్పేశాడు…

  Konijeti Rosaiah: ఆర్థిక మంత్రిగా.. ముఖ్యమంత్రిగా.. రాజకీయాల్లో రోశయ్య ప్రస్థానమిలా.


  ఆ క్షణానికి ఆయన సీఎం కుర్చీ మీద కూర్చున్న క్షణం నుంచే రెడీగా ఉన్నాడు… కాంగ్రెస్ వ్యవహారాలన్నీ ఔపోసన పట్టినవాడే కదా… కానీ విధేయత ఆయన బలం… అదే ఆయన బలహీనత కూడా… రాజకీయాల్లోని అవలక్షణాల్ని, విలువల రాహిత్యాన్ని, ప్రమాణాల పతనాన్ని ఎట్‌లీస్ట్, తనకు పూసుకోకుండా, వీలున్నంతలో స్వచ్ఛంగానే బతికి, వెళ్లిపోయిన రోశయ్యకు తెలుగు నేల నివాళి.

  First published:

  Tags: Congress, Telangana

  ఉత్తమ కథలు