హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister Mallareddy: రాబోయేది BRS ప్రభుత్వమే..అప్పుడు ఎవరిని వదలం..మల్లారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Minister Mallareddy: రాబోయేది BRS ప్రభుత్వమే..అప్పుడు ఎవరిని వదలం..మల్లారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

PC: Twitter

PC: Twitter

వచ్చే ఎన్నికల్లో BRS ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కేసీఆరే ప్రధాని అవుతాడని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక ఎవ్వరిని వదలం అని మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్ జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. నేడు మల్లారెడ్డి, అతని అల్లుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  వచ్చే ఎన్నికల్లో BRS ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, కేసీఆరే ప్రధాని అవుతాడని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేము అధికారంలోకి వచ్చాక ఎవ్వరిని వదలం అని మల్లారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై రైడ్స్ జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. నేడు మల్లారెడ్డి, అతని అల్లుడితో కలిసి మీడియాతో మాట్లాడారు. కాగా రెండు రోజులు పాటు మల్లారెడ్డి ఆయన బంధువుల నివాసాల్లో ఐటీ రైడ్స్ జరిగిన నేపథ్యంలో మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

  Big News: TRS ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్..ఎంపీ రఘురామకు సిట్ నోటీసులు!

  ఇది చరిత్ర..ఇలాంటి రైడ్స్ ఎప్పుడూ చూడలేదు..

  తెలంగాణ చరిత్రలో ఈ రైడ్స్ ఓ చరిత్ర. ఏకంగా 200లకు పైగా అధికారులు, పోలీసులు దాడులు చేయడం నేనెప్పుడూ చూడలేదని అన్నారు. 48 గంటల పాటు ఐటి రైడ్స్ ను కవర్ చేయడానికి మీడియానే అంత ఇబ్బంది పడితే మేము ఎంత ఇబ్బంది పడాలని అన్నారు. నా పెద్ద కొడుకుతో బలవంతంగా సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. మేము రౌడీలమా, దొంగలమా లేక డాన్ లమా అని మల్లారెడ్డి ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చే వరకు ఎన్ని అరాచకాలు చేసుకుంటారో చేసుకోవాలని మల్లారెడ్డి పేర్కొన్నారు. ఐటీ అధికారుల విధులకు భంగం కలిగినట్టు వచ్చిన ప్రచారంలో వాస్తవం లేదని మల్లారెడ్డి అన్నారు. ఐటీ అధికారులకు పూర్తిగా సహకరించానని, స్టేట్ మెంట్ పై సంతకం చేశాకే బయటకు వచ్చానని మంత్రి తెలిపారు. అలాగే ల్యాప్ టాప్ ను కూడా పోలీస్ స్టేషన్ లో ఇచ్చినట్లు తెలిపారు.

  ఇక తన ఇంట్లో రైడ్స్ జరుగుతున్నాయన్న విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి టర్కీ నుండి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్బంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ..ఐటీ అధికారులు మా కూతురు, తల్లిదండ్రులతో అమానుషంగా ప్రవర్తించారు. నేను టర్కీ నుంచి వచ్చాక మా కూతురితో మాట్లాడాను. మా ఇంట్లో సోదాల్లో 4 కోట్లు సీజ్ చేశారు. ఇంట్లో ఉన్న అమ్మాయితో అధికారులు ప్రవర్తించే తీరు ఇది కాదని ఆయన అధికారులపై ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీలో చేరాలనే పరోక్షంగా మాపై ఐటీ దాడులు చేస్తున్నారని మల్లారెడ్డి అల్లుడు ఆరోపించారు. మేము ఐటీ విచారణకు సహకరిస్తాం. కానీ అధికారులు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదన్నారు. నాకు ఎవరు ఫోన్ చేయలేదు. మీడియా ద్వారా తెలుసుకునే ఇక్కడకు వచ్చానని మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.

  Published by:Rajashekar Konda
  First published:

  Tags: Hyderabad, Malla Reddy, Mallareddy, Telangana

  ఉత్తమ కథలు