బడ్జెట్ సెషన్‌లో రాష్ట్రపతి (President) ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో మోదీ తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిరసనలకు కారణమయ్యాయి. . చాలా చోట్ల టీఆర్ఎస్ (TRS) నాయకులు మోదీపై నిప్పులు చెరిగారు. రాజకీయ నాయకుల విమర్శలు పక్కన పెడితే .. అసలు 2014లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టినప్పుడు ఏం జరింగింది. అనే అంశంపై ఇప్పుడు చర్చమొదలైంది. ఫిబ్రవరి 18, 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు (Andhra Pradesh Reorganisation Act 2014)ను లోక్ సభలో ప్రవేశ పెట్టారు .ఆ రోజు లోక్ సభ ప్రసారాలు నిలివేశారు. ఆంధ్రప్రాంత ఎంపీలు, సభ్యులు ఆందోళన, నిరసనలో మధ్య బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ గొడవల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లును స్పీకర్ ఆమోదించారు. ఆ రోజు గొడవ ముదరకుండా లోక్ సభ గ్యాలరీలు, డోర్‌లు మూసి వేశారు. ఆ బిల్లుకు బీజేపీ (BJP), కాంగ్రెస్ రెండు మద్దతు తెలిపాయి.
రోజు ఏం జరిగింది..
రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్ర ప్రాంత ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో పార్లమెంటు పరిసరాల్లో అసాధారణ భద్రత కల్పించారు. మొయిన్ గేటును మూసివేశారు. దీంతో పార్లమెంటుకు సభ్యులు కాలినడకనే వెళ్లారు. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేశారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటల తరువాత సభ ప్రారంభమైంది. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు వెల్‌లోకి దూసుకు వెళ్లారు.
బిల్లును వ్యతిరేకంగా సీసీఎం సభ్యులు తొలిసారిగా లోక్‌సభ (Lok Sabha) లో నిరసన తెలిపారు. శివసేన, అన్నాడిఎంకె, ఇతర పార్టీల ఎంపీలు కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో మార్షల్ వారిని అదులోకి తీసుకొచ్చారు. దీంతో సభను మధ్యహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.
PM Narendra Modi: వలస సంక్షోభానికి మీరే కారణం.. కాంగ్రెస్, ఆప్‌పై మోదీ విమర్శలు
సభ వాయిదా అనంతరం ప్రారంభం అయ్యింది. వెంటనే సీమాంధ్ర ఎంపీలు తమ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభ ప్రారంభం కాగానే లోక్‌సభ గ్యాలరీలు, ద్వారాలు మూసివేశారు. ఎంపీల గొడవ కారణంగా లోక్‌సభ ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు హొం మంత్రి షిండేకు స్పీకర్ మీరాకుమార్ అనుమతి ఇచ్చారు.
సభ్యుల నిరసన, గందరగోళం మధ్యలోనే షిండే బిల్లును ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడాగా బీజేపీ ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ బిల్లుపై మాట్లాడారు. ఆ తరువాత కాంగ్రెస్ నుంచి జైపాల్ రెడ్డి (Jaipal Reddy) మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లుపై 23 నిమిషాలు చర్చ జరిగింది. అనతరం మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. లోక్ సభ నిర్వహణ తీరుపై ఆగ్రహంగా తృణమూల్, జేడీయూ సభ్యులు వాకౌట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bjp, Lok sabha, Telangana, Trs