Home /News /telangana /

WHAT HAPPENED NEXT IN DISHA CASE AND ENCOUNTER NK

ఎన్‌కౌంటర్ అయ్యింది... నెక్ట్స్ ఏంటి? ఏం జరుగుతుంది?

చటాన్‌పల్లి అండర్‌పాస్

చటాన్‌పల్లి అండర్‌పాస్

Disha Case Encounter : దిశ హత్యాచారం హత్య కేసులో పోలీసులు నిందితుల్ని ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపడంతో ఈ కేసు ముగిసిపోలేదు. ఈ కొత్త కోణంపై పెద్ద చర్చే జరగనుంది.

    Disha Case Encounter : దిశ హత్యాచారం హత్య కేసులో నిందితులైన ఆరిఫ్, శివ, చెన్నకేశవులు, నవీన్‌ను షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి దగ్గర తెలంగాణ పోలీసులు తెల్లవారుజామున 3న్నర గంటలకు ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. ఐతే... దీంతో ఈ కేసులో నిందితులకు శిక్ష పడిపోయిందనీ, జస్టిస్ జరిగిపోయిందనీ చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐతే... ఈ కేసు ఇక్కడితో అయిపోలేదు. ఇంకా చాలా మిగిలే ఉంది. ఎన్‌కౌంటర్ చేశామన్నది పోలీసుల యాంగిల్ కాబట్టి... నిజంగానే ఎన్‌కౌంటర్ చేశారా లేక కావాలని వాళ్లను చంపేశారా అన్నది మానవ హక్కుల సంఘాల నుంచీ వచ్చే ప్రశ్న. అందువల్ల పోలీసులు... ఏ పరిస్థితుల్లో ఎన్‌కౌంటర్‌లో చేసిందీ, ఎందుకు చేయాల్సి వచ్చింది పూర్తి వివరాలతో కోర్టుకు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్‌కౌంటరే జరిగిందనేందుకు వీలైనన్ని ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో... పోలీసులు.... నిందితుల్ని కావాలనే కాల్చి చంపేశారనేందుకు కూడా అనుమానాలతో కూడిన ప్రశ్నలు తలెత్తే పరిస్థితులు ఉంటాయి కాబట్టి... పోలీసులు తమ వాదనను బలంగా వినిపించడం ద్వారా... ఆ అనుమానాలకు చెక్ పెట్టాల్సి ఉంటుంది. పోలీసులు చెప్పింది నిజమేననీ, నిజంగానే ఎన్‌కౌంటర్ జరిగిందని కోర్టు భావిస్తే... ఈ కేసు అక్కడితో క్లోజ్ అయ్యే అవకాశాలుంటాయి.

    ఒకవేళ నిందితుల తల్లిదండ్రులు లేదా మానవ హక్కుల సంఘాలు... ఈ ఎన్‌కౌంటర్ అంశంపై కోర్టుకు వెళ్తే... జరిగింది ఎన్‌కౌంటర్ కాదని పిటిషన్ వేస్తే... అప్పుడు ఈ కేసులో లోతైన దర్యాప్తు జరిపించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని వేసే అవకాశాలుంటాయి. ఎందుకంటే... ఇదివరకు 2008లో వరంగల్ యాసిడ్ ఎటాక్ దాడిలో నిందితుల్ని ఇలాగే ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపారు. మళ్లీ అదే విధంగా దిశ హత్యాచారం హత్య కేసులో కూడా... చెయ్యాలని ప్రజలు పెద్ద ఎత్తున కోరడం... అందుకు తగ్గట్లుగానే... సీన్ రీకన్‌స్ట్రక్షన్‌లో ఎన్‌కౌంటర్ జరగడంతో... దీనిపై నిందితుల తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆల్రెడీ చాలా ప్రాణభయంతో ఉన్న తమ పిల్లలు (నిందితులు) పోలీసుల దగ్గర ఆయుధాలు లాక్కొనేంత ధైర్యం చెయ్యరని అంటున్నారు. ఇలా దిశ హత్యాచారం హత్య కేసులో ఎన్‌కౌంటర్‌ను 99 శాతం మంది సమర్థిస్తుంటే... ఆ ఒక్క శాతం మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Disha murder case, Telugu news, Telugu varthalu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు