ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని (Agnipath) వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad railway station) చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు.
ఆర్మీ (Army) నియామకాల్లో అగ్నిపథ్ పథకాన్ని (Agnipath) వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో (Secunderabad railway station) చోటు చేసుకున్న ఆందోళనలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ మంచి పథకమని.. అయినప్పటికీ నిరసన తెలిపే పద్ధతి ఇది కాదని హితవు పలికారు. దీంతో ఆర్మీ నియామకాల్లో అగ్నిపథ్ పథకం ఉండి తీరాల్సిందేనని చెప్పకనే చెబుతున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్. ఇక సికింద్రాబాద్ విధ్వంసం వెనుక ఎవరున్నారని బండి సంజయ్ ప్రశ్నించారు. రాళ్లు వేసింది ఎవరో తెలియదని.. గోడలు కూల్చారంటూ అనుకోకుండా జరిగింది కాదని సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారం వున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు రెచ్చిపోయారని సంజయ్ ఆరోపించారు.
ఇంటె లిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది’?
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసకాండను పసిగట్టడం, నిరోధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంతకుముందు ఓ ప్రకటనలో బండి సంజయ్ ధ్వజమెత్తారు. ‘వేల మంది స్టేషన్ దగ్గర గుమిగూడుతుంటే.. రాష్ట్ర ఇంటె లిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది’అని ఆయన ప్రశ్నించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు బాధ్య తగా వ్యవహరించాల్సింది పోయి రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం దుర్మా ర్గం’ అని మండిపడ్డారు. రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసకాండ ఆవేశపూరిత చర్య కాదని, ముమ్మాటికీ పక్కా పథకం ప్రకారం జరిగిన దాడి అని స్పష్టమవుతోందని బండి ఆరోపించారు.
ఏమిటీ అగ్నిపథ్..?
కేంద్ర కేబినెట్ ఆమోదంతో కేంద్ర రక్షణ శాఖ అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్‌ను మంగళవారం ప్రకటించింది. సాయుధ దళాల్లో భారతీయ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు రూపొందించిన పథకం ఇది. ఈ స్కీమ్ ద్వారా అగ్నివీర్లను నియమించుకొని, వారికి సరైన శిక్షణ ఇచ్చి, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు కల్పించడమే ఈ స్కీమ్ లక్ష్యం. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారిని నియమించుకుంటామని మొదట ప్రకటించినా, నిరుద్యోగుల ఆగ్రహంతో గరిష్ట వయస్సును 23 ఏళ్లకు పెంచింది కేంద్ర ప్రభుత్వం.
ఎంపికైనవారికి మొదటి ఏడాది నెలకు రూ.30,000, రెండో ఏడాది నెలకు రూ.33,000, మూడో ఏడాది నెలకు రూ.36,500, నాలుగో ఏడాది నెలకు రూ.40,000 చొప్పున వేతనం లభిస్తుంది. మెడికల్, ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రూ.48 లక్షల నాన్ కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్స్యూరెన్స్ కవర్ కూడా వర్తిస్తుంది. అయితే ఇవి శాశ్వత ఉద్యోగాలు కావు. కేవలం నాలుగేళ్ల వ్యవధి కోసం నియమిస్తున్న ఉద్యోగాలు. నాలుగేళ్లలో ఆరు నెలలు శిక్షణ ఉంటుంది. మిగతా మూడున్నరేళ్లు అగ్నివీర్లు సాయుధ దళాల్లో సేవలు అందించాలి. అగ్నివీర్లు నాలుగేళ్లు సేవలు అందించిన తర్వాత వారికి ఎగ్జిట్ ఉంటుంది. వారిలో 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లో చేర్చుకుంటారు.
నాలుగేళ్ల తర్వాత ఏం చేయలి?
రెగ్యులర్ కేడర్‌లో చేరినవారు 15 ఏళ్ల పాటు నాన్ ఆఫీసర్ ర్యాంక్స్లో పనిచేయొచ్చు. ఎగ్టిట్ అయినవారికి రూ.11.71 లక్షల సేవా నిధి లభిస్తుంది. దీనికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఆ తర్వాత పెన్షన్, ఇతర బెనిఫిట్స్ ఉండవు. వారంతా మరో కెరీర్లో స్థిరపడేందుకు బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయి. కేంద్ర రక్షణ శాఖ వార్షిక డిఫెన్స్ బడ్జెట్ తగ్గించుకోవాలన్న లక్ష్యంతో అగ్నిపథ్ స్కీమ్‌ను రూపొందించింది. అంతేకాదు దేశ రక్షణలో భాగస్వాములుగా ఉండాలనుకునే యువతకు ఇది మంచి అవకాశంగా కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.