• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • WHAT ARE THE REASONS FOR THE INCREASE IN CORONA CASES IN THE TELANGANA VILLAGES VB MBNR

Covid 19: పల్లెలకు పాకిన కరోనా.. పెరుగుతున్న కేసులు.. కారణం ఇదేనా..!

Covid 19: పల్లెలకు పాకిన కరోనా.. పెరుగుతున్న కేసులు.. కారణం ఇదేనా..!

మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ గ్రామం

Covid 19: కరోనా వైరస్ పాలమూరు పల్లెల్లో విజృంభిస్తుంది. రెండు నెలల కిందట వరకు పట్టణాలకే పరిమితమైన కేసులు ఇప్పుడు పల్లెలకు పాకుతున్నాయి. గతంలో ఉమ్మడి ఐదు జిల్లాల కేంద్రాల తో పాటు జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, మక్తల్, అయిజ తదితర పట్టణాల్లో అధికంగా కేసులు ఉండేవి. కానీ ఇప్పుడు పల్లెల్లో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

  • Share this:
    (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

    పల్లెల నుంచి రైతులు ప్రతిరోజు కూరగాయలు, ఆలు, పండ్లు అమ్మడానికి పట్టణాలకు వచ్చి వెళ్తున్నారు. పట్టణాలకు వచ్చే ఆటోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో అందులో ఒక్కరికి ఉన్నా మిగతా వారికి వ్యాపిస్తుంది. గ్రామాల్లో అమ్మవారి జాతరలు, పండుగ పేరుతో సామూహిక కార్యక్రమాలు చేపడుతున్నారు. దీని ద్వారా వేగంగా కరోనా వ్యాపించే అవకాశం ఉంటుంది. దీంతోనే పల్లెల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. జడ్చర్ల పట్టణంతో పాటు శివారు గ్రామాల్లో ఎక్కువగా పోలేపల్లి సెజ్ లో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. ఈ సెజ్ లకు ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోతుంటారు. దీంతో ఒకరి ద్వారా మరొకరికి వైరస్ వ్యాపించింది. ఇటీవల కొన్ని గ్రామాల పరిధిలోని రోజుకు సుమారు 20 కేసులు నమోదైన సంఘటనలున్నాయి.

    రెండో దశ అనంతరం ఈ పట్టణంతోపాటు శివారు గ్రామాల్లో 2316 కేసులు నమోదయ్యాయి. అనధికారిక లెక్కల ప్రకారం 72 మంది కోవిడ్ బారిన పడి మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా లోని పెద్దకొత్తపల్లి మండలం చంద్ర బండ తండ లో వారం రోజుల కిందట కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 109 మందికి పాజిటివ్ వచ్చింది. ఇటీవల ఆ ఊరిలో ముత్యాలమ్మ పండుగను నిర్వహించారు. ఈ పండుగకు తాండా వాసులతో పాటు ఇతర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సమూహంగా పండుగను నిర్వహించుకున్నారు. పండుగ జరిగిన మూడు రోజుల తర్వాత కొందరు అస్వస్థతకు గురవడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలింది. గ్రామంలో పలువురికి అస్వస్థతగా ఉండటంతో పెద్దకొత్తపల్లి పి హెచ్ సి సిబ్బంది ప్రత్యేకంగా శిబిరం ఏర్పాటుచేసి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 109 మందికి పాజిటివ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

    ఇప్పుడు వారందరినీ హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. గతేడాది కోవిడ్ వైరస్ కు ప్రస్తుతం ఉన్న వైరస్ కు తేడా ఉంది ఈ వైరస్ ఇంట్లో ఒకరికి వస్తే కుటుంబం మొత్తం వ్యాపిస్తుందని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాంకిషన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటనతో కేసుల తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలన్నారు.
    Published by:Veera Babu
    First published:

    అగ్ర కథనాలు