ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఎవని హైకోర్టు ప్రశ్నించగా ఇంకా అప్ లోడ్ కాలేదని సిట్ తరపు న్యాయవాది చెప్పుకొచ్చారు. అలా అయితే ఆ ఉత్తర్వులు చూశాకే విచారణ చేద్దామని హైకోర్టు (High Court) పేర్కొంది. ఈ మేరకు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ వాయిదా వేసింది.
BL సంతోష్ ఎందుకు రావడం లేదు?
ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న BL సంతోష్ సిట్ విచారణకు ఎందుకు రాలేదని హైకోర్టు (High Court) ప్రశ్నించింది. దీనిపై సిట్ స్పందిస్తూ..మేము ఈనెల 16న BL సంతోష్ కు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించాం. కానీ కుదరలేదు ఎట్టకేలకు ఢిల్లీ పోలీసుల సహకారంతో నిన్న సంతోష్ కార్యాలయానికి నోటీసులు ఇచ్చాం అని తెలిపింది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఎవని కోర్టు (High Court) ప్రశ్నించింది. ఆ ఉత్తర్వులు ఇంకా రాలేదు సాయంత్రం వరకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనితో మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసింది. నోటీసులను సంతోష్ ఛాలెంజ్ చేస్తున్నారా? లేక విచారణకు సమయం కావాలని సిట్ ను అడుగుతున్నారా అని హైకోర్టు (High Court) ప్రశ్నించింది. దీనిపై సంతోష్ తరపు న్యాయవాది సమాధానం ఇచ్చారు. BL సంతోష్ ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఆయన రావడానికి సమయం పడుతుందని సిట్ కు లేఖ కూడా రాశారని సంతోష్ తరపు న్యాయవాది తెలిపారు.
మధ్యాహ్నానికి విచారణ వాయిదా..
ఇవాళ ఉదయం 10.30 గంటలకు మొదటి సెషన్ లోనే ఎమ్మెల్యేల ఎర కేసుకు సంబంధించి హైకోర్టు (High Court) విచారణ చేపట్టింది. ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించాలని అభిప్రాయపడ్డ కోర్టు మధ్యాహ్నానికి విచారణను వాయిదా వేసింది. మరి మధ్యాహ్నం సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఉత్తర్వులను పరిశీలించాక హైకోర్టు (High Court) ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ కేసుకు సంబంధించి సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు కొనసాగుతుంది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వలోని సిట్ బృందం తాజాగా మరో ఇద్దరికీ నోటీసులు ఇచ్చినరట్లు తెలుస్తుంది. వారిలో ఒకరు ఈ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న నందకుమార్ భార్య కాగా మరొకరు అంబర్ పేటకు చెందిన లాయర్ ప్రతాప్ గౌడ్ గా తెలుస్తుంది. వీరికి CRPC 41ఏ కింద నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. బుధవారం (నేడు) ఈ ఇద్దరు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. కానీ వ్యక్తిగత కారణాలతో ఇవాళ విచారణకు హాజరు కాలేనని నందకుమార్ భార్య సిట్ కు తెలిపినట్లు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Highcourt, Hyderabad, Telangana, TRS MLAs Poaching Case