హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం... ఇవీ ఈసారి ప్రత్యేకతలు...

Ganesh Immersion : వినాయక నిమజ్జనంలో దేశమంతా ఒక ఎత్తు... ఒక్క హైదరాబాద్‌లో మరో ఎత్తు. పండుగలా జరిగే ఈ కార్యక్రమంలో ఈసారి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: September 12, 2019, 6:35 AM IST
హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం... ఇవీ ఈసారి ప్రత్యేకతలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Ganesh Nimajjan : ఇదివరకు వినాయక నిమజ్జనం అంటే... రెండ్రోజులు జరిగేది. ఎప్పుడైతే ఖైరతాబాద్ వినాయకుణ్ని ఉదయమే తరలించడం మొదలుపెట్టారో... అప్పటి నుంచీ దాదాపు ఒకే రోజున వినాయక నిమజ్జనం పూర్తవుతోంది. ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చెయ్యడం వల్ల నిమజ్జనం అర్థరాత్రి కల్లా పూర్తవుతుందనే అంచనాలున్నాయి. పైగా... ఏ విగ్రహం ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో... విగ్రహాన్ని ప్రతిష్టించిన రోజే ఫిక్స్ చేసెయ్యడం వల్ల నిమజ్జనం సాఫీగా సాగిపోయే అవకాశాలున్నాయి. అలాగే 20 వేల మంది పోలీసులతో భద్రత, 23 చెరువుల్ని నిమజ్జనానికి రెడీ చెయ్యడం వల్ల... నిమజ్జన ప్రక్రియ వేగంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈసారి నిమజ్జనంలో కీలక అంశాల్ని చకచకా తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం ప్రత్యేకతలు :
- నిమజ్జనానికి రూ.20 కోట్లతో GHMC ఏర్పాట్లు.

- ప్రతి 3 కిలోమీటర్లకూ గణేశ్ యాక్షన్ టీమ్. మొత్తంగా 194 యాక్షన్ టీమ్‌లు.
- 23 చెరువుల దగ్గర 20 వేల విగ్రహాల నిమజ్జనానికి పూర్తి ఏర్పాట్లు.


- పంపిణీకి సిద్ధంగా 30.52లక్షల వాటర్ ప్యాకెట్లు.
- శోభాయాత్ర మార్గంలో 92 టాయిలెట్ల ఏర్పాటు.- 32 ప్రాంతాల్లో 93 క్రేన్లు, 134 మొబైల్ క్రేన్లు.
- 75 జనరేటర్ల ఏర్పాటు.
- రూ.99 లక్షలతో 36,674 తాత్కాలిక లైట్ల ఏర్పాటు.
- బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత మొదలవ్వనున్న శోభాయాత్ర.
- బాలాపూర్ నుంచీ హుస్సేన్‌సాగర్ వరకూ (18కి.మీ.) శోభాయాత్ర. ట్రాఫిక్ ఆంక్షలు అమలు.
- శోభాయాత్రలో విగ్రహాల వాహనాలకు మాత్రమే అనుమతి. అంబులెన్స్‌లకు మినహాయింపు.
- తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై ద్విచక్ర వాహనాలకే అనుమతి.
- శోభాయాత్ర మార్గంలో 36 ఫైరింజన్లు
- రేపు కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమలు.
- హుస్సేన్ సాగర్ దగ్గర 10 మంది గజ ఈతగాళ్లు.
- సరూర్‌నగర్, కాప్రా, ప్రగతి నగర్ చెరువుల దగ్గర 3 బోట్లు ఏర్పాటు.
- ఈ సంవత్సరం హైదరాబాద్‌లో 60 వేల విగ్రహాల్ని ప్రతిష్టించిన భక్తులు.
- 9 రోజుల్లో చాలా విగ్రహాలకు పూర్తయిన నిమజ్జనం.
- ఈసారి ప్రతి విగ్రహాన్నీ దగ్గర్లో ఉన్న చెరువులోనే నిమజ్జనం చెయ్యాలనే కండీషన్ అమలు.
- నిమజ్జనం పూర్తైన గంటల్లోనే వ్యర్థాల తొలగింపు. అందుబాటులలో పారిశుధ్య సిబ్బంది.
First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు