• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • WHAT ABOUT VEMULAWADA MLA CHENNAMANENI RAMESH BABU CONGRESS LEADER QUESTIONS MINISTER KTR AK KNR

Vemulawada: వేములవాడ ఎమ్మెల్యే ఇక రాడా ? కేటీఆర్ మాటలకు అర్థమేంటి ?

Vemulawada: వేములవాడ ఎమ్మెల్యే ఇక రాడా ? కేటీఆర్ మాటలకు అర్థమేంటి ?

కేటీఆర్

Vemulawada: గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోతే చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం.. అందుబాటులో లేకుండా పోయిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని అన్నారు. వేములవాడ

 • Share this:
  తనకు సిరిసిల్ల, వేములవాడ రెండు కళ్లు అన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. కేటీఆర్ వ్యాఖ్యలను బట్టి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ లేనట్టు.. ఇక్కడకు రానట్టు ప్రజలకు సంకేతాలు ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు. అభివృద్ధికి వేములవాడను ఆమడ దూరంలో ఉంచింది మీ నాయకుడే కదా అని ఆరోపించారు. అందుబాటులో ఉంటాము అని చెప్పి ఓట్లు వేసుకొని ప్రజలను మోసంచేసిన చెన్నమనేని రమేశ్‌పై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. గ్రామ సర్పంచ్ అందుబాటులో లేకపోతే చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం.. అందుబాటులో లేకుండా పోయిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారని అన్నారు. వేములవాడ ఆలయం అభివృద్ధికి రూ. 450 కోట్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

  కలికోట సూరమ్మ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎక్కడో ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో అటవీ భూములు పోతే మా మెడిపెల్లి మండలంలో నిరుపేదలకు ఇచ్చిన రెవెన్యూ భూములను అటవీ శాఖకు ఇచ్చారని అన్నారు. వేములవాడలో బాలికల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వేములవాడ పట్టణంలో భూగర్భ డ్రైనేజి నిర్మాణం ఏమైందని వ్యాఖ్యానించారు. VTDA కార్యాలయం వేములవాడకు తరలించాలని అన్నారు. గుడి చెరువును అభివృద్ధి పేరుతో పూడ్చి వేశారు కానీ కొత్తగా చెరువును తవ్వలేదని అన్నారు. వైఎస్ఆర్ వల్లే చందుర్తి, వేములవాడకు నీళ్లు వచ్చాయని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ వేములవాడను అభివృద్ధి చేస్తామని అంటున్నారు స్వాగతిస్తున్నామని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: