హోమ్ /వార్తలు /తెలంగాణ /

YSRTP : సంక్షేమం, స్వయం సమృధ్ధి, సమానత్వం..ఇవే మా పార్టీ ఎజెండా..! షర్మిల

YSRTP : సంక్షేమం, స్వయం సమృధ్ధి, సమానత్వం..ఇవే మా పార్టీ ఎజెండా..! షర్మిల

ఇందులో బాగంగానే బీసీల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నేడు మహబుబ్‌నగర్ ఉమ్మడి జిల్లా అయిన కోడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నారు. ఆ సభకు షర్మిల పాల్గొనున్నారు.

ఇందులో బాగంగానే బీసీల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నేడు మహబుబ్‌నగర్ ఉమ్మడి జిల్లా అయిన కోడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నారు. ఆ సభకు షర్మిల పాల్గొనున్నారు.

YS SHARMILA : పార్టీని ప్రకటించిన వైఎస్ షర్మిల తన పార్టీ ఎజెండాను ప్రకటించారు. ఎజెండాను త్రిబుల్‌ "ఎస్" ఫార్ములాను ప్రకటించారు. ఇందులో సంక్షేమం, స్వయం సమృద్ది, సమానత్వం అనే ఎజెండాను ప్రకటించారు. మహిళలకు యాబై శాతం రిజర్వేషన్లు, బీసీ ఎస్సీ, ఎస్టీలను రాజకీయంగా , ఆర్థికంగా అభివృద్దిపథంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పార్టీ పోరాటం చేస్తానని మాట ఇస్తున్నని ఆమె ప్రకటించారు. హైదరాబాద్‌లోని జెఎస్ఆర్ కన్వెషన్ల‌లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పార్టీ జెండాను అవిష్కరించి పార్టీని ప్రకటించిన అనంతరం ఆమె ప్రసంగించారు.

ఇంకా చదవండి ...

  అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆమె తన పార్టీ ఎజెండాను ప్రకటించారు, ఉద్యమకారులు, తెలంగాణ అమరులతో పాటు ప్రత్యేకంగా ప్రజలకు ఉపాధి కల్పించి..అప్పులు లేకుండా స్వయం సమృద్ది సాధించడమే పార్టీ లక్ష్యం వివరించారు. తెలంగాణలోని అన్నిపూలను చేర్చి బతుకమ్మను పేర్చినట్టుగా అన్ని మతాలు, వర్గాల వారిని సమానంగా అభివృద్దిలోకి తీసుకురావడమనే సమానత్వం లక్ష్యంగా పార్టీ పని చేస్తుందని స్పష్టం చేశారు.

  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు...

  ఇక మహిళలపై టీఆర్ఎస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ఎండగడుతూనే వారి స్థానిక సంస్థల్లో పనిచేసే..మహిళనాయకులు ఎమ్మెల్యేలు... మంత్రులుగా పనికి రారా అంటూ ప్రశ్నించారు. ఈ సంధర్భంలోనే తెలంగాణ శాసన సభలో చట్టప్రకారం 33శాతమే కాకుండా చట్టసభలో 50 శాతం మహిళలకే సీట్లను కేటాయిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో చరిత్రలోనే మహిళను హోం మినిస్టర్‌గా చేసిన ఘనత వైఎస్ఆర్‌ది అని ఆ వైఎస్ఆర్ బిడ్డగా తాను హమీ ఇస్తున్నానని చెప్పారు.


  బీసీ,ఎస్సీ,ఎస్టీలకు ప్రాధాన్యత..

  బీసీ సాధికారితపై ఆమె మాట్లాడారు. బడ్జెట్‌లో మూడు శాతం కేటాయిస్తే...ఎలా అభివృద్ది చెందుతారని అని ప్రశ్నించారు. ఇక చట్టసభలో కూడా 34శాతం ఉన్న రిజర్వేషన్లను 24 శాతనికి తీసుకువచ్చారని విమర్శించారు. బీసీలకు రాజ్యంగభద్రత లేదని, వారికి సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పారు. ఇందుకోసం రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మినహాయించి ఎక్కువ శాతం వారికే కేటాయిస్తామని మాట ఇస్తున్నట్టు ప్రకటించారు.

  దళిత ముఖ్యమంత్రి మాటపై తల నరుక్కోవడం ఎక్కడవరకు వచ్చింది సీఎం కేసీఆర్ గారు..?

  ఇక దళిత ముఖ్యమంత్రిపై కేసీఆర్ పై సెటైర్లు వేశారు..మాట ఇస్తే తప్పడని అంటారు..అవసరమైతే..తల నరక్కుంటారని అంటానని చెబుతాడని... మరి దళితులకు ముఖ్యమంత్రి హామి ఇచ్చిన సమయంలో ఆ తల ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. రాష్ట్రంలో దళితులను వంచన చేస్తూ...వారిపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు.వీరితోపాటు గిరిజన హక్కులపై స్పదించారు. ఏళ్లతరబడి పోడు భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ... సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని అన్నారు.

  భోజనాలు చేసిన ముఖ్యమంత్రులు..నీటీ సమస్యను పరిష్కరించుకోలేరా...?

  ఇక ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి భోజనాలు చేసిన ముఖ్యమంత్రులు రెండు నిమిషాలు కలిసి నీటి సమస్యను పరిష్కరించుకోలేరా... అంటూ నిలదీశారు..మరోవైపు కేంద్రం సైతం సమస్యపై స్పందించకపోవడం వెనుక...అన్ని పార్టీలు ఒక్కటే అని ఆరోపించారు. ఈ సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ది లేదా అంటూ ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టుల విషయంలో పార్టీ పరంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి బోట్టును కూడా వదులు కోకుండా...ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన నీటిని కూడా అడ్డుకోమంటూ స్పష్టం చేశారు..

  అసలైన వైఎస్ఆర్‌ వారసులం మేమే...

  వైఎస్ఆర్ వారసులుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆమె విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్టకట్టిందంటే అది వైఎస్ఆర్ కృషి అంటూ చెప్పుకొచ్చారు. ఇక వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయనపై ఎఫ్ఆర్‌ను నమోదు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన వారసులుగా చెప్పుకునే హక్కులేదని అన్నారు. ఇక నిత్యం సీఎం కేసిఆర్‌ను విమర్శించే..బీజేపీ అధ్యక్షుడు వారి కేసీఆర్ అక్రమాలపై సాక్ష్యాలు ఉన్నాయని చెబుతారని..ఒకవేళ సాక్ష్యాలు ఉంటే వాటిని ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, YS Sharmila

  ఉత్తమ కథలు