Rasi Phalalu : వార ఫలాలు... ఈ వారం ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ వార ఫలాలు తెలుసుకోండి...

Weekly Horoscope : గ్రహాల కదలికలు, రాసులను బట్టీ ఈ వారం ఎవరి అదృష్టం ఎలా ఉందో విజయవాడకు చెందిన ప్రముఖ జ్యోతిష్కులు రాళ్ళపల్లి వెంకటేశ్వర శర్మ (srivatcha@gmail.com) గారి ద్వారా తెలుసుకోండి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 7:50 PM IST
Rasi Phalalu : వార ఫలాలు... ఈ వారం ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ వార ఫలాలు తెలుసుకోండి...
వార ఫలాలు... ఈ వారం ఎవరి ఫలం ఎలా ఉంటుంది... మీ వార ఫలాలు తెలుసుకోండి...
Krishna Kumar N | news18-telugu
Updated: August 18, 2019, 7:50 PM IST
స్వస్తిశ్రీ చాంద్రమాన వికారి నామ సంవత్సర శ్రావణ బహుళ తదియ ఆదివారం అనగా ది.18-8-2019 నుంచి ది.24-8-2019 శనివారం వరకు ద్వాదశ రాశి వార ఫలాలు, పరిహారాలు.

మేషరాశి:- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు.
మేషరాశి వారికి ఈవారం ఉన్నత అధికారులతో, ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా, సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రుల వలన, సహ ఉద్యోగుల వలన, సహ వ్యాపారుల ద్వారా ధనలాభం వచ్చే అవకాశాలు కలవు. కుటుంబపరంగా సామాన్యంగా ఉంటుంది. సోదర, సోదరీ వర్గాలతో సన్నిహితాలు పెరిగే అవకాశాలు కలవు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. కుటుంబపరంగా చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటిని అధిరోహిస్తారు. కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. కీర్తిప్రతిష్టలు గడిస్తారు. వ్యవహారాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. ఈ మేషరాశివారు గణపతి ఆరాధన చేయటం మంచిది.

వృషభరాశి:- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
వృషభరాశి వారికి ఈవారం అనుకున్న పనులలో విజయం సాధించే అవకాశం కలదు. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కలవు. సోదరుల వలన లాభాలు కలగవచ్చు. నంతానపరంగా ప్రయాణాలు చేసే అవకాశాలు కలవు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. అవి కొంచెం ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యరీత్యా శారీరక శ్రమ ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, చికాకులు ఎదురవుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసివస్తుంది. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. విద్యార్థులు విద్యకోసం ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావడంతో, శారీరక శ్రమ కలగవచ్చు. వృత్తి, వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. ఉన్నత వ్యక్తులను కలిసే అవకాశాలున్నాయి. బంధువులతో, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. తీర్ధయాత్రలు చేసే అవకాశం కలదు. వృషభరాశివారు ఈవారం విష్టు సహస్రనామం చేయడం మంచిది.



మిధున రాశి:- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
మిధునరాశి వారికి ఈవారం విదేశీ విద్యా, ఉద్యోగ, వ్యాపార విషయాలలో అనుకూలమైన పరిస్థితులు కలుగుతాయి. ఉద్యోగ, వ్యాపారస్థులకు లాభదాయకం, సంతృప్తికరంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాల వలన లాభాలు కలుగవచ్చు. సంతానపరంగా చిన్నపాటి సమస్యలు... వాటివల్ల అనుకోని ప్రయాణాలు, అనుకోని నిర్ణయాలు తీసుకోవచ్చు. విద్యార్థులు దూకుడు తగ్గించడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. స్థిరాస్తి విషయాలలో నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. మానసిక ఒత్తిళ్ళు పెరగవచ్చు. మనస్సు స్థిరంగా ఉండదు. పారమార్ధిక చింతన కలిగి ఉంటారు. మిత్రుల వలన నహ ఉద్యోగ, వ్యాపారస్థుల వల్ల లాభాలు ఆనందదాయకంగా ఉంటాయి. వ్యవహారికంగా ఇబ్బందులు కలిగినా... వాటిని తెలివిగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు. మిధున రాశి వారు ఈవారం విష్ణు, దుర్తారాధన చేయడం మంచిది.
Loading...
కర్కాటక రాశి :- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
కర్కాటక రాశివారు ఈవారం సత్పురుషుల సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. విదేశ సంబంధిత వ్యవహారాలు లాభదాయకంగా ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు పొందవచ్చు. సోదర సోదరీ వర్గం వలన ధనం ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. ధన, భూ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. సంతాన పరంగా శుభవార్తలు వింటారు. కుటుంబపరంగా చిన్నచిన్న సమస్యలు తలెత్తవచ్చు. బంధువుల పట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్దిపాటి శత్రువుల వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. సహ ఉద్యోగులు, సహ వ్యాపారస్తుల విషయాలలో జోక్యం కలిగించుకోవడం మంచిది కాదు. అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. సమాజంలో కీర్తి పొందుతారు. పారమార్ధిక చింతన కలిగి ఉంటారు. తీర్థయాత్రలు చేయవచ్చు. కర్మాటక రాశి వారు ఈవారం దుర్గారాధన చేయడం మంచిది.

సింహరాశి : ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
సింహరాశివారు ఈవారం బంధువులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకున్న పనులు చేయిజారిపోయే అవకాశాలు కలవు. ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగవచ్చు. సోదరులతోను, ప్రయాణాలలో జాగ్రత్తలు వహించడం మంచిది. దూరప్రయాణాల వలన శారీరక శ్రమ, మానసిక ఆందోళన కలిగే అవకాశాలు కలవు. సంతానపరమైన ఇబ్బందులు... వాటి ద్వారా ధననష్టం కలిగే అవకాశాలు కలవు. విద్యార్థులు చెడు సావాసాలు పట్టే అవకాశం కలదు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యమైన లాభం కలగవచ్చు. వ్యాపార వ్యవహారాలలో జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ధనప్రాప్తి కలగవచ్చు. ఇతరుల వ్యవహారాలలో కల్పించుకోవడం మంచిది కాదు. దానివలన భంగపాటు పడవచ్చు. మిత్రులవల్ల అనుకోని ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. సింహరాశివారు ఈవారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

కన్యారాశి :- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
కన్యారాశి వారు ఈవారం చాలా జాగ్రత్త వహించడం మంచిది. ధనపరంగా కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. సోదరుల వలన లాభాలు వచ్చే అవకాశాలు కలవు. విద్యార్థులకు విద్యలో రాణింపు లభిస్తుంది. సత్పురుషుల సాంగత్యం కలిగే అవకాశాలున్నాయి. ఎదుటివారితో జాగ్రత్త వహించడం మంచిది. ధననష్టం కలిగే అవకాశాలు కలవు. శారీరక శ్రమ, ఆరోగ్యపరమైన సమస్యలు కొద్దిపాటిగా కలుగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు కలుగవచ్చు. అంతర్గత శతృవులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ధనలాభం కలుగవచ్చు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం కలదు. న్యాయపరమైన ఆలోచనలు చేస్తారు. అనుకున్న పనులలో కొద్దిపాటి ఇబ్బందులు కలుగుతాయి. ఇష్టదైవారాధన చేయడం మంచిది.

తులారాశి:- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
తులారాశివారికి మిత్రుల వలన కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవ్వవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదర, సోదరీవర్గంతో కొద్దిపాటి సమస్యలు రావచ్చు. భూసంబంధమైన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సంతానపరమైన శుభవార్తలు వింటారు. విద్యార్థులకు కొద్దిపాటి ఒత్తిడి ఉంటుంది. తద్వారా ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. కుటుంబపరమైన చికాకులు కలగవచ్చు. మనసు స్థిరత్వం తగ్గి బుద్ధి మందగించవచ్చు. శుభవార్తలు వింటారు, శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు. సత్కార్యాలలో పాల్గొంటారు. సత్పురుషుల సాంగత్యం లభిస్తుంది. తులారాశి వారు ఈవారం హనుమాన్‌ చాలీసా పారాయణ చేయడం మంచిది.

వృశ్చిక రాశి :- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
వృశ్చిక రాశి వారికి ఈవారం అనుకూలమైన సమయం. కొత్త కొత్త నిర్ణయాలు తీసుకొనే అవకాశం కలదు. ఉద్యోగ, వ్యాపారాలలో ధనపరంగా లాభదాయకంగా ఉంటుంది. శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు కలుగుతాయి. అనుకోని ప్రయాణాలు సంభవించవచ్చు. కొత్త పరిచయాలు కలుగుతాయి. కుటుంబపరమైన చికాకులు రావచ్చు. స్థిరాస్తి విషయాలలో ఇబ్బందులు పడే అవకాశం కలదు. జాగ్రత్త వహించడం మంచిది. పారమార్ధిక చింతన ఉండటంతో పరోపకార ఆలోచనలు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. విద్యార్థులకు విద్యా విషయాలలో సామాన్యంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈవారం విష్ణు సహస్ర నామం చేయడం మంచిది.

ధనస్సురాశి :- ది. ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
ధనస్సు రాశివారు ఈవారం చాలా జాగ్రత్త వహించాలి. అనుకున్న పనులు చివరిదాకా వచ్చి ఆగిపోయే అవకాశాలు కలవు. అనుకోని అప్పులు చేయవలసిన అవసరాలు రావచ్చు. మిత్రుల వలన కొద్దిపాటి ధనప్రాప్తి కలగవచ్చు. సోదరుల వలన చిన్నపాటి ఇబ్బందులు కలుగవచ్చు. ప్రయాణాల వలన శారీరక శ్రమ, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. విద్యార్థులకు శుభసమయం, కొత్త విద్యలపై ఆసక్తి చూపుతారు. సంతానపరంగా చిన్నపాటి సమస్యలు కలగవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. మధ్యవర్తి వ్యవహారాలు, ధనపరమైన హామీలు ఉండటం మంచిది కాదు. వాటి ద్వారా నష్ట పోయే అవకాశాలు కలవు. మానసిక ప్రశాంతత తగ్గే అవకాశాలు కలవు. ఎక్కువ సమయం ఇష్టదైవారాధన, దైవచింతన కలిగి ఉండటం మంచిది.

మకరరాశి:- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
మకర రాశి వారికి ఈవారం సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ప్రయాణాలలో చిన్నచిన్న ఇబ్బందులు కలుగవచ్చు. కుటుంబపరమైన, ధనపరమైన ఇబ్బందులు రావచ్చు. బంధువులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. శరీరం అలసిపోవుట, నిస్సత్తువగా ఉండే అవకాశం కలదు. ధనం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. లాభదాయకంగా ఉంటుంది. సోదరీ సోదర వర్గాల విషయంలో చిన్నపాటి చిక్కులు కలుగుతాయి.సంతానపరంగా ప్రయాణాలు కలుగవచ్చు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. చిన్నచిన్న వివాదాలు తొలగిపోయే అవకాశాలు కలవు. అనుకున్న పనులలో విజయం సాధిస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.

కుంభరాశి :- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
కుంభ రాశి వారికి ఈవారం లాభదాయకంగా ఉంటుంది. మిత్రుల, బంధువుల ద్వారా శుభవార్తలు వినే అవకాశం కలదు. వారం మధ్యలో చిన్నపాటి ఆందోళనలు కలుగవచ్చు. అనుకున్న పనులు నెరవేర్చటానికి శ్రమిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. సోదరుల వలన ఖర్చులు పెరగవచ్చు. చిన్నపాటి చిక్కులు కూడా కలగవచ్చు. ఆకస్మిక ప్రయాణాల వలన లాభాలు కలుగవచ్చు. సంతానపరంగా శుభవార్తలు వింటారు. వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించడం మంచిది. కుటుంబపరంగా చిన్నపాటి చికాకులు కలుగవచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులకు చిన్నపాటి ఆకస్మిక ధనలాభం కలగవచ్చు. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. దైవచింతన కలిగి ఉంటారు. కీర్తిప్రతిష్టలు కలుగుతాయి. శుభకార్యాలకి ఖర్చులు ఎక్కువగా పెడతారు. ఈ కుంభ రాశివారు లక్ష్మీ్నృసింహ ఆరాధన మంచిది.

మీన రాశి:- ది. 18-8-2019 నుండి ది. 24-8-2019 వరకు
మీన రాశి వారు ఈవారం ధనవిషయంగా బాగా శ్రమించి లాభిస్తారు. అనుకున్న పనులు సాధించడం కోసం శారీరక శ్రమ ఎక్కువగా చేస్తారు. వైద్యపరంగా ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావచ్చు. కుటుంబపరంగా, సోదరుల వలన ఆర్థికపరమైన చిక్కులు రావచ్చు. ఉద్యోగ, వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నా అనవసరమైన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు కలిగి వాటి వల్ల లాభం కలుగవచ్చు. ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమ అధికంగా ఉంటుంది. అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంది. మీన రాశివారు లక్ష్మీఆరాధన చేయటం మంచిది.

పైన చెప్పిన ద్వాదశ రాశి ఫలితాలు కాలచక్రంలో గ్రహగ్రతులను ఉద్దేశించి చెప్పినవి. వ్యక్తిగతంగా చెప్పినవి కావు. అందరికీ వర్తిస్తాయి. గమనించగలరు.
First published: August 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...