Corona Marriages: సాదాసీదాగా పెళ్లిళ్లు.. వందలాది వివాహాలపై కరోనా దెబ్బ..

ప్రతీకాత్మక చిత్రం

Corona Marriages: పెళ్లంటే నూరేళ్ళపంట. ఆకాశమంత పందిరి వేసి అట్టహాసంగా వివాహ వేడుక జరుపుకోవాలని చాలామంది కలలు కంటుంటారు.  కానీ కరోనా కాలంలో సృష్టిస్తున్న మరణ హోమానికి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో నిబంధనల మేర కుటుంబ సభ్యులు మధ్య నీరాండంబరంగా పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

 • Share this:
  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  ఉగాదితో మొదలైన కొత్త సంవత్సరం.. మే, జూన్ నెలల్లో పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాలు ఉన్నట్లు వేద పండితులు ప్రకటించారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాలుగు నెలల ముందే ఫంక్షన్ హాల్ అలంకరణలకు అడ్వాన్సు చెల్లించారు. ప్రస్తుతం రెండో దశ కరోనా విజృంభిస్తుండడంతో శుభకార్యాల నిర్వహణకు అడ్డంకిగా మారింది. వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పెళ్లిళ్ల నిర్వహణకు ప్రత్యేకంగా నిబంధనలను విధించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రెండు నెలలు దాదాపు పదివేల పెళ్లిళ్లు జరగవచ్చని వేద పండితులు అంచనా వేస్తున్నారు. మే ఆరో తేదీ నుంచి మొదలైన మంచి ముహూర్తాలు జూన్ 26వ తేదీ వరకు ఉన్నాయి. ఈ క్రమంలో లో కొందరు వాయిదా వేసుకో గా పలువురు వీటిని జరిపించుకునేందుకు భయాందోళనకు గురవుతున్నారు. తప్పని పరిస్థితుల్లో పరిమిత సంఖ్యలో సాదాసీదాగా తంతు పూర్తి చేసేందుకు సిద్ధపడుతున్నారు.

  అతిథుల మధ్య కోవిడ్ నిబంధనలకు పాటిస్తూ పెళ్లి చేసుకుంటున్నారు.. వివాహాలు ఇతర వేడుకలు కుటుంబ సభ్యులు ముఖ్యమైన అతిథులు 40 మందికి మించి ఉండరాదని అధికారులు చెబుతున్నారు. పెళ్లి జంట ఒక్కొక్కరి తరఫున 20 మంది మాత్రమే పాల్గొనాల్సి ఉంటుంది. వివాహ మండపాలు పెళ్లి చేయడం వల్ల అధికంగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున ఇళ్ల వద్ద వీటిని జరిపించాలని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అందుకు ముందస్తుగా స్థానిక తహసీల్దార్ తో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో కొద్దిమంది అతిథుల సమక్షంలో లో జరిగే పెళ్లికి సైతం చట్టబద్ధం చేసేందుకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవచ్చు. ఇందుకుగాను శుభలేఖ తో పాటు విద్యార్హత, ధృవ పత్రము, జనన ధ్రువీకరణ పత్రము వధూవరుల ఆధార్ కార్డు స్థానిక ధ్రువీకరణ, ముగ్గురు సాక్షుల తో పాటు అఫిడవిట్ సమర్పిస్తే వివాహాన్ని చట్టబద్ధం చేస్తారు. వివాహ వేడుకల్లో మాస్కులు శానిటైజర్ లు తప్పనిసరిగా ఉండాలి. పెళ్లి కి వచ్చే వారికి మాస్కులు అందించడంతోపాటు శానిటైజర్ అందించాలి.

  వివాహం చేసుకునే ముందు రోజు పెళ్లి వేదిక పూర్తిగా శానిటైజర్ చేయించాలి. పెళ్ళికి వచ్చే వారికి జ్వరం జలుబు వంటి లక్షణాల్ని గుర్తించేందుకు వీలుగా పరీక్షలు చేయాలి. కొంచెం అనుమానం వచ్చిన వారిని మండపంలోని కి రాని వొద్దని అధికారులు వివాహ బంధువులకు సూచిస్తున్నారు. మే, జూన్ మాసాల్లో పెళ్లిళ్ల అధికంగా ఉన్నాయని.. మే లో మొత్తం 16 ముహూర్తాలు ఉంటే జూన్ నెలలో 12 ఉన్నాయన పురోహితుడు గోపాలశర్మ తెలిపారు. సాదాసీదాగా జరిగే పెళ్ళిళ్ళతో వీటిపై ఆధారపడిన 16 రకాల వృత్తులు వ్యాపారులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
  Published by:Veera Babu
  First published: