తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా భారీ వానలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. అన్ని జలాశయాలు పూర్తిస్థాయిలో నిండిపోయాయి. ఐతే రాగల 3 రోజులు కూడా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వివరాల ప్రకారం... ఈశాన్య బంగాళాఖాతంలో దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా సెప్టెంబర్ 20న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో కొనసాగుతున్న అల్పపీడనం బలహీనపడింది. దీనికి అనుబంబధముగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉంది.
వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణ పేట జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనావేసింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు వెల్లడించింది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.