మార్చి రెండవ వారంలోనే ఎండలు ముదిరాయి.. గడిచిన 24 గంటల్లో సరాసరి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకున్నాయి. దీంతో రానున్న రెండు వారాల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.. కాగా నేడు, రేపు కూడా వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతవరణ నిపుణులు హెచ్చరించారు.ఈ రెండు రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్టు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఈ క్రమంలోనే వాతవరణ మార్పులకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.
కాగా గడిచిన 24 గంటల్లో నల్గొండలో 42 డిగ్రీలు, మంథనిలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా నల్గొండ పట్టణంలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత పదేళ్లలో ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. మే నెలల రావాల్సిన వడగాల్పులు కూడా మార్చిలోనే రానున్నట్టు అంచనా వేస్తున్నారు. అయితే ఇందుకు కారణం ఉత్తర భారతంలో వీస్తున్న వడగాలుల కారణంగా దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు పెరిగనున్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద ఈ రెండు రెండులు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని వాతవరణ నిపుణులు సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.