దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే ఐదు రోజులు చాలా ప్రాంతాల్లో 45-47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణ, చండీగఢ్ రాష్ట్రాల్లో ఎండ తీవ్రత సహా వడగాడ్పులు తెలంగాణ, ఏపీ, యానాం, విదర్భ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిసాల్లోనూ భారీ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వచ్చే ఐదు రోజులు ఆయా రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలావుంటే, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా మధ్య తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్ గఢ్‌లో 3.1కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ వడగాడ్పులు హడలెత్తించాయి. 48గంటల్లో ఉత్తరాంధ్రలోని కొన్నిచోట్ల ఉరుము లు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నా మరికొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులకు అవకాశం ఉంటుంది. దక్షిణకోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: WEATHER