Weather Update: భానుడి భగభగ...తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు...

హైదరాబాద్ లో శుక్రవారం ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండగా, కనిష్టంగా 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


Updated: May 29, 2020, 6:48 AM IST
Weather Update: భానుడి భగభగ...తెలుగు రాష్ట్రాలను ఠారెత్తిస్తున్న ఎండలు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భానుడి ఉధృతి కొనసాగుతోంది. పగటి ఉష్ణోగ్రతలు మండిపోతుండటంతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక తాజాగా తెలంగాణ, ఆంధప్రదేశ్ లోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయి. మరో 4 రోజుల పాటు వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో శుక్రవారం ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉండగా, కనిష్టంగా 28 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక శనివారం, ఆదివారం కూడా 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక జూన్ 1 నాటికే దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మే 31 న ఆగ్నేయ, పక్కనే ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని వల్ల రుతుపవనాలు సకాలంలో ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది.
First published: May 29, 2020, 6:48 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading